Wednesday, 6 May 2026

Blog

విశాఖపట్నం

జైలు నుంచి తపించుకున్నా ఖైదీ.

జైలు నుంచి తపించుకున్నా ఖైదీ. చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారీ cctv ఫుటేజ్. హెడ్ వార్డర్ పై ధాడి చేసి పరారీ అయిన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము.తపించుకున్న ఖైదీల కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు. రిపోర్టర్: లోకేష్ కుమార్ (బాబీ).

తెలంగాణ

ఒక ఆధార్, ఒక యూరియా

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ఒక ఆధార్ కార్డు తో, ఒక యూరియా బస్తా ఇస్తున్నారు. దీనితో రైతులకి కావలసినంత యూరియా లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు, యూరియాను సకాలంలో అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

పున్నమి ప్రతినిధి ప్రాదేశిక ఎన్నికల ముసయిదా ఓటర్ల, పోలింగ్ కేంద్రాలా జాబిత పై చర్చించెందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేత లతో కలెక్టరేట్ లో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహిస్తున్న ట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలియజేసారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు అష్టలక్ష్మి ఆలయంలో రుక్మిణి కళ్యాణం కార్యక్రమం ఘనంగా జరిగింది

నెల్లూరులోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆదరణీయులు డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన రుక్మిణి కళ్యాణం కార్యక్రమం భక్తుల భాగస్వామ్యంతో, భక్తిపూర్వకంగా జరిగింది.. సాంప్రదాయ శైలిలో, వేదమంత్రాలతో, అర్చకుల ఆధ్వర్యంలో రుక్మిణి-కృష్ణుల కళ్యాణం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, ప్రసాద వితరణలో పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాములు అనుకుంటివా పుష్ప.. జర జాగ్రత్తగా చూడు అప్పా..వీటికి కూడా మంచి గిరాకే మార్కెట్లో

సెప్టెంబర్ 08 పున్నమి ప్రతినిధి@కాకినాడ: కాకినాడ తీరంలో మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కి స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. చూడగానే పాముల్లా కనిపించే ఈ జీవులు నిజానికి చేపలేనండోయ్‌. వీటిని స్థానికంగా నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు. సముద్ర గర్భంలో లోతైన ప్రదేశాల్లో వీటి వాసం ఉండటంతో తరచుగా వలల్లో చిక్కవు. అందుకే ఒక్కసారి పట్టుబడితేనే పెద్దగా చర్చనీయాంశంగా మారతాయి. ఆదివారం తెల్లవారుజామున సముద్ర యాత్రకు వెళ్లిన మత్స్యకారుల వలకు వీటిలో అనేకం చిక్కాయి. తిరిగి తీరానికి వచ్చిన తర్వాత వాటిని కుంభాభిషేకం రేవు వద్దకు తీసుకువచ్చి విక్రయించారు. అరుదైనవి కావడంతో వాటిని చూడటానికి స్థానికులు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. సైజు ఆధారంగా కిలో ధర రూ.180 నుంచి రూ.250 వరకు పలికింది. పెద్దవాటికి ఎక్కువ ధర, చిన్నవాటికి కొద్దిగా తక్కువ ధర లభించింది. వీటి మాంసం రుచికరంగా ఉంటుందట. సముద్రంలో అరుదుగా లభించడం వల్ల ఎప్పటికప్పుడు ఎక్కువ మొత్తంలో దొరకవు. మత్స్యకారులు ఈ పాముచేపలను మంచి ధరకు అమ్మి సంతృప్తి వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లోని జనాలు కూడా ఇవి సముద్రంలో ఎలా జీవిస్తాయో తెలుసుకోవడానికి ఆసక్తిగా వీటిని పరిశీలించారు. ఇలా కాకినాడ తీరంలో అరుదైన చేపలు చిక్కడంతో.. రేవు ప్రాంతం కాసేపు సందడిగా మారింది.

Blog

కళారాధన లో ఉత్తేజ భరిత దేశ భక్తి బృంద నృత్యాలు.

