Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో గ్యాస్ లీక్.. ఉద్రిక్తతకు గురైన ప్రజలు

నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా):నరసన్నపేట పట్టణ పరిధిలోని పెద్దపేట సమీపంలోని మన మార్ట్ ఎదురుగా బుధవారం ఉదయం 7గంటల సమయంలో గ్యాస్ లీక్ సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ లీక్ కారణంగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. స్థానికంగా నివసిస్తున్న ఓ ఉపాధ్యాయుడు నుండి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్యాస్ ప్రవాహాన్ని నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చిన తరువాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సహకరించిన ఉపాధ్యాయుడు ఆదిత్య ను పలువురు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

అందరికీ చట్టాలపై అవగాహన అవసరం

అడ్వకేట్ చెన్నా ప్రమోధిని విశాఖపట్నం సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి సూర్యనారాయణ విశాఖ సిటీ: ప్రస్తుత సమాజంలో మోసాలకు గురికాకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన అందరికీ అవసరమని అడ్వకేట్ చెన్నా ప్రమోధిని స్పష్టంచేశారు. విద్యార్ధులను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు యారాడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ నట్టి అప్పారావు, ఉపాధ్యాయుల ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి లాయర్ చెన్నా ప్రమోధిని అతిథిగా పాల్గొని విద్యార్ధులను ఉద్దేశించి పలు అంశాలపై ప్రసంగించారు. ముఖ్యంగా పోక్సో చట్టం, న్యాయ విద్య గొప్పతనం, విద్యాహక్కు చట్టం, బాల కార్మికుల చట్టాలు, బాల నేరస్తుల చట్టాలు తదితర అంశాలపై విద్యార్దులకు అవగాహన కల్పించారు. లాయర్ కావాలనే కోరిక ఉన్న విద్యార్ధులు తనను సంప్రదిస్తే కొన్ని సులభమైన మెలుకువలు నేర్పుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో విద్యార్ధులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ నట్టి అప్పారావు మాష్టారు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విశ్వనాథ్, ఎస్ఎం చైర్ పర్సన్ రెడ్డి మంగ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సుజాత, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది లాయర్ చెన్నా ప్రమోధినిను, బెస్ట్ టీచర్ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శించుకున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు.

శ్రీకాళహస్తి దేవస్థానాన్ని బెంగళూరు పారిశ్రామికవేత్త, గాలి జనార్ధన్ సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి భాస్కర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవాళ్ళ దర్శన ఏర్పాట్లును నిర్వహించారు.దర్శనానంతరం మృత్యుంజయ స్వామి మండపం ప్రాంగణం వద్ద గాలి సోమశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డి భాస్కర్ లకు వేద వేదపండితులు వేదం మంత్రోచ్ఛారణలతో ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మ వాళ్ళ చిత్రపటాలను అందజేసిన ఆలయ అధికారులు.

ఆంధ్రప్రదేశ్

రూ.2లక్షల జీతం.. ఓటు వేయడం రాని MPలు

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 98% పైగా ఓట్లు పోలైనట్లుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ వెల్లడించారు. 13 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారని, 15 మంది వేసిన ఓట్లు చెల్లవని ప్రకటించారు. 15మంది ఎంపీలకు ఓటింగ్ వేయడం తెలియలేదు. నెలకు రెండు లక్షల జీతం తీసుకునే మన దేశ ఎంపీలకు ఓటు ఎలా వేయడం కూడా తెలియకపోవడం మన దౌర్భాగ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ కుల ధృవీకరణ పత్రం ఇంటికి:

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ఏపీ ప్రజలకు ఆ డాక్యుమెంట్ ఇంటికే.. పూర్తిగా ఉచితం, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ఈ సర్వేలో ఆధార్, రైస్ కార్డు, విద్యార్హత వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రజలకు సులభంగా పత్రాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్

ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై కమిటీ SEC నీలం సాహ్ని

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ఏపీ ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్ ఈవీఎంలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో భారతీయ జ్ఞాన వ్యవస్థపై ప్యానల్ చర్చ…

నెల్లూరు, కాకుటూరు: జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020)లో భాగంగా భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian Knowledge System – IKS)ను విద్యా రంగంలో సమన్వయం చేయడం లక్ష్యంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్యానల్ చర్చను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, రిజిస్ట్రార్ డా. కె. సునీత విశిష్ట అతిథిగా, RIE ప్రిన్సిపాల్ ఆచార్య బి. రమేష్ బాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థ అనేది వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం, యోగం, గణితం, ఖగోళశాస్త్రం వంటి శాస్త్రాల సమాహారం. ఇవి మన దేశపు మేధోసంపదకు పునాది. NEP 2020 ద్వారా ఈ జ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల విద్యార్థులలో పరిశోధనా దృక్పథం పెరుగుతుంది, సృజనాత్మకతకు దోహదం చేస్తుంది మరియు సమగ్ర విద్యా అభివృద్ధికి దోహదపడుతుంది” అన్నారు. రిజిస్ట్రార్ డా. కె. సునీత మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థ సమన్వయం విద్యార్థులలో సమగ్రతను, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అన్నారు. గౌరవ అతిథి ఆచార్య బి. రమేష్ బాబు మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి” అని తెలిపారు. డీన్ ఆర్ & డి ఆచార్య సుజా ఎస్. నాయర్ మాట్లాడుతూ, “IKS ను విద్యా వ్యవస్థలో చేర్చడం వలన విద్యార్థులు కేవలం సాంకేతిక జ్ఞానంతో కాకుండా సాంస్కృతిక, నైతిక విలువలతో కూడిన సమగ్ర వ్యక్తిత్వాన్ని పొందగలరు. అంతరశాఖ పరిశోధన మరియు ప్రాజెక్టుల ద్వారా దీనిని మరింత విస్తరించవచ్చు” అన్నారు. ప్యానల్ చర్చలో విద్యావేత్తలు, సాంస్కృతిక చరిత్రకారులు, ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు పాల్గొని IKS చరిత్రాత్మక ప్రాముఖ్యత, ఆధునిక సమాజంలో అన్వయం, సవాళ్లు మరియు భవిష్యత్ మార్గదర్శకాలపై చర్చించారు. NEP నోడల్ ఆఫీసర్ డా. ఆర్. మధుమతి మాట్లాడుతూ, “భారతీయ జ్ఞాన వ్యవస్థను విద్యా విధానంలో అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెరుగుతుంది. ఇది కేవలం పాఠ్యాంశాల పరిధిలోనే కాకుండా, నూతన ఆవిష్కరణలకు దారితీసే మార్గదర్శకంగా ఉంటుంది” అన్నారు. UTSAH నోడల్ ఆఫీసర్ డా. జి. విజయలక్ష్మి మాట్లాడుతూ, “IKS సమన్వయం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఇది విద్యా రంగంలో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది” అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ మాట్లాడుతూ, “IKS విద్యా రంగానికి కొత్త దారులను చూపిస్తుంది. విద్యార్థులు దీని ద్వారా ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించుకుని భవిష్యత్తులో గ్లోబల్ స్థాయిలో పోటీపడగలరు” అన్నారు. ఈ కార్యక్రమంలో డా. జె. విజయ, డా. బి. వి. సుబ్బా రెడ్డి, విద్యార్థినులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

పున్నమి ప్రతినిధి, రిపోర్టర్ రమణ, సెప్టెంబర్ 9: రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామ గ్రంథాలయ బిల్డింగ్లో డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం జిల్లా సేవాపక్వాడ కార్యసాల నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సేవాపక్వాడ కన్వీనర్ కో కన్వీనర్లతో వర్క్ షాప్ నిర్వహించారు.ఈ నెల 17 వ తేదీన ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవాపక్వాడ్ 2025 పక్షోత్సవాలు గురించి నిర్వహించిన ఈ వర్క్షాప్ కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు గారు మాట్లాడుతూ రానున్న ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ ద్వారా ప్రజలలో వారి జన్మదినాన్ని జరపాలని కార్యకర్తలకు సూచించారు. మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా గురించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు,రామచంద్రపురం బిజెపి మండల అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ,నియోజకవర్గ నాయకులు తదితరులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని ఘనంగా సత్కరించారు.అనంతరం సోము వీర్రాజు గారు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బిజెపి ఇంచార్జి కర్రి చిట్టిబాబు, రాష్ట్ర అధికార బిజెపి ప్రతినిధి నల్లా పవన్, పాలూరి సత్యానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, కే.దత్తాత్రేయ,సి.ఎచ్. శ్రీనివాసరావు,గనిశెట్టి వెంకటేశ్వరరావు, నడీమ్పల్లి సుబ్బరాజు,రామచంద్రపురం నియోజకవర్గ బిజెపి మండల అధ్యక్షులు,అధిక సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు,మహిళా బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:* జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన సమారాధన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి సాధార స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గంధం శ్రీనివాస్, గంధం వెంకటరమణ, బత్తుల కేశవరావు, ద్వారపూడి వీరభద్రరావు, కర్ణాకుల రాంబాబు, కర్ణాకుల ప్రసాద్,సూరభత్తుల సిమ్మయ్య, రంగన్నాధం కాపు,సూరభతుల కృష్ణ, సూరభతుల వీరబాబు,రాయి బుల్లాబ్బాయి, మాదారపు వీరబాబు, నాగేశ్వరావు, మణికంఠ, రమేష్, శ్రీను, కనకరాజు, వీరబాబు, శివ, ఓంకృష్ణ, సోమరాజు,రాయి శ్రీను,గంధం లోవరాజు, బండారు ఈశ్వరరావు, అడబాల అర్జుణరావు,గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:* జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన సమారాధన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి సాధార స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గంధం శ్రీనివాస్, గంధం వెంకటరమణ, బత్తుల కేశవరావు, ద్వారపూడి వీరభద్రరావు, కర్ణాకుల రాంబాబు, కర్ణాకుల ప్రసాద్,సూరభత్తుల సిమ్మయ్య, రంగన్నాధం కాపు,సూరభతుల కృష్ణ, సూరభతుల వీరబాబు,రాయి బుల్లాబ్బాయి, మాదారపు వీరబాబు, నాగేశ్వరావు, మణికంఠ, రమేష్, శ్రీను, కనకరాజు, వీరబాబు, శివ, ఓంకృష్ణ, సోమరాజు,రాయి శ్రీను,గంధం లోవరాజు, బండారు ఈశ్వరరావు, అడబాల అర్జుణరావు,గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.