Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :(పున్నమి న్యూస్ ):// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి అభన్న హస్తం అందిస్తున్నారు. అనేక సందర్భాలలో జరిగిన ప్రమాదాలను తెలుసుకొని నేరుగా వారిని కలుసుకొని శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో మూడవ రోజు నిమజ్జనం కార్యక్రమంలో బాణా సంచాలు పేలి 9 మంది చిన్నారులకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆర్థిక సహాయం కూడా అందించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిన ప్రమాద విషయాన్ని వివరించడం జరిగింది. వెంటనే చలించి పోయిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క చిన్నారికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని కంటే, ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోరుకుంటుందని, సంఘటన విషయం తెలిపిన వెంటనే 9 మంది చిన్నారులకు 18 లక్షలు సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా చిన్నారుల కుటుంబాల నివాసాలకు వెళ్లి చిన్నారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. అదేవిధంగా ప్రముఖ వైద్యుడు రవి అవసరమైన చిన్నారులకు ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు కూడా ముందుకు వచ్చారని, అవసరమైన వారికి సర్జరీ చేయించేందుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు అధికారులకు, తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ లో స్థానిక సంస్థలకు 4 దశల్లో ఎన్నికలు జరుపుతాం

సెప్టెంబర్ 09పున్నమి ప్రతినిధి @ ఏపీ లో స్థానిక సంస్థలకు 4 దశల్లో ఎన్నికలు జరుపుతాం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని EVMలతో ఎన్నికలనిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌లో EVMలు వాడారు EVMల కొనుగోలు,వినియోగంపై త్వరలో నిర్ణయం-నీలంసాహ్ని

క్రైమ్

నా ఫొటోలు వాడొద్దు.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @దిల్లీ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

జాతీయ అంతర్జాతీయ

దేశం విడిచి పారిపోతున్న నేపాల్ ప్రధాని

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి@నేపాల్ లో ప్రధాని, మంత్రులు ఇళ్లను కాల్చివేస్తున్న యువకులు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది .సోషల్‌ మీడియా నిషేధంపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలువురు మంత్రులు వరుసగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైద్య కళాశాలల పిపిపి లీజు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి

విశాఖపట్నం సెప్టెంబర్ 9పున్నమి ప్రతినిధి సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2025న చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 17 కొత్త వైద్య కళాశాలలలో పదింటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడాన్ని రద్దు చేయాలని పిడిఎస్ఓ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి. లక్ష్మి మాట్లాడుతూ “ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను 33 సంవత్సరాల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ద్వారా 1500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50% తగ్గించి, 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్రయించడం వల్ల ఫీజులు అమాంతం పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం నాబార్డ్ నిధులతో 8500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణానికి చొరవ తీసుకున్నప్పటికీ, 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం 2024లో పులివెందులను తిరస్కరించి, 80% నిర్మాణం పూర్తైన 10 కళాశాలల్లో ఎంబిబిఎస్ సీట్లను రద్దు చేయమని ఎన్ఎంసికి లేఖ రాసింది. ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం జీవో 107, 108 ద్వారా సెల్ఫ్-ఫైనాన్స్ కోటాను ప్రవేశపెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఈ జీవోలను 100 రోజుల్లో రద్దు చేసి, 100% సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నీటిబుడగలయ్యాయి అన్నారు. 2027-28 నాటికి మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల కళాశాలలను పిపిపిలో ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఫీజులు ఏడాదికి 8 లక్షల వరకు, ఎంబిబిఎస్ కోర్సుకు అరకోటి రూపాయల వరకు ఖర్చవుతాయని, అదే ప్రభుత్వ కళాశాలలైతే 5 లక్షలతో సరిపోతుందని, ప్రభుత్వం పారదర్శకత లేకుండా, కన్సల్టెన్సీల ద్వారా కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతోందని, చిత్తూరులో అపోలో సంస్థ ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగిస్తూ కొత్త ఆసుపత్రి నిర్మించకపోవడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులతో అరకొర వైద్యం అందడం సామాన్యులకు నష్టం కలిగిస్తోందన్నారు. ఈ పిపిపి మోడల్ విస్తరిస్తే అన్ని ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందని, అందుకని పిడిఎస్ఓ ఈ నిర్ణయాలను ఖండిస్తూ 10 కళాశాలల పిపిపి నిర్ణయాన్ని ఉపసంహరించాలని” అన్నారు.ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని రద్దు చేయాలని, జీవో 107, 108ను రద్దు చేసి 100% సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలని, 17 కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థులంతా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా కమిటీ సభ్యులు జానకి, లక్ష్మణ్, లోకేష్, లైకోన్, తులసి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

అదాని స్మార్ట్ మీటర్లు వద్దు సాధారణ మీటర్లు ముద్దు

శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం కి అదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపితున్నారన్నారన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై భారాన్నిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేయాలన్నారు.