కళారాధన నంద్యాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి సహకారంతో నంద్యాల ఐఎంఏ, లయన్స్ క్లబ్ , సంయుక్త నిర్వహణలో ఈనెల 1వ తేదీ నుండి జరుగుతున్న మాతృభూమికి కళార్చన పోటీలలో ఆదివారం ఆధునిక నృత్యాల పోటీలు, దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోనల్ చైర్మన్ నిజాముద్దీన్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్, నేను నిన్ను వివరించిన శ్రీమన్నారాయణ నటరాజు విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో ఆదివారం నృత్య ఉత్సవాల్ని ప్రారంభించారు. ప్రత్యేకమైన ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తులలో, చక్కటి హావభావాలతో, వేగవంతమైన ఆధునిక సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్య విన్యాసాలతో బాలల ప్రతిభ అధిక సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఉత్తేజం కలిగించిన దేశభక్తి బృంద నృత్యాలు ఆదివారం సాయంత్రం దేశభక్తి బృంద నృత్యాల పోటీలు నిర్వహించారు. ఉత్తేజ పూరితమైన దేశభక్తి గీతాలకు ప్రదర్శించిన నృత్యాలు తిలకించిన ప్రేక్షకులను ఉద్వేగ భరితం చేసాయి ఉద్వేగ పూరిత ఏకపాత్రాభినయాలు: బాలలు చత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ ఏకపాత్రాభినయాలతో ఆహుతుల్ని తమ నటనా చాతుర్యంతో అలరించారు ఈ పోటీలకు విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ న్యాయ నిర్ణేత గా వ్యవహరించారు. ఈ పోటీలను కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ ,కార్యనిర్వాహక కార్యదర్శులు రవి ప్రకాష్, అన్నెం శ్రీనివాసరెడ్డి,రంగనాథ్ కార్యవర్గ సభ్యులు డి.సీ.పీ. శర్మ, వి.వి. శివరామిరెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, నిర్వాహకులు మజీద్,మధు, వెంకటేశ్వర్లు సూర్య ఇస్మాయిల్ పర్యవేక్షించారు సోమ వారం నిర్వహించే పోటీలు: సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో ఉదయం సంస్కృత శ్లోకాల పోటీలు, మధ్యాహ్నం జూనియర్, సీనియర్ విభాగాలలో తెలుగు కవిత గానం పోటీలు నిర్వహిస్తారు

