Wednesday, 6 May 2026

Blog

జోగులాంబ గద్వాల

ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి – ఎమ్మెల్యే విజయుడు.

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, అలంపూర్, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అలంపూర్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

వాతావరణ హెచ్చరిక

రాబోయే 03 గంటల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు మరియు అనకపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల మెరుపులతో కూడిన మోస్తరు ఉరుములు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి మరియు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది

ఆంధ్రప్రదేశ్

వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి దంపతులకు పుత్రసంతానం సినీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది

టాలీవుడ్‌ స్టార్ కపుల్‌ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి దంపతులకు పుత్రసంతానం కలగడంతో మెగాఫ్యామిలీ లో ఆనందం వెల్లివిరిసింది. ఈ శుభవార్త బయటకు రాగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ లావణ్య వివాహం 2023 నవంబర్‌ 1న ఇటలీలో జరిగింది. ఆ తర్వాత వీరు కలిసి ప్రతి వేడుకను, ప్రత్యేక సందర్భాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. పుట్టిన బిడ్డను తన చేతుల్లో ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబానికి చిన్నారి రాక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. “చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని కూడా వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ శుభవార్తపై ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు కూడా చిన్నారికి ఆరోగ్యం, ఆనందం కలగాలని ప్రార్థిస్తున్నారు. అభిమానుల స్పందన”మెగా వారసుడు వచ్చాడు”, “చిన్నారికి మెగా బ్లడ్ ఉంది”, “కొత్త అధ్యాయం ప్రారంభమైంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే విజయుడు.

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, అలంపూర్, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆలయ ఈవో దీప్తి, ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయుడికి శేష వస్త్రాలతో సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి కరపత్రాలను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆలయ ఈవో దీప్తికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో దీప్తి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వన్‌టౌన్‌లో టాస్క్ ఫోర్స్ దాడులు – అక్రమ దివాళీ సామగ్రి స్వాధీనం

విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో అక్రమంగా దివాళీ పటాకులు అమ్ముతున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు లక్ష రూపాయల విలువైన మందుగుండు సామగ్రి (పటాకులు)ను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో పట్టుబడిన షాపు యాజమాని పాలూరి ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, అనుమతి లేకుండా ప్రమాదకరమైన పటాకులు అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అన్నమయ్య

వేణుగోపాల్ రెడ్డి పెద్దకర్మలో పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి

పెనగలూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) పెనగలూరు మండలం గట్టు వారిపల్లి గ్రామంలో బొజ్జి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారి పెద్దకర్మ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన వేణుగోపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు

విశాఖపట్నం

మానవత్వం లేని తహశీల్దార్.

ప్రాణాలు పోతున్నా ఫోన్ చూసుకుంటున్న ప్రభుత్వ అధికారి.మెహబూబ్ నగర్ జిల్లా.ప్రభుత్వ అధికారి పనితనం పై ప్రభుత్వ అధికారి పని తీరుపై సోషల్ మీడియాలో వైరల్. తానా స్థలం వేరొకరు ఆక్రమించారని గోడు వెళ్ళబోసుకుంటూ తనకీ న్యాయం జరగటం లేదని తహసీల్దార్ ఆఫీసులో ఆవేదన. అట్టను వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగబోతుంటే…తాపిగా ఫోన్ చూసుకుంటున్న మెహబూబ్ నగర్ జిల్లా మధ్య తహశీల్దార్ సోంబేరి పులి రాజు. ఏం మనుషులురా బాబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. రిపోర్టర్: లోకేష్ కుమార్ (బాబీ).

హైదరాబాద్

తెలంగాణ బీజేపీ లో పదవుల చిచ్చు..

పున్నమి ప్రతి నిధి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ని తాజా గా అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ మీద పలువురు సీనియర్ లు అసంతృప్తి లో ఉన్నారు. కేవలం హైదరాబాద్ లో సెటిల్ అయినా జానకర్షణ లేని వ్యక్తులకి రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం మంచిది కాదని అంటున్నారు. MP, లు MLA లు చెప్పిన పదవులు ఇవ్వక పోవడం వెనుక రామ చంద ర్ రావు మార్క్ స్పష్టం గా కనిపిస్తుంది. కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో నే 10 మందికి రాష్ట్ర కార్యవర్గం లో చోటు కల్పించడం, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకి ప్రాధాన్యత ఇవ్వక పోవడం పట్ల కొందరు గురరుగా ఉన్నట్లుగా సమాచారం. ఈ కమిటీ తో రాబోయే ఏ ఒక్క ఎన్నికలకి వెళ్లిన పరాభావం ఖాయం అని అంటున్నారు మార్పులు చేర్పులు సంప్రదింపులు చేసుకొని బీజేపీ చీఫ్ రామ చంద్రరావు మరో నూతన కమిటీ ని ప్రకటించాలిసిన ఆవశ్యకత ఉందని వేశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

హైదరాబాద్

తెలంగాణ బీజేపీ లో పదవుల చిచ్చు..

పున్నమి ప్రతి నిధి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ని తాజా గా అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ మీద పలువురు సీనియర్ లు అసంతృప్తి లో ఉన్నారు. కేవలం హైదరాబాద్ లో సెటిల్ అయినా జానకర్షణ లేని వ్యక్తులకి రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వడం మంచిది కాదని అంటున్నారు. MP, లు MLA లు చెప్పిన పదవులు ఇవ్వక పోవడం వెనుక రామ చంద ర్ రావు మార్క్ స్పష్టం గా కనిపిస్తుంది. కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో నే 10 మందికి రాష్ట్ర కార్యవర్గం లో చోటు కల్పించడం, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకి ప్రాధాన్యత ఇవ్వక పోవడం పట్ల కొందరు గురరుగా ఉన్నట్లుగా సమాచారం. ఈ కమిటీ తో రాబోయే ఏ ఒక్క ఎన్నికలకి వెళ్లిన పరాభావం ఖాయం అని అంటున్నారు మార్పులు చేర్పులు సంప్రదింపులు చేసుకొని బీజేపీ చీఫ్ రామ చంద్రరావు మరో నూతన కమిటీ ని ప్రకటించాలిసిన ఆవశ్యకత ఉందని వేశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

కాకినాడ పిఠాపురం టిడిపి నాయకుడు వర్మ ముద్రగడ భేటీ సంచలనం

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పార్టీ అధిష్టానానికి బలమైన సంకేతమా వర్మ స్కెచ్ అదిరింది పిఠాపురం ప్రజల గుసగుసలు సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన వర్మ నిజాయితీ గుర్తింపు నాగబాబు వ్యాఖ్యలతో జనసేనపై వ్యతిరేకత పెరుగుదల వర్మ ఎప్పుడూ పార్టీపై విమర్శలు చేయలేదు పిఠాపురంలో వర్మ పట్టు బలంగానే ఉంది ముద్రగడ వర్మ కలయికతో కొత్త రాజకీయ సమీకరణలు వర్మకు మంచి పదవి రానున్నదా లేకపోతే పార్టీకి పెద్ద దెబ్బ తప్పదా పిఠాపురం వర్మ ముద్రగడ భేటీ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ వర్మ నిర్ణయం టిడిపి భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.