Wednesday, 6 May 2026

Blog

అన్నమయ్య

నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో సానుభూతి కార్యక్రమం

చిట్వేల్‌కు చెందిన, అనంతరం బెంగళూరులో స్థిరపడిన కార్య లక్ష్మీదేవి మరియు ఆమె కుమారులు మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు తమ తండ్రి, వ్యవసాయశాఖ రిటైర్డ్ AEO అయిన నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా రాపూర్ రోడ్డులోని శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు బియ్యం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధూపదీప సామగ్రి సమకూర్చి, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు ఆశీర్వచనాలు అందిస్తూ, నల్లప్ప గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుమార్తె రమాదేవి, కుమారులు మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, నాగలక్ష్మమ్మ, పద్మావతమ్మ, నిర్వాహకుడు చంద్రశేఖర్ స్నేహితులు ఆత్మారెడ్డి, కోటి, నరసింహులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైతులకు న్యాయం అడిగితే బైండోవర్ కేసా? – సిఐటియు నేత చంద్రశేఖర్‌పై పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సిఐటియు జిల్లా అధ్యక్షుడు సి.హెచ్. చంద్రశేఖర్‌పై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కోడూరు, చిట్వేలు, పెనుగులూరు, ఓబులవారిపల్లె మండలాల్లో రైతులు విస్తారంగా సాగు చేసిన బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతుల తరఫున పోరాడినందుకే పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ నిర్ణయించిన ₹9 ధరను కూడా వ్యాపారులు అమలు చేయకుండా మధ్యవర్తులు, ఢిల్లీ వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బైండోవర్ కేసును ఉపసంహరించి, బొప్పాయి రైతులకు న్యాయమైన ధర కల్పించాలని, మోసగాళ్లపై సెక్షన్ 420 కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ

మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలను సందర్శించాలన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

తెలంగాణ

అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన: జిల్లా సీఈవో

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాను, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ఓటర్ జాబితాలను ఈనెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం(సెప్టెంబర్ 8) ఆయన తన ఛాంబర్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

జోగులాంబ గద్వాల

టైరు పేలి ఇద్దరికీ గాయాలు.

అలంపూర్ : సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి వాహనం బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం ఉండవల్లి మండలంలో చోటు చేసుకున్నది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. కడప నుండి కుటుంబ సభ్యులతో కలిసి (ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి) హరి షాద్నగర్ కు కారులో వెళ్తుండగా ఉండవెల్లి స్టేజి సమీపంలోకి రాగానే టైర్ పగిలి, కారు పల్టీలు కొట్టి పక్క రోడ్డులో పడింది. దీనితో హరికి గాయాలు కాగా, భార్య శివాని భుజానికి బలమైన గాయం. బాబుకు, హరి తల్లి భాగ్యమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటి రాధ మోహన్, పైలెట్ నరేష్ పేర్కొన్నారు.

తిరుపతి

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం

తిరుపతి: వెంకటగిరి పట్టణంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను ఆహ్వానించారు.పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు శాలువా కప్పి, సన్మానించి, శ్రీ పోలేరమ్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు.వెంకటగిరి జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వానం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలేరమ్మ ఆలయ దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అధిక మోతాదు యూరియా అనర్ధదాయకం

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం చేజర్ల గ్రామంలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి బి. జ్యోత్స్న మాట్లాడుతూ అధిక యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు. నీరు మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు. కనుక సేంద్రియ ఎరువుల వాడి యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్లయితే నేల గుల్ల బారి పోషకాలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా పి ఎమ్ డి ఎస్ కిట్ వినియోగిస్తే 365 రోజులు నేలను పచ్చగా ఉంచుటకు వీలుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, సుజాత, జడ్ బి ఎన్ ఎఫ్ సుబ్బయ్య, విఎఎలు చెంచయ్య, మేఘన, మరియు పొదుపు సంఘ మహిళ మరియు రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహిళలకు ప్రతి నెలా రూ.1500.. త్వరలో అమలు..////