Blog

విశ్వ ఫిజియోథెరపీ దినోత్సవం

ఫిజియోథెరపీ (Physiotherapy) అనేది శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు, శరీరంలోని కండరాలు, ఎముకలు, నరాలు, సంధులు, శ్వాసకోశం, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే శాస్త్రీయ చికిత్స విధానంగా చెప్పవచ్చు. ఇది వ్యాధిని పూర్తిగా నయం చేయడమే కాదు, జీవనశైలిని మెరుగుపరచడానికి, శరీరాన్ని బలపరచడానికి, శస్త్రచికిత్స తర్వాత తిరిగి కోలుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న World Physiotherapy Dayను జరుపుకుంటారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో, వృద్ధుల సంరక్షణలో, క్రీడాకారుల ఫిట్నెస్‌ను పెంచడంలో ఫిజియోథెరపీ చేసే సేవలను గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. ఫిజియోథెరపీ అంటే ఏమిటి? ఫిజియోథెరపీ అంటే శరీరాన్ని నయం చేయడానికి లేదా శక్తిని పెంచడానికి శారీరక వ్యాయామాలు, మసాజ్, విద్యుత్ చికిత్సలు, వేడి/చలి చికిత్సలు, శ్వాస వ్యాయామాలు, నీటి చికిత్సలు, స్ట్రెచింగ్‌లు, యోగా వంటి విధానాలను ఉపయోగించే వైద్య ప్రక్రియ. ప్రధాన లక్ష్యాలు ✔ నొప్పిని తగ్గించడం ✔ కండరాల బలాన్ని పెంచడం ✔ ఎముకలు, సంధుల వశ్యతను మెరుగుపరచడం ✔ శ్వాస సంబంధిత సమస్యలను నియంత్రించడం ✔ శస్త్రచికిత్స అనంతరం శరీరాన్ని తిరిగి కోలుకునేలా చేయడం ✔ ఆటలలో గాయాలను నివారించడం ✔ దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడం ఫిజియోథెరపీ చరిత్ర ఫిజియోథెరపీ అభివృద్ధి ప్రాచీన కాలం నుంచే ఉంది. పురాతన గ్రీకు, ఈజిప్టు వైద్యులు శరీరాన్ని నయం చేయడానికి మసాజ్ మరియు వ్యాయామాలను ఉపయోగించేవారు. తరువాత 19వ శతాబ్దంలో పారిస్, లండన్ వంటి నగరాల్లో శాస్త్రీయంగా దీని పాఠ్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులను తిరిగి ఆరోగ్యంగా మార్చేందుకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడింది. 1951లో World Confederation for Physical Therapy (WCPT) అనే అంతర్జాతీయ సంస్థ ప్రారంభమై, ఈ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. భారతదేశంలో కూడా ఫిజియోథెరపీ విద్యాసంస్థలు ఏర్పడి, ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విస్తరించింది. ఫిజియోథెరపీ ప్రాముఖ్యత నేటి కాలంలో జీవనశైలి మార్పులు, పనిపై ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వల్ల అనేక వ్యాధులు మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వీటిని నియంత్రించడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాన ప్రయోజనాలు: నొప్పి తగ్గింపు – వెన్ను నొప్పి, మెడ నొప్పి, మోకాలి నొప్పి వంటి సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తుంది. క్రీడలలో మెరుగైన పనితీరు – క్రీడాకారులకు శక్తిని పెంచే వ్యాయామాలు అందిస్తుంది. శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడం – హిప్ రీప్లేస్‌మెంట్, మోకాలి శస్త్రచికిత్స వంటి వాటి తర్వాత శరీరాన్ని మళ్లీ సరైన స్థితికి తేవడంలో సహకరిస్తుంది. వృద్ధుల సంరక్షణ – ఎముకలు బలహీనపడడం, కీళ్ల వాతం వంటి సమస్యలను నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. శ్వాస సమస్యలు – ఆస్థమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధుల్లో శ్వాస వ్యాయామాల ద్వారా ఉపశమనం అందిస్తుంది. హృదయ ఆరోగ్యం – హృదయ సంబంధిత వ్యాధుల తర్వాత శారీరక శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యం – వ్యాయామాల ద్వారా ఒత్తిడిని తగ్గించి, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫిజియోథెరపీ విధానాలు ఫిజియోథెరపీకి అనేక విధానాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి సమస్యకు అనుగుణంగా ప్రత్యేకంగా చికిత్సను అందిస్తారు. 1. మసాజ్ థెరపీ కండరాలను రిలాక్స్ చేయడం, నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. 2. ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ (TENS, EMS) కండరాలను ఉత్తేజపరచడం ద్వారా నొప్పిని తగ్గించేందుకు విద్యుత్ చికిత్సను ఉపయోగిస్తారు. 3. హీట్/కోల్డ్ థెరపీ వేడిని ఉపయోగించి కండరాలను రిలాక్స్ చేయడం లేదా చల్లని చికిత్స ద్వారా వాపును తగ్గించడం. 4. స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీర వశ్యతను పెంచి, సంధుల కదలికను మెరుగుపరుస్తాయి. 5. శ్వాస వ్యాయామాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ఆస్థమా, ఊపిరితిత్తుల సమస్యల సమయంలో ఉపయోగపడతాయి. 6. నీటి చికిత్స (Hydrotherapy) నీటిలో వ్యాయామాలు చేయడం ద్వారా శరీరంపై ఒత్తిడిని తగ్గిస్తూ శక్తిని పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపీ అభివృద్ధి ప్రపంచంలోని అనేక దేశాలు ఫిజియోథెరపీని వైద్య చికిత్సలో ముఖ్యమైన భాగంగా గుర్తిస్తున్నాయి. ✔ యూరప్ దేశాల్లో వృద్ధులు ఎక్కువగా ఉండటంతో, ఫిజియోథెరపీ సేవలకు అధిక డిమాండ్ ఉంది. ✔ అమెరికాలో హృదయ వ్యాధులు, గుండె శస్త్రచికిత్స అనంతరం చికిత్సకు ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. ✔ ఆసియా దేశాల్లో శ్వాస సమస్యలు, జీవనశైలికి సంబంధించిన వ్యాధులకు ఫిజియోథెరపీని వినియోగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో ఫిజియోథెరపీ సేవలను ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో ఫిజియోథెరపీ పరిస్థితి భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఫిజియోథెరపీపై అవగాహన పెరుగుతోంది. నగరాల్లో వైద్య కేంద్రాలు, ఆసుపత్రులు, స్పోర్ట్స్ క్లినిక్లు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా చికిత్స పొందే వ్యాధులు: ✔ వెన్ను నొప్పి ✔ మోకాలి నొప్పి ✔ స్ట్రోక్ తర్వాత శరీరాన్ని తిరిగి కోలుకునే చికిత్స ✔ గర్భధారణ అనంతర శారీరక మార్పులు ✔ క్రీడల గాయాలు ✔ శ్వాస సంబంధిత సమస్యలు భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో కూడా ఫిజియోథెరపీ సేవలను చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఫిజియోథెరపీ విద్యా వ్యవస్థ భారతదేశంలో BPT (Bachelor of Physiotherapy), MPT (Master of Physiotherapy), PhD వంటి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులు, క్రీడా కేంద్రాలు, రీహాబిలిటేషన్ కేంద్రాల్లో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పరిశోధన, నూతన చికిత్స పద్ధతుల అభివృద్ధికి కూడా అవకాశం ఉంది. ఫిజియోథెరపీ ద్వారా జీవనశైలిని మెరుగుపరచడం ✔ రోజూ వ్యాయామం చేయడం ✔ సరైన నిద్ర అలవాట్లు ✔ ఆరోగ్యకరమైన ఆహారం ✔ ఒత్తిడిని నియంత్రించడం ✔ సరైన భంగిమలో కూర్చోవడం, నడవడం ✔ శారీరక శ్రమకు సమయం కేటాయించడం ఇవి పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