Blog

జీవితంలో గెలవాలి అంటే – లక్ష్యాలు, శ్రమ, ధైర్యంతో విజయాన్ని సాధించే మార్గాలు

మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం చిన్నదైనా సరే, గొప్పదైనా సరే, స్పష్టంగా ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మనం ప్రయత్నిస్తాం, ఓడినప్పుడు నేర్చుకుంటాం, కష్టమైనప్పుడు ముందడుగు వేస్తాం. జీవితంలో గెలవాలి అంటే కేవలం అదృష్టం సరిపోదు – కష్టపడి పనిచేయాలి, సరైన ఆలోచనలు కలిగి ఉండాలి, సమయాన్ని సద్వినియోగం చేయాలి, మనసును దృఢంగా తయారు చేసుకోవాలి. ఈ బ్లాగులో జీవితంలో గెలవడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ✅ గెలుపుకు మొదటి అడుగు – లక్ష్యం నిర్ణయం గెలవాలని అనుకునే ముందు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు విద్యలో ముందంజ వేయాలనుకుంటున్నారా? వ్యాపారం చేయాలనుకుంటున్నారా? సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారా? లక్ష్యం స్పష్టంగా లేకపోతే ప్రయత్నాలు చెల్లాచెదురుగా మారుతాయి. లక్ష్యం నిర్ణయించే విధానం: మీ ఆసక్తులు తెలుసుకోండి. మీకు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీకు శక్తినిచ్చే రంగాలను ఎంచుకోండి. చిన్న లక్ష్యాలను కూడా నిర్దేశించుకోండి – ఇది పెద్ద లక్ష్యానికి మార్గం వేస్తుంది. ఉదాహరణ: ఒక విద్యార్థి UPSC పరీక్షలో గెలవాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన రోజువారీ టైమ్ టేబుల్ రూపొందించి, ప్రతి రోజూ శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. ✅ కష్టపడటం – గెలుపుకు వెన్నెముక ఏదైనా విజయాన్ని సాధించాలంటే కష్టపడాల్సిందే. శ్రమ లేకుండా విజయాన్ని పొందిన వ్యక్తులు చాలా అరుదు. కష్టపడడం అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా సిద్ధంగా ఉండటం. కష్టపడటానికి అవసరమైన అలవాట్లు: సమయానికి పని ప్రారంభించడం. రోజువారీ లక్ష్యాలను పెట్టుకుని వాటిని పూర్తి చేయడం. పనిని ముగించేవరకు ఓపికగా ఉండటం. వైఫల్యం వచ్చినా ప్రయత్నం మానకపోవడం. ఉదాహరణ: ఒక రైతు మంచి పంట కోసం రోజూ పొలంలో కష్టపడతాడు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, తన ప్రయత్నాన్ని తగ్గించడు. ✅ ఓటమిని భయపడకూడదు ఓటమి అనేది ఎదుగుదలకు అవకాశమే. చాలామంది ఓటమిని చూసి వెనక్కి వెళ్లిపోతారు. కానీ గెలిచినవారు ఓటమిని నేర్పుగా మార్చుకుంటారు. ఓటమిని ఎదుర్కొనే మార్గాలు: మీరు ఎందుకు ఓడిపోయారో విశ్లేషించండి. సరైన మార్గాన్ని కనుగొనడానికి మార్పులు చేయండి. మళ్లీ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు నిందించకుండా ముందడుగు వేయండి. ఉదాహరణ: ఒక స్టార్టప్ ప్రారంభించిన యువకుడు వ్యాపారంలో నష్టపోయాడు. అతడు తన తప్పులను విశ్లేషించి కొత్త వ్యూహంతో తిరిగి ప్రారంభించి విజయాన్ని సాధించాడు. ✅ సమయాన్ని సద్వినియోగం చేయడం సమయం అనే సంపదను సరిగ్గా వినియోగిస్తే గెలుపు మీ ముందే ఉంటుంది. సమయం సరైన విధంగా వినియోగించని వ్యక్తి ఎన్నో