పిల్లల్ని ఒంటరిగా బయటకి పంపకండి.
మంచిర్యాల జిల్లా 5-9-25 కాసిపేట మోడల్ స్కూల్ ఆవర్ణలో పిల్లల పై వీధి కుక్కలు ధాడి సీసీ కెమెరాలో రికార్డు అయినా దృశ్యాలు బయానకంగా జరిగిన కుక్కలు ధాడి. పిల్లల్ని ఒంటరిగా బయటకి పంపకండి. రిపోర్టర్ లోకేష్ కుమార్ (బాబీ)
మంచిర్యాల జిల్లా 5-9-25 కాసిపేట మోడల్ స్కూల్ ఆవర్ణలో పిల్లల పై వీధి కుక్కలు ధాడి సీసీ కెమెరాలో రికార్డు అయినా దృశ్యాలు బయానకంగా జరిగిన కుక్కలు ధాడి. పిల్లల్ని ఒంటరిగా బయటకి పంపకండి. రిపోర్టర్ లోకేష్ కుమార్ (బాబీ)
శ్రీకాళహస్తి లో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారని,ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నిరసిస్తూ ఎంపిడిఓ కి వినతి పత్రాన్ని అందించారు.రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలియజేసారు.ఖరీఫ్ పంట మొదలుతున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్) రైతు లు పడుతున్న యూరియా సమస్య మీద భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మందనపు రామారావ్ ని కలిసిన పున్నమి ప్రతి నిధి తో మాట్లాడుతూ.. యూరియాని బ్లాక్ మార్కెట్ కు తరలించారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. రైతుల ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం గా కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. సబ్సిడీ యూరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ కు తరలిపొయి రైతులకు అందక హరిగోశ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీనిపై తక్షణమే విచారణ జరిపించాలి.. ఏది ఏమైనా మరింత యూరియాని రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందిఅని రామారావ్ అన్నారు.
పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ) పెనుబల్లి (V. M. బంజర్ ) తెలంగాణ రాష్ట్ర ము లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం అయినా బీజేపీ ప్రధాని మోదీ డబ్బులు విడుదల చేస్తున్నారని బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడి గల మధు సుధన్ రావు అన్నారు. సోమవారం పున్నమి ప్రతి నిధి తో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 4కోట్ల ఇల్లులేని పేదలకు ఇల్లు కట్టించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుట్రతో ఇందిరమ్మ పేరు పెట్టినా మోదీ ప్రభుత్వం ప్రతీ ఇంటికి 1.11 లక్షలు ఇస్తున్నది. దాంతోపాటు ఇంకో 15వేల రూపాయలు ఆదా అయ్యేందుకు సిమెంట్, స్టీల్ పై జీఎస్టీ తగ్గించి మేలు చేసింది. అంటే ప్రతీ పేద ఇంటికి మోదీ ఇప్పటికే 1.26లక్షలు ఇస్తున్నట్టు, అంతే కాకుండా మధ్యతరగతి వారికి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పై సబ్సిడీ (CLSS పథకం) కూడా ఇస్తున్నది మోదీ ప్రభుత్వం. గ్రామానికి రోడ్డు – పీఎం సడక్ యోజన గ్రామంలో టాయిలెట్ – పీఎం స్వచ్ఛభారత్ గ్రామంలో బల్బులు – పీఎం LED గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామం, హరితహారం – గ్రామీణ ఉపాధి నిధులు గ్రామంలో విద్య – నవోదయ, పీఎం శ్రీ పాఠశాలలు గ్రామంలో రూరల్ లైవ్లీ హుడ్ – మహిళా పొదుపు సంఘాలకు 20లక్షల రుణం ఇలాంటి అనేక పథకాలతో గ్రామీణ భారతాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తున్నది మోదీప్రభుత్వం అని మధు అన్నారు.రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నిక లలో బీజేపీ గెలిపించాలీ అని పడిగల మధు సుధన్ రావు ప్రజలకి విజ్ఞప్తి చేసారు.
