Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మరి కాసేపట్లో చంద్రగ్రహణం… ఇలా చూడండి!!

(పున్నమి న్యూస్) సెప్టెంబర్ 7 :/// ఇవాళ రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషముల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల 25 నిమిషములు వరకు ఇది కొనసాగుతుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా రాత్రి 8 గంటల 58 నిమిషములకు చంద్రగ్రహణం మొదలు కానుంది.

ఖమ్మం

కాసేపట్లో భారత్ లో చంద్ర గ్రహణం

పున్నమి ప్రతి నిధి గ్రహణ సమయాలు: • ప్రారంభం: రాత్రి 8:59 • ముగింపు: ఉదయం 2:24 • పూర్తి దశ ప్రారంభం: రాత్రి 11:01 • గరిష్ట గ్రహణం: రాత్రి 11:42 సూచన: భారతీయ పండితుల సూచన ప్రకారం చంద్రగ్రహణం సమయంలో తినడం, త్రాగడం మానుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నాం: రష్యా

సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ రష్యా Enteromix అనే క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించింది. ఇది ట్యూమర్లను కరిగించి వాటిని నాశనం చేస్తుందని తెలిపింది. లంగ్స్, బ్రెస్ట్, పెద్దపేగు తదితర క్యాన్సర్లకు చెక్ పెడుతుందని చెప్పింది. ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీన్ని అభివృద్ధి చేయగా, క్లినికల్ ట్రయల్స్లో 100% ఫలితాలొచ్చినట్లు వెల్లడించింది. దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు…///

చిత్తూరు, సెప్టెంబర్ 7: (పున్నమి న్యూస్ )://// తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి బొల్లినేని మునిస్వామి నాయుడు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు, మునిస్వామి నాయుడు గారి మనవరాలు శ్రీమతి జానకి గారు, ఆమె భర్త తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడు శ్రీ చక్రవర్తి గారు కలిసి తిరుత్తని లోని వారి నివాసంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన అంశాలను చర్చించారు.అనంతరం వారు చిత్తూరు జిల్లా కేంద్రానికి చేరుకొని మున్సిపల్ పార్క్‌లోని ప్రతిష్టకు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వారిని ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. బొల్లినేని మునిస్వామి నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజాసేవలను స్మరించుకుంటూ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలతో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమం ద్వారా నాయుడు గారి సేవలను యువతకు పరిచయం చేయడం, ఆయన ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు.

E-పేపర్

మంత్రి ఆనం ను కలిసిన చేజర్ల నేతలు

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తాడేపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సల్మా షిరీన్ మంత్రికి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ రావి పెంచల రెడ్డి,తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు కొమ్మి సిద్ధులు నాయుడు,తెలుగుదేశం పార్టీ మండల టిడిపి అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్,తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా బీసీ ఉపాధ్యక్షులు చీర్ల వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టుపల్లి ఎంపీటీసీ సభ్యులు షేక్ మస్తాన్,భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మి ప్రసాద్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్లమూడి వెంకటేశ్వర్లు నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విజ్ఞాన్ కాలేజ్ అధినేత మారం రెడ్డి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల రామానాయుడు,తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత అధ్యక్షులు రాజాల ఆదినారాయణ రెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూర్పుపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు తియ్య బిండి వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే మహేష్ బాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన చంద్రమౌళి చౌదరి,తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాలెం పెంచలయ్య,తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తలూరు శ్రీనివాసులు,మైనార్టీ నాయకులు షేక్ సాదిక్, షేక్ సుభాని, షేక్ రహిమాన్, షేక్ దావూద్, షేక్ లతీఫ్, బాంబే షేక్ సుల్తాన్. పాల్గొన్నారు. అలాగే వీరితోపాటు చేజర్ల మండలంలోని అనేక గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, పార్టీకి అంకితభావంతో సేవలు అందించనున్న షేక్ సల్మా షిరీన్ కు నాయకులు, కార్యకర్తలు సమిష్టి గా ఆశీస్సులు అందించమన్నారు.