ఆంధ్రప్రదేశ్ : (పున్నమి న్యూస్ ప్రతినిధి )://// ఏపీలో సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు వంటి హామీలు అమలు చేసింది.యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక సూపర్ సిక్స్ హామీలలో మిగిలి పోయిన ఆడబిడ్డ నిధి స్కీమ్ ను దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇచ్చే ఈ స్కీమ్ పై ఈ నెల 10న ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అనంతపురం

బుల్లెట్ లింగమయ్యకు సంఘాల ఘన పరామర్శ

అనంతపురం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) పెద్దపప్పూరు మండల కేంద్రం ఆదివారం అన్ని వాల్మీకి సంఘాల ఏకతా శక్తితో మార్మోగింది. చాగల్లు గ్రామానికి చెందిన రాష్ట్ర వాల్మీకి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వాల్మీకి సేవాదళ్ సంఘం పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్యను పరామర్శించడానికి వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనపై చూపుతున్న సంఘీభావం ప్రజల్లో విశేష చర్చనీయాంశమైంది. జై వాల్మీకి నినాదాలతో మండల కేంద్రం మార్మోగిందిఈ కార్యక్రమంలో తెలికి శ్రీరాములు, మామ బయన్న శ్రీనివాస్ పురం, అన్న శివ తదితర వాల్మీకి సంఘాల ప్రతినిధులు “జై వాల్మీకి” నినాదాలతో సభ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. వాల్మీకి సంఘాల ఐక్యతను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతు నాయకుల పరామర్శరైతు నాయకులు పుష్ప నారాయణరెడ్డి, ఉల్లికల్లు రంగారెడ్డి బుల్లెట్ లింగమయ్యను వ్యక్తిగతంగా పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. “వాల్మీకి సంఘం కోసం బుల్లెట్ లింగమయ్య చేస్తున్న పోరాటం ప్రశంసనీయం. ఇలాంటి సమయంలో అందరం కలిసే ఉండాలి” అని వారు పేర్కొన్నారు.స్థానిక నేతల మద్దతుముచ్చుకోట బయన్న వాల్మీకి నల్లప్ప, ముచ్చుకోట సర్పంచ్, మండల మైనార్టీ యూత్ లీడర్ (తెలుగుదేశం) కత్తిరిమల అజార్, కాశి (పెద్దపప్పూరు) తదితర నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలు యువకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గట్టిగా మద్దతు ప్రకటించారు.ప్రజా మద్దతు పెరుగుతోందిపరామర్శకులలో చిన్నపల్లి కిట్ట, అగ్రహారం ఓ.రెడ్డి, నారాయణరెడ్డి వంటి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వీరందరూ బుల్లెట్ లింగమయ్యకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఏ సమస్య వచ్చినా కలసి పోరాడతామని హామీ ఇచ్చారు.ప్రజలలో చర్చనీయాంశంపెద్దపప్పూరు మండల కేంద్రంలో జరిగిన సంఘీభావం కార్యక్రమం స్థానిక ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుల్లెట్ లింగమయ్యకు లభించిన విశేష మద్దతు వాల్మీకి సంఘాల ఏకతా శక్తిని ప్రతిబింబిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తిరుపతి

తొండమనాడు ప్రాధమిక పాఠశాలకు మైక్ సెట్ వితరణ

శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు తోట గణేష్ ఆధ్వర్యంలో బలిజసేన అధ్యక్షులు కుప్పాల వెంకటేష్ (డుమ్ము రాయల్ ) జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి మండల పరిధిలో ని తొండమనాడు నందు గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్పీకర్ మైక్ సెట్ తో పాటుగా స్టీల్ గ్లాస్ లను వితరణ చేశారు.పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరిస్తూ భవిష్యత్తులో పాఠశాల అభివృద్దికి దోహదపడతామని హామీ ఇవ్వడం జరిగింది.అలాగే విద్యార్థి ని విద్యార్థులకు జ్యూస్,పండ్లు పంపిని చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,వీర మహిళలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.