అవకాశాలను కోల్పోతాడు. సమయ నిర్వహణ కోసం సూచనలు: పనిని ప్రాధాన్యత క్రమంలో అమర్చండి. సోషల్ మీడియా, టీవీ వంటి వ్యసనాలను తగ్గించండి. రోజువారీ చేయాల్సిన పనులను జాబితాగా రూపొందించండి. విరామ సమయాలను కూడా ఉత్పాదకంగా మార్చుకోండి. ఉదాహరణ: ఒక విద్యార్థి రోజుకు 6 గంటలు చదివి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతడు రోజూ సమయాన్ని వృథా చేయకుండా చదివాడు. ✅ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం మనసులో నమ్మకం లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం రాదు. “నేను చేయగలను” అనే నమ్మకం అవసరం. ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గాలు: చిన్న విజయాలను గుర్తించి ఆనందించండి. ప్రతిరోజూ మీపై సానుకూలంగా ఆలోచించండి. ఇతరులతో మీను పోల్చుకోకండి. శారీరక వ్యాయామాలు, ధ్యానం ద్వారా శక్తిని పెంచుకోండి. ఉదాహరణ: ఒక అమ్మాయి తన స్వీయాభివృద్ధిపై నమ్మకం కలిగి ఉన్నందున ఎన్నో పోటీల్లో పాల్గొని పురస్కారాలు పొందింది. ✅ సరైన వ్యక్తులతో మెలగడం మనకు చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలపై ప్రభావం చూపుతారు. సరైన మార్గంలో నడిపే వ్యక్తులతో ఉంటే విజయానికి దగ్గరవుతాం. సంఘాన్ని ఎంపిక చేసుకునే విధానం: లక్ష్యాన్ని అర్థం చేసుకునే స్నేహితులను ఎంచుకోండి. ప్రోత్సహించే వ్యక్తులతో ఉండండి. నిరుత్సాహపరచే వ్యక్తుల ప్రభావానికి లోనుకాకండి. ఉదాహరణ: ఒక క్రీడాకారుడు శిక్షణ పొందుతున్నప్పుడు తనను ప్రోత్సహించే కోచ్ మరియు సహచరులతో కలిసి సాధన చేసి జాతీయస్థాయిలో విజయం సాధించాడు. ✅ నేర్చుకునే తపన ఎంత నేర్చుకుంటే అంత ముందడుగు వేయగలం. జీవితంలో గెలవడానికి విద్య అనేది శక్తివంతమైన ఆయుధం. కొత్తగా నేర్చుకునే మార్గాలు: పుస్తకాలు చదవడం. ఆన్‌లైన్ కోర్సులు చేయడం. నిపుణుల వద్ద మార్గదర్శనం పొందడం. వర్క్‌షాపులు, సెమినార్లకు హాజరుకావడం. ఉదాహరణ: ఒక యువకుడు కొత్త టెక్నాలజీ నేర్చుకొని స్టార్టప్ ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందాడు. ✅ శారీరక, మానసిక ఆరోగ్యం గెలుపుకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకునే సూచనలు: సమయానికి భోజనం చేయండి. రోజూ వ్యాయామం చేయండి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయండి. నిద్రకు సరైన సమయం కేటాయించండి. ఉదాహరణ: శారీరకంగా బలంగా ఉండే వ్యక్తి కష్టమైన పనులను కూడా ఆత్మవిశ్వాసంతో చేయగలిగాడు. ✅ సేవాభావాన్ని పెంచుకోవడం గెలుపు అంటే వ్యక్తిగతంగా మాత్రమే కాదు. ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకూ మంచి అవకాశాలు లభిస్తాయి. సేవాభావం ద్వారా లభించే ప్రయోజనాలు: కొత్త సంబంధాలు ఏర్పడతాయి. నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. సమాజానికి సేవ చేయడం వల్ల ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఉదాహరణ: ఒక యువకుడు గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి ప్రజల ఆదరణ పొందాడు. ✅ ఆర్థిక క్రమశిక్షణ గెలవడానికి డబ్బును సరైన విధంగా నిర్వహించడం కూడా అవసరం. ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక క్రమశిక్షణకు సూచనలు: ఆదాయం, ఖర్చును నమోదు చేయండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పొదుపు అలవాటు చేసుకోండి. పెట్టుబడులపై అవగాహన పెంచుకోండి. ఉదాహరణ: ఒక కుటుంబం ఆదాయంలో ఒక భాగాన్ని పొదుపుగా ఉంచి పిల్లల విద్య కోసం వినియోగించింది. ✅ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం గెలవాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే అవకాశాలు చేజారిపోతాయి. సరైన నిర్ణయం తీసుకునే విధానం: లాభనష్టాలను విశ్లేషించండి. నమ్మకమైన వ్యక్తులతో చర్చించండి. మీ అంతర్గత స్వరాన్ని వినండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉదాహరణ: ఒక వ్యాపారి మార్కెట్‌లో మార్పులను గుర్తించి వ్యాపార వ్యూహాన్ని మార్చి లాభాలు పొందాడు. ✅ ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రణాళిక గెలుపుకు ప్రణాళిక ఎంతో ముఖ్యమైనది. ప్రణాళిక లేకపోతే ప్రయత్నాలు నిర్దిష్టంగా ఉండవు. ప్రణాళిక రూపొందించుకునే విధానం: దీర్ఘకాల లక్ష్యాన్ని నిర్ణయించండి. నెల, వారం, రోజువారీ లక్ష్యాలను రూపొందించండి. పురోగతిని నిరంతరం పరిశీలించండి. అవసరమైనప్పుడు ప్రణాళికను సవరించండి. ఉదాహరణ: ఒక విద్యార్థి 1 సంవత్సరం ప్రణాళిక రూపొందించి రోజూ చదువుతూ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ✅ ప్రకృతిని, జీవితాన్ని అంగీకరించడం ప్రతి వ్యక్తికి జీవితంలో సవాళ్లు ఉంటాయి. వాటిని అంగీకరించి ముందడుగు వేయగలిగినప్పుడు గెలుపు సులభమవుతుంది. సవాళ్లను అధిగమించే మార్గాలు: సమస్యను తప్పించుకోకుండా పరిష్కారంపై దృష్టి పెట్టండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయండి. తప్పుల నుండి నేర్చుకుని ముందడుగు వేయండి. ఉదాహరణ: ఒక ఉద్యోగి పనిలో సమస్యలు వచ్చినా వాటిని అంగీకరించి పరిష్కారం కోసం శ్రద్ధగా ప్రయత్నించి పదోన్నతి పొందాడు. ముగింపు జీవితంలో గెలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ గెలుపు కేవలం కలలు కనడం ద్వారా రాదు. లక్ష్యం నిర్ణయించడం, కష్టపడటం, ఓటమిని అంగీకరించడం, సమయాన్ని సరైన విధంగా వినియోగించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, సరైన వ్యక్తులతో మెలగడం, నేర్చుకునే తపన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సేవాభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళిక రూపొందించడం, జీవితాన్ని అంగీకరించడం – ఇవన్నీ కలిసే గెలుపుకు మార్గంగా మారుతాయి. గెలవడం అంటే ఒక్కసారిగా పెద్ద విజయాన్ని సాధించడం కాదు. ప్రతి రోజూ చిన్నచిన్న విజయాలను సాధిస్తూ ముందడుగు వేయడమే నిజమైన గెలుపు. మన ప్రయత్నం, ధైర్యం, నమ్మకం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా అధిగమించగలుగుతాం. గెలుపు మీ చేతుల్లో ఉంది – నమ్మండి, కష్టపడండి, ముందడుగు వేయండి!