* కాట్రేనికోన: సుదీర్ఘ కాలంగా పురోహిత వృత్తిలో ఉంటూ పురహితవు కోరే పురోహితులను అమలాపురం ఆపస్థంభ పురోహిత పరిషత్ భాద్రపద పౌర్ణమి ఆదివారం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇందులో భాగంగా కాట్రేనికోన మండలం నుండి నడవపల్లి గ్రామానికి చెందిన పురోహితులు బ్రహ్మశ్రీ వేదుల ఆంజనేయ మూర్తి (హనుమాన్) ఎంపిక చేసి ఘనంగా సన్మానించి సత్కరించారు. వీరి తాత వేదుల ఆంజనేయులు వద్ద చిన్నప్పుడే స్మార్త విద్య పెదనాన్న సత్యనారాయణమూర్తి ద్వారా జ్యోతిషం వాస్తు శాస్త్ర ప్రావీణ్యం తండ్రి సీతారామచంద్ర మూర్తి నుండి వ్యాకరణం సాహిత్యం నేర్చుకుని వంశపారంపర్యంగా ఉన్న పౌరోహిత్యం లో వివాహాలు దేవతా ప్రతిష్ఠలు హోమాలు వైదిక వృత్తిలో ఎన్నెన్నో కార్యక్రమాలు స్థానిక పెద్దల సహకారం పురోహితులు గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ విద్యా పీఠ అధ్యక్షులు, ఆగమాభిజ్ఞ, ధనంజయ,(విమలానందనాధ) గురువర్యులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ (చిన్న) వారి చేతులమీదుగా ఘనంగా సన్మానించి సత్కరించడం పట్ల కాట్రేనికోన మండల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తంచేశారు. అలాగే కాళ్ళకూరి కామేశ్వర శర్మ తమ గురువుగకి ఈవిధంగా సత్కరించడం పట్ల సంతోషం తో కుండలేశ్వస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉన్నత అభివృద్ధి చెందాలని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ శుభాకాంక్షలు తెలియపరిచారు
ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం రైల్వే స్టేషన్ లో జేబు దొంగల హల్చల్. సోమవారం నాడు ఒక కుటుంబము సికింద్రాబాద్ నుండి ఖమ్మం ఇంటర్ సిటీ రైలు నందు దిగారు. ప్రయాణనికుల రద్దీ ఎక్కువ ఉండటం తో ఇదే మంచి సమయం గా బావించిన దొంగ సెల్ ఫోన్ లాక్కొని పారర్ ఐయ్యడు. దొంగ దొంగ అని అరుస్తున్న పట్టించుకునే నాదుడే లేడు. బాధితులు రైల్వే పోలీస్ లకి పిర్యాదు చెయ్యడానికి వెళ్లారు రైలు వచ్చి వెళ్లే వరకు రైల్వే పోలీస్ లు ఉండాలి అని ప్రయాణికులు కోరుతున్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలో ని నగరి వీధి లో ఒక స్వీట్ దుకాణంలో మిక్చర్ కొన్నాడు.అందులో బీడీ ముక్క కనిపించడంతో నివ్వెర పోయాడు.నెలరోజుల ముందు కూడా పెద్దమసీదు వీధిలో టిఫిన్ దుకాణంలో బొద్దింక దర్శనమిచ్చింది.అప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి అంతంత మాత్రంగా చూసి వెళ్లిపోయారు.మరలా ఇలా జరగడంతో అధికారులు ఇప్పటికైనా హోటళ్లు,స్వీట్ షాపులు,పరిశీలించి ఇలాంటివి జరగకుండా చూడాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి @ నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా నేడు (సోమవారం) ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ‘మాక్ పోల్’ నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పిసి మోడీ మాట్లాడుతూ మంగళవారం పార్లమెంట్ హౌస్‌లోని వసుధలోని రూమ్ నెంబర్ ఎఫ్-101లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ”ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు” అని రాజ్యసభ సెక్రెటేరియట్ తెలిపింది. పార్లమెంట్ హౌస్‌లో పోలింగ్ ఏర్పాట్లను ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పిసి మోడీ చేస్తున్నారని వివరించింది. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఉంటారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సంఘ్ పరివార్ నేత వర్సెస్ న్యాయకోవిదుడు సి.పి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సంఘ్ పరివార్ నేత. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 2011 జులైలో సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన సుదర్శన్ రెడ్డి (79) నల్లధనం కేసుల దర్యాప్తులో అలసత్వం చూపినందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక మైలురాయి తీర్పులకు ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞుడైన న్యాయనిపుణుడు. మావోయిస్టులతో పోరాడటానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నియమించిన సల్వా జుడుమ్‌ను ఆయన నేతృత్వంలోని ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సాకుగా చూపుతూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై మావోయిస్టు ముద్ర వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో చట్టవిరుద్ధంగా దాచిన లెక్కల్లో లేని డబ్బును తిరిగి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కూడా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనమే. పౌర హక్కులు, దేశ ప్రయోజనాలను కాపాడిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందని ఇండియా బ్లాక్ పిలుపునిచ్చింది.
