Wednesday, 6 May 2026

Blog

అనంతపురం

బుల్లెట్ లింగమయ్యపై దాడి ఖండన

తాడిపత్రి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) బుల్లెట్ లింగమయ్యపై జరిగిన భౌతిక దాడిని పోలీసులు నిర్ధారించగా, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పలువురు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా లాయర్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోవిందరాజులు, MVRPS జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు, వాల్మీకి నాయకులు రామంజి, వన్నూరు స్వామి, TSNV నాయకుడు నవీన్ చౌదరి లింగమయ్య గారి ఇంటి దగ్గరికి చేరుకుని ఆత్మీయంగా పరామర్శించారు.

అన్నమయ్య

గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులియాల రమేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులియాల రమేష్ బాబు గారు ఇటీవల టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా, గ్రీన్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించబడిన పులియాల రమేష్ బాబు గారిని ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు అభినందించారు.ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ –”పులియాల రమేష్ బాబు గారు పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, సాధారణ కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పట్టణాల అందాల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తారని మేము నమ్ముతున్నాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అనంతపురం సూపర్ సిక్స్ సభ ఏర్పాట్లను సమీక్షించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న “సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభ” ఏర్పాట్లను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ గారు శనివారంసమీక్షించారు. ఈ సందర్భంగా వారు పార్టీ ప్రచారరథాలను,పోస్టర్లనుఆవిష్కరించారు.తదుపరి సభా ప్రాంగణంలో అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్ సదుపాయం, రూట్ మ్యాప్ తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ – “అనంతపురం సభతో జనసేన శక్తి మరోసారి ప్రతిఫలిస్తుంది. ప్రజల మద్దతుతో పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో బలమైనప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన మార్పుకు హామీ ఇస్తారు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం

చిట్వేలి సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) రాపూర్ రోడ్డులోని తిమ్మాయపాలెం క్రాస్ వద్ద గల శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో నల్లప్ప (రిటైర్డ్ ఏఈఓ, వ్యవసాయశాఖ) గారి వర్ధంతి సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించారు.మన చిట్వేల్ గ్రామానికి చెందిన రమాదేవి తండ్రిగారు, బెంగళూరులో స్థిరపడిన మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యము, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధూప దీప నైవేద్య సామాగ్రి అందజేయడంతో పాటు మధ్యాహ్న భోజన ప్రసాదం ఏర్పాటు చేశారు. బెంగళూరులో నివసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆశ్రమంలోని వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. నల్లప్ప గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు మాట్లాడుతూ—“ఇంటి వద్ద శుభకార్యాలు జరిగినప్పుడు వృద్ధులకు అండగా ఉండే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, నాగలక్ష్మమ్మ, పద్మావతమ్మ, నిర్వాహకుడు చంద్రశేఖర్ తోటి మిత్రులు ఆత్మారెడ్డి, కోటి, నరసింహులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో రైతులకు నానో, జీవన ఎరువులపై అవగాహన

చిట్వేలి సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చిట్వేలి సోమవారం మండలంలోని తిమ్మాయగారిపల్లి, సి.కందులవారిపల్లి గ్రామాల్లో రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి.సుధాకర్ మాట్లాడుతూ, నానో యూరియా, నానో డీఎపి వినియోగం ద్వారా ఎరువుల వృధా తగ్గించడంతో పాటు పంటలకు అవసరమైన మోతాదులోనే పోషకాలు అందుతాయని, పర్యావరణాన్ని కాపాడుతూ అధిక దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు.రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులైన రైజోబియం, అజాల్లా, అజోస్పిరిల్లుమ్ వినియోగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో PDMS కిట్స్, ఘన జీవామృతం, బీజామృతం వాడకం రైతులకు మేలు చేస్తుందని వివరించారు.చిట్వేల్ తహసీల్దార్ శ్రీమతి స్పందన మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని, ఎవరైనా ఎంఆర్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాతీయ అంతర్జాతీయ