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీచేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్07) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్ళపూడి మండలం తాడిపూడి, తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, తాళ్ళపూడి గ్రామాలు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన రూ. 4,05,519/- ల విలువ గల చెక్కులను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, మరియు, కూటమి ముఖ్య నాయకులు

తిరుపతి

పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలు పేట బ్రదర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో ఘనంగా జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు

శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించుతూ, “చిల్లంగులు చేతబడులు మూఢనమ్మకాలు – మూఢనమ్మకాలు విడనాడండి, శాస్త్రీయ సమాజాన్ని నిర్మిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం” అనే నినాదాలతో జన విజ్ఞాన వేదిక (జెవివి) శ్రీకాకుళం జిల్లా మహాసభలు ఆదివారం యుటిఎఫ్ భవనంలో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథుల ప్రసంగంజెవివి రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ కమిటీ సభ్యులు జి. మురళీధర్ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూఢనమ్మకాలు, మతతత్వాలను శాస్త్రీయ విద్య ద్వారానే తగ్గించవచ్చని చెప్పారు. రాజ్యాంగ లక్ష్యాల సాధనకు ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.సీనియర్ నాయకులు కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ – చెకుముకి సైన్స్ సంబరాలు, యూరేకా సైన్స్ ఎక్స్పోలు, శాస్త్రీయ దృక్పథ క్యాంపెయిన్ల ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించడమే జెవివి లక్ష్యమని తెలిపారు.జిల్లా నాయకుల అభిప్రాయాలుజిల్లా అధ్యక్షుడు కుప్పిలి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ – చిల్లంగులు చేతబడులు అనే పేరుతో హత్యలు జరగడం దారుణం. ఇవి శాస్త్రీయ ఆధారంలేని మూఢనమ్మకాలని ప్రజల్లో చైతన్యం కలిగించాలి అన్నారు.సభలో ఆమోదించిన తీర్మానాలువిద్యా, ఆరోగ్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి.వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేయరాదు.పర్యావరణానికి ప్రమాదం కలిగించే అణు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించరాదు.కొత్త జిల్లా కమిటీ ఎన్నికమహాసభలో కొత్త జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడు: గొంటి గిరిధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి: కుప్పిలి కామేశ్వరరావు జిల్లా పాట్రన్: కొత్తకోట అప్పారావుజిల్లా గౌరవాధ్యక్షులు: బొడ్డేపల్లి జనార్ధనరావు, సాయి శ్రీనివాస శర్మ, బొడ్డేపల్లి మోహన్ రావు ఉపాధ్యక్షులు: ఎన్ కుమార్ స్వామి, ఎం వాగ్దేవి, పి కూర్మా రావు, ఎస్ సంజీవరావు కోశాధికారి: వి.ఎస్. కుమార్ ఇకపైన సైన్స్ & కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, పర్యావరణం, ఆరోగ్యం, యువజన విభాగం, సోషల్ మీడియా, సాంస్కృతిక విభాగాలకు కన్వీనర్లను కూడా ఎన్నుకున్నారు. ఈ మహాసభల్లో 62 మంది వివిధ ఫోరంల నాయకులు పాల్గొని చర్చలు జరిపారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకే జెవివి ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశంలో బీసీలకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే కాకర్ల

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. సీతారామపురం మండల సొసైటీ అధ్యక్షుడిగా సోమనబోయిన రాజశేఖర్ ను నియమించబడిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సొసైటీ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్లు పెనుబడి రఘురాములు, గొల్లపల్లి భాస్కర్లను శాలువా లతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ఎంతో నమ్మకం ఉంచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు శనివారం నిర్వహించిన భారీ ర్యాలీ కు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. నెల్లూరు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీతారామపురం మండలంలోని అభివృద్ధి సంక్షేమం పై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. గడిచిన 14 నెలల్లో సుమారు 60 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో సీసీ రోడ్ల పనులు, 12 కోట్లతో విద్యారంగం అభివృద్ధి పై ఖర్చు చేశామన్నారు. వింజమూరు లో డయాలసిస్ కేంద్ర ఏర్పాటు, సుమారు 6 కోట్ల రూపాయలతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందన్నారు. సీతారామపురం, ఉదయగిరి మండలాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా కార్పొరేటర్ వైద్యం అందేలా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సీతారామపురం మండల మాజీ జెడ్పిటిసి కలివెల జ్యోతికి మెంబర్ గా చోటు కల్పించి ఆమె సూచనలతో సీతారామపురం ప్రాంత ప్రజల కు వైద్య సదుపాయాలు సకాలంలో అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. తెలుగుదేశంలో యువకులకు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని అందులో భాగంగానే సీతారామపురం మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజా, యువబినాయకులు చింతల శ్రీను లను టిడిపి ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, సీతారామపురం అభివృద్