నాపున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 8 గర్ కర్నూల్ పట్టణంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.విద్యాదానం మహాదానం ,విద్య నేర్చుకో విలువ పెంచుకో ,నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ముందుమాట ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కేవలం ఒక రోజుగా మాత్రమే కాకుండా, విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసే, అక్షరాస్యత లేని ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి చైతన్యాన్ని కలిగించే సందర్భంగా మారింది. అక్షరాస్యత అనేది సమాజ అభివృద్ధికి మూలస్తంభం. చదవడం, వ్రాయడం నేర్చుకోవడం వల్ల వ్యక్తికి జీవితం మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు, సామాజిక గౌరవం, ఆర్థిక స్వయం సమృద్ధి వంటి అనేక రంగాలలో పురోగతి సాధించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ వ్యాసంలో అక్షరాస్యత అంటే ఏమిటి, దాని అవసరం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, భారతదేశంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, విజయగాథలు, భవిష్యత్తు కోసం తీసుకోవలసిన చర్యల గురించి విశదంగా తెలుసుకుందాం. 📚 అక్షరాస్యత అంటే ఏమిటి? అక్షరాస్యత అంటే చదవడం, వ్రాయడం, అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. ఇది కేవలం అక్షరాలను గుర్తించడం కాదు, వాటిని ఉపయోగించి రోజువారీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం, సమాచారాన్ని అర్థం చేసుకోవడం, ఇతరులతో సంభాషించడం వంటి సామర్థ్యాలను కూడా కలిగి ఉండడం. అక్షరాస్యతను రెండు ప్రధాన భాగాలుగా చూడవచ్చు: ప్రాథమిక అక్షరాస్యత – అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, సరళమైన వాక్యాలను వ్రాయడం. ఫంక్షనల్ అక్షరాస్యత – చదివిన సమాచారాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం, వ్యాపారం, ఆరోగ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల వంటి రంగాలలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. అక్షరాస్యత ఉన్న వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరచడానికి విద్యను ఉపయోగించగలడు. అక్షరాస్యత లేని వ్యక్తికి రోజువారీ జీవితంలో చిన్న పనులు కూడా కష్టంగా మారతాయి. 📊 ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యత స్థితిగతులు ప్రపంచం మొత్తంగా అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇంకా కోట్లాది మంది అక్షరాస్యత లేని జీవితాన్ని గడుపుతున్నారు. యునెస్కో (UNESCO) నివేదిక ప్రకారం, ప్రపంచంలో సుమారు 77 కోట్ల మంది పెద్దలు చదవడం, వ్రాయడం తెలియకుండా జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉంది. శరణార్థ శిబిరాలు, దారిద్ర్యంతో బాధపడే ప్రాంతాల్లో విద్యకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అక్షరాస్యత లేకపోవడం వల్ల: ✔ ఉపాధి అవకాశాలు తగ్గుతాయి ✔ ఆరోగ్యంపై సరైన సమాచారం అందదు ✔ పిల్లల చదువు నిలిచిపోతుంది ✔ సామాజికంగా వెనుకబడిన స్థితి ఏర్పడుతుంది అందువల్ల, అక్షరాస్యతను ప్రపంచ స్థాయిలో మెరుగుపరచడం అనేది అంతర్జాతీయంగా అత్యంత ముఖ్యమైన లక్ష్యం. 🇮🇳 భారతదేశంలో అక్షరాస్యత పరిస్థితి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో ఒకటి. విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఇంకా చాలామంది విద్య అవకాశాలకు దూరంగా ఉన్నారు. తాజా గణాంకాలు (ఉదాహరణకు): ✔ భారతదేశంలో అక్షరాస్యత శాతం సుమారు 77% ✔ పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది ✔ మహిళల అక్షరాస్యత శాతం పురుషుల కంటే తక్కువ ✔ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గిరిజన ప్రాంతాలు, మైనారిటీలు విద్యలో వెనుకబడుతున్నారు అక్షరాస్యతకు అడ్డంకులు: పేదరికం – పిల్లలను పని కోసం పంపడం గ్రామాలలో విద్యాసంస్థల లోపం మహిళల విద్యపై సామాజిక అవగాహన లోపం భాషా సమస్యలు ఉపాధ్యాయుల కొరత అయినప్పటికీ, భారత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. 