నా కొడుకు రాజకీ ఎంట్రీ పక్కా.. వైఎస్ షర్మిల

సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి @ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడు అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం ఖాయమైంది. అయితే రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. లేదా షర్మిలతో కలిసి కొత్త పార్టీ స్థాపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సినిమా

విజయవాడ ఉత్సవ్’ పేరిట ఎగ్జిబిషన్‌ – సెప్టెంబరు 22న ‘OG’ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఆరంభం

సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి @ దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరిట కార్యక్రమం – సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడోత్సవాలు, 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగ్జిబిషన్‌ ఆరంభం కావడం విశేషం దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌ పేరుతో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు విజయవాడ నగరంలో పెద్దఎత్తున వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా పర్యాటకానికి జవసత్వాలు అందించేలా ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో: ప్రముఖ సినీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ శ్రేయాస్‌ మీడియా ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానదీ తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్‌ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా 11 రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనలు: విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా కృష్ణా నదిలో పడవల పోటీలు ఉంటాయి. జలక్రీడలు, డ్రోన్‌ షో, కిడ్స్‌ జోన్స్

చిత్తూరు

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం

జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గురుపూజోత్సవ సందర్భంగా ఎంపికై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, చిత్తూరు మరియు పూతలపట్టు ఏంఎల్ఏ లు గురజాల జగన్ మోహన్, మురళీ మోహన్ తదితర ముఖ్యుల సమక్షంలో అవార్డు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందుకొన్న ఉపాద్యాయురాలు రమ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు.వివరాలు…..పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం జి ఎల్ ఎస్ ఫారం జడ్పీ హై స్కూల్ లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన ఆర్. రమ ను సోమవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశేఖర్ ఆద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిoచి ఉపాద్యాయురాలు విద్యార్థులకు అందిస్తున్న సేవలను కొనియాడారు.కార్యక్రమంలో ఉపాద్యాయులు పట్టాభి,సురేష్, సంగీత,సిద్ధమ్మ,సుగుణమ్మ, లక్ష్మీ,కళావతి,ప్రమీల, మోక్ష తదితరులు వున్నారు.

ఖమ్మం

స్థానిక సమస్య ల పరిష్కారం కోరుతూ బీజేపీ ర్యాలీ

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఈవీ రమేశ్ గారి ఆధ్వర్యంలో “హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ”… బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ నందు మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన వైఖరిని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని, యావత్తు ఖమ్మం జిల్లా ప్రజానికం బిజెపి వైపు చూస్తుందని రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ మండల బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ తో పాటు పలు మండల అధ్యక్షులు రాష్ట్ర,జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు తదితర పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

సైబర్ ఫ్రాడ్ ప్రయత్నం – శివ అప్రమత్తంగా మోసాన్ని అడ్డుకున్నారు

చిట్వేల్ మండలానికి చెందిన శివకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12:30 గంటలకు డాక్టర్ సంజయ్ గుప్తా పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సీలింగ్ ఫ్యాన్ కావాలని అడిగి, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుతానని చెప్పాడు. నిజంగా డబ్బు పంపకుండా, బ్యాంక్ మెసేజ్‌లా కనిపించే నకిలీ టెక్స్ట్ మెసేజ్ పంపి “₹17,000 పంపించాను” అని నమ్మబలికాడు. అనంతరం ఎక్కువ అమౌంట్ పొరపాటున పంపానని, వెంటనే జీపే ద్వారా రీఫండ్ చేయమని బ్రతిమిలాడాడు. కానీ శివ అనుమానం చెంది తన అకౌంట్ చెక్ చేయగా ఎటువంటి డబ్బు రాలేదని తెలుసుకుని మోసపోకుండా తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా శివ ప్రజలకు హెచ్చరిక చేస్తూ, ఇలాంటి నకిలీ మెసేజ్‌లు నమ్మకూడదని, ఎవరికీ డబ్బు రిటర్న్ చేయకూడదని, అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.