E-పేపర్

వేంపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల సమస్యపై నిరసన – డీపీఓతో చర్చించిన తులసి రెడ్డి, ధ్రువ కుమార్ రెడ్డి

వేంపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై సోమవారం రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి గారు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సిబ్బందితో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ఆరు నెలలుగా వేంపల్లి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవో లేకపోవడం, పారిశుద్ధ్య మరియు మంచినీటి సరఫరా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా సిబ్బంది సమ్మె చేపట్టడంతో పంచాయతీ ప్రాంతం మురికి కూపంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి గారు, డీఎల్ పీఓ రమాదేవి గారు వేంపల్లెకు వచ్చి సిబ్బంది, నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి గారు, ధ్రువ కుమార్ రెడ్డి గారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

E-పేపర్

ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దు సాధారణ మీటర్లు ముద్దు

శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం గారికి ఆదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది. డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసే విధంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్మార్ట్ మీటర్ల పై తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై బారానిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు అంటోని, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండలం యువజన అధ్యక్షులు ఆసిఫ్, రేణిగుంట మండలం ఓబిసి అధ్యక్షులు నగేష్, నాగరాజు, తేజ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

48వ వార్డులో వెలగని వీధి దీపాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

వీధి దీపాలు వెలగకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంకల కవిత అప్పారావు యాదవ్ వారం రోజులు గడుస్తున్నపట్టకి అధికారుల నుంచి స్పందన కరువైందని తీవ్ర ఆవేదన వ్యక్త పరిచిన గంకల* గుడ్ మార్నింగ్ గంకల పిర్యాదు మేరకు వార్డు అంతటా రాత్రి వేళలో ఆకస్మిక పర్యటన చేసిన గంకల విశాఖపట్నం సెప్టెంబర్ 9 పున్నమి ప్రతినిధి సూర్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డులో జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు సోమవారం నాడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆకస్మికంగా వార్డులో గల బాపూజీ నగర్,రామకృష్ణ నగర్ ,నీలకంఠ నగర్,శ్రీనివాస్ నగర్,శివలింగ పురం,పల్నాటి కాలనీ,న్యూ శ్రీనివాస్ నగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో పర్యటన చేశారు.ఇందులో భాగంగా గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని అందిన పిర్యాదు మేరకు పలు చోట్ల వెలగని వీధి దీపాల పనితీరును గుర్తించి వాటి పనితీరుపై అసహనం వ్యక్తం చేసారు.వార్డు మొత్తం కొండవాలు ప్రాంతం కావడంతో ప్రతి రోజు పర్యటన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి వీధి దీపాలు వెలగకపోవడం నిర్లక్ష్యం అవ్వడం పట్ల వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికి పలు మార్లు వీధి దీపాలు వెలగడం లేదని, నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలనీ పిర్యాదు చేసినప్పటికి ఇప్పటివరకు అధికారులు కనీసం పర్యటన కూడా చేయలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.ముఖ్యంగా 255,91,75 కలిగిన ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సుమారు 10 నుంచి 20 వీధి దీపాలు వెలగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎక్కువ లైటింగ్ కొరకు ఏర్పాటు చేసిన రింగ్ పోల్స్ కూడా వెలగకపోవడంతో ప్రజలు ఏ విధంగా చీకటిలో ప్రయాణం చేయాలని ప్రశ్నించారు. కొండ ప్రాంతం మరియు వర్షాకాల పరిస్థితిలో చీకటి ప్రదేశంలో పాములు, కీటకాలు,ఆకతాయిల ఆగడాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వార్డులో వీధి దీపాలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో నిరసన చేస్తామని తెలిపారు.ఈ సందర్బంగా గంకల మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదని అందిన పిర్యాదు మేరకు వార్డులో పరిశీలన చేసి వీధి దీపాల పనితీరు పై అసహనం వ్యక్తం చేయడం జరిగిందని,ఇప్పటికి రెండు సార్లు ఇటువంటి ఇబ్బంది గమనించడం జరిగిందని,వార్డు మొత్తం కొండవాలు ప్రాంతం కావడంతో ప్రతి రోజు పర్యటన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి వీధి దీపాలు వెలగకపోవడం నిర్లక్ష్యం అవ్వడం పట్ల వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వృద్ధులు,వికలాంగులు,మహిళలు,పిల్లలు వీధి దీపాలు వెలగకపోవడం పట్ల ఇబ్బందులు పడుతున్నారని,ప్రస్తుత వర్షకాలం దృష్యా కొండవాలు ప్రాంతం కావడంతో విష సర్పాలు,అకతాయిల చేష్టలు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వార్డులో వీధి దీపాలు సమస్యకు పరిష్కారం చూపాలని లేకుంటే ఉన్నత అధికారులకు పిర్యాదు అందిస్తానని,నిరసన చేస్తానని అన్నారు.రాత్రి వేళలో వార్డు ప్రజల సమస్యకు పర్యటన చేసి పరిష్కార దిశగా హామీ ఇచ్చినందుకు వార్డు ప్రజలు గంకల కవిత అప్పారావు పట్ల అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.