📖 భారత ప్రభుత్వ కార్యక్రమాలు 1. సర్వశిక్షా అభియాన్ (SSA) ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించిన ముఖ్యమైన కార్యక్రమం. ✔ ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ✔ ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ✔ విద్యార్థులకు స్కాలర్షిప్‌లు 2. మహిళా అక్షరాస్యత కార్యక్రమాలు మహిళల కోసం ప్రత్యేకంగా వయోజన విద్యా కేంద్రాలు, స్వయం సహాయక గ్రూపుల ద్వారా అక్షరాస్యత శిక్షణ. 3. నేషనల్ లిటరసీ మిషన్ (NLM) వయోజనులకు విద్యను అందించి, రోజువారీ జీవితానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యం. 4. డిజిటల్ విద్య కార్యక్రమాలు ఆన్‌లైన్ శిక్షణ ద్వారా పట్టణ, గ్రామ ప్రాంతాలకు విద్య అందించడానికి చర్యలు. 🌟 అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాలు ✅ వ్యక్తిగత స్థాయిలో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆరోగ్యంపై సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఆర్థిక నిర్వహణ సులభమవుతుంది పిల్లల చదువుకు తోడ్పడుతుంది ✅ సామాజిక స్థాయిలో మహిళల శక్తివంతత పెరుగుతుంది కుటుంబంలో శాంతి, ఐక్యత పెరుగుతుంది నేరాల శాతం తగ్గుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెరుగుతుంది ✅ ఆర్థికంగా దేశ అభివృద్ధికి నైపుణ్యమైన మనుషుల వనరు పెరుగుతుంది ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి సామాజిక అసమానతలు తగ్గుతాయి 👩🏫 విజయగాథలు – అక్షరాస్యతతో మారిన జీవితం గిరిజన ప్రాంతానికి చెందిన ఒక మహిళ కథ: తెలియని అక్షరాస్యతతో జీవించిన శాంతమ్మ అనే మహిళ స్వయం సహాయక గ్రూపులో చేరి చదువు నేర్చుకుంది. తరువాత ఆమె తన పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించి కుటుంబానికి ఆదాయాన్ని పెంచింది. గ్రామంలోని యువకుడు: రాములు అనే యువకుడు చదవడం రాకపోవడంతో ఉపాధికి అవకాశం లేక, ఇతరులపై ఆధారపడి ఉండేవాడు. తరువాత వయోజన విద్యా కేంద్రంలో చేరి, చిన్న వ్యాపారం ప్రారంభించి, ఇతరులకు కూడా విద్య నేర్పుతున్నాడు. ఇలాంటి విజయగాథలు దేశవ్యాప్తంగా అనేకంగా ఉన్నాయి. ఇవే అక్షరాస్యత యొక్క శక్తిని తెలియజేస్తాయి. 📢 అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు ✔ యునెస్కో విద్య కోసం ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్య కార్యక్రమాలను అమలు చేస్తోంది ✔ స్థానిక ప్రభుత్వాలు అక్షరాస్యత శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి ✔ సామాజిక సంస్థలు మహిళలు, పిల్లల కోసం శిక్షణలు అందిస్తున్నాయి ✔ డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యను అందించడానికి కొత్త మార్గాలు అభివృద్ధి అవుతున్నాయి 🔍 మన బాధ్యత ప్రతి ఒక్కరూ విద్యను ప్రోత్సహించడానికి చిన్న ప్రయత్నం చేయగలరు: చదువు లేని వ్యక్తులను గుర్తించి వారికి తోడ్పడడం గ్రామాల్లో విద్య గురించి అవగాహన కల్పించడం పిల్లలను పాఠశాలలకు పంపించడం మహిళల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం డిజిటల్ విద్య సాధనాలను ఉపయోగించడం అక్షరాస్యత కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు – సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. 🚀 భవిష్యత్తు కోసం సంకల్పం అక్షరాస్యతను పెంచడం ద్వారా: ✔ సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది ✔ దేశ అభివృద్ధిలో అందరి పాత్ర కీలకంగా మారుతుంది ✔ శాంతియుత సమాజాన్ని నిర్మించవచ్చు భవిష్యత్తులో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి విద్య చేరాలని మనమందరం సంకల్పించాలి. ముగింపు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు. ఇది మన జీవితాన్ని మార్చగల శక్తిని గుర్తు చేసే రోజు. చదవడం, వ్రాయడం తెలిసిన వ్యక్తి తన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోగలడో, సమాజానికి ఎలా తోడ్పడగలడో తెలుసుకునే అవకాశం ఇది. విద్య అందరికీ చేరాలి, మహిళలు, పిల్లలు, వృద్ధులు – ఎవరికీ విద్యలో లోటు ఉండకూడదు. మనము ప్రతి ఒక్కరం చిన్న ప్రయత్నం చేస్తే, ప్రపంచాన్ని అక్షరాస్యతతో నింపగలం. విద్యే శాంతికి మార్గం, అభివృద్ధికి ఆధారం, స్వయం సమృద్ధికి మూలం. సెప్టెంబర్ 8 న జరిగే కార్యక్రమాన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకుని, అక్షరాస్యతను ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి చేరేలా పని చేయాలి. “చదువు అందరికీ – వెలుగు ప్రతి ఇంటికి!”