Blog

నంద్యాలలో సెప్టెంబర్ 13 , 14వ తేదీలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం మరియు ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ నిర్వహణలో జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక కోసం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కుమారి ముని నాగలక్ష్మి జ్ఞాపకార్థం నిర్వహించబడుతున్నవి క్రీడాకారుల భోజనం వసతి మరియు మెమొంటో లను ముని నాగలక్ష్మి అన్న, బేతంచర్ల పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ ఎం పీ రాజేష్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరవుతున్నారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585.డాక్టర్.జి. రవికృష్ణ,అధ్యక్షులు జి. రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం పి రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం

ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం – భక్తుల భారీ రద్దీ

శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం రోజున 27,410 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, భక్తులు అవసరమైన ఏర్పాట్లతో, సమయాన్ని ముందుగా ప్రణాళిక చేసుకుని, శ్రీవారి సేవలను శ్రద్ధగా అనుభవించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Blog

సెప్టెంబర్ 13 ,14వ తేదీలలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయస్థాయి కి ఎంపిక

నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం మరియు ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ నిర్వహణలో జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక కోసం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కుమారి ముని నాగలక్ష్మి జ్ఞాపకార్థం నిర్వహించబడుతున్నవి క్రీడాకారుల భోజనం వసతి మరియు మెమొంటో లను ముని నాగలక్ష్మి అన్న, బేతంచర్ల పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ ఎం పీ రాజేష్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరవుతున్నారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585.డాక్టర్.జి. రవికృష్ణ,అధ్యక్షులు జి. రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం పి రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.