Wednesday, 6 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా..???

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ సోషల్ మీడియాపై బ్యాన్ ఏకంగా నేపాల్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్తో సహా మంత్రులు, ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో కొత్త ప్రధానిగా నేపాల్ మేయర్ బలేంద్ర షా పేరు తెరపైకి వచ్చింది. బలేంద్ర షానే.. నేపాల్కు కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

జాతీయ అంతర్జాతీయ

నూతన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నేపథ్యం

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ C.P.రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన 1957లో తమిళనాడులో జన్మించారు. 16ఏళ్ల వయసు నుంచే RSS, జన్ సంఘ్లో పని చేశారు. 1998, 99లో కోయంబత్తూరు BJP నుంచి MPగా గెలిచారు. 2004, 14, 19లో ఓడిపోయారు. 2004-07 వరకు తమిళనాడు BJP అధ్యక్షుడిగా పని చేశారు. 2023లో ఝార్ఖండ్ గవర్నర్ అయ్యారు. 2024లో TG గవర్నర్గానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులైలో MH గవర్నర్ గా పని చేశారు.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం 49వ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి

రాజమహేంద్రవరం నగరంలో 49వ డివిజన్‌లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లోని అన్ని క్యాంటీన్ల సమీపంలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. పర్యటన అనంతరం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ దీపాల ఏర్పాటు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, మరియు నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “49వ డివిజన్‌లోని ప్రజల సంక్షేమం నా ప్రథమ కర్తవ్యం. వారి సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. ఈ డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం,” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా 49వ డివిజన్‌లోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం 49వ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషి

రాజమహేంద్రవరం నగరంలో 49వ డివిజన్‌లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లోని అన్ని క్యాంటీన్ల సమీపంలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. పర్యటన అనంతరం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ దీపాల ఏర్పాటు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, మరియు నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. “49వ డివిజన్‌లోని ప్రజల సంక్షేమం నా ప్రథమ కర్తవ్యం. వారి సమస్యలను పరిష్కరించడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. ఈ డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటాం,” అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ద్వారా 49వ డివిజన్‌లోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు

E-పేపర్

పొదలకూరులో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

*పొదలకూరులో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు* పొదలకూరు పున్నమి ప్రతినిధి: పొదలకూరు పట్టణంలోని పలు హోటళ్లలో మంగళవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణుతి ఫ్లోరా మంగళవారం పట్టణంలోని పలు బేకరీలను, స్వీట్ షాపులు హోటల్స్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీటిలో నుంచి రెండు శాంపిల్స్ సేకరించి ఎనాలసిస్ పంపినట్లు ఆమె తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత, వంటశాలల స్థితి, నిల్వ గదులు, వాడుతున్న నూనెల నాణ్యత, పాత్రల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. గడువు ముగిసిన పదార్థాలు వినియోగిస్తున్న కొన్ని హోటళ్లను గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. పరిశుభ్రత లోపాలున్న చోట్ల కఠిన హెచ్చరికలు ఇచ్చారు. అనుమతి లేని కలర్ పౌడర్లు, కెమికల్స్ వినియోగం. లైసెన్స్ లేకుండా నడుస్తున్న కొన్ని హోటళ్లు. వినియోగదారుల ఆరోగ్య భద్రతను నిర్లక్ష్యం చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ఖమ్మం

ABVP తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్

Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్ట్ తీర్పునిచ్చెన నేపథ్యంలో KU లో #ABVP ప్రెస్ మీట్… ప్రెస్ మీట్ లో పాల్గొన్న ABVP రాష్ట్ర కార్యదర్శి #మాచెర్లరాంబాబు Group-1 పరీక్షలపై #CBIఎంక్వయిరీకి ABVP డిమాండ్… ✨ముఖ్యాంశాలు… Group-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు… రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా TGPSC, వాటాలు పంచుకోవడంలో నేతలు, అధికారులు బిజీ… ప్రభుత్వాలు మారితే TSPSC పేరు TGPSC గా మారింది తప్పితే బోర్డు తీరులో మార్పు రాలేదు… నిరుద్యోగులు,విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది… వెంటనే #TGPSC బోర్డు ను #రద్దుచేయాలి… Group-1 పరీక్షల పూర్తి ఎపిసోడ్ పై CBI విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి… Groups పరీక్షల నిర్వహణ బాధ్యతను #UPSC కి అప్పగించాలి… తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలి..

Others

నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ అరెస్ట్

నిధుల దుర్వినియోగం కేసులో IPS సంజయ్ అరెస్ట్ రెండు రోజుల ACB కస్టడీకి కోర్టు ఆదేశం హైదరాబాద్‌: నిధుల దుర్వినియోగం కేసులో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, రెండు రోజుల పాటు ఎసీబీ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు, ఎల్లుండి సంజయ్ ఎసీబీ కస్టడీలో విచారణ ఎదుర్కొననున్నారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిధుల వినియోగంపై పూర్తి వివరాలు వెలికితీయాల్సి ఉందని ఎసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, విచారణ సాఫీగా సాగేందుకు కస్టడీ అవసరమని తేల్చి నిర్ణయం తీసుకుంది. అధికార స్థాయిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ కొనసాగుతుండగా, సంజయ్ అరెస్టుతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సంబంధిత విభాగాల నుండి పలు పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో సంజయ్‌ను ఎదురెదురుగా ప్రశ్నించనున్నారు అధికారులు.

తిరుపతి

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు

శ్రీకాళహస్తిలో రైతన్నకు తోడుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరుతున్న సమయంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తల్లి ఇంట్లో అకస్మారక స్థితిలోకి వెళ్లడంతో విషయం తెలుసుకొని హుటాహుటిన నిరసన కార్యక్రమము నుండి హాస్పిటల్ కి బయలుదేరి వెళ్లారు.రైతన్న నిరసన కార్యక్రమం అనంతరం హాస్పిటల్ వద్ద బియ్యపు మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి తల్లి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,సత్యవేడు సమన్వయకర్త రాజేష్,శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి శ్రేణులు.

ఖమ్మం

బీజేపీ రాష్ట్ర కోశాధికారి గా దేవకీ వాసు దేవరావ్

తెలంగాణ బీజేపీ కోశాధికారి గా ఖమ్మం కి చెందిన దేవకి వాసుదేవరావు ని నియమించారు. వీరి నియామకం పట్ల అయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

యూరియా కొరతపై వైసిపి నిరసన

శ్రీకాళహస్తిలో పట్టణంలో వైసిపి నాయకులు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు.అందులో భాగంగా వైసిపి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కారుణాకర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలిసి యూరియా కొరతపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేరశారు.తరువాత ఆర్డీఓ కార్యాలయంలో ఇంచార్జి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం భూమన మాట్లాడుతూ అసలే గుట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు యూరియా రైతులకు అందివ్వడంలో ప్రభుత్వం వైఫల్యం,చెందిదన్నారు.అందువల్ల రైతులు దళారుల వద్ద అధిక ధరలకు యూరియా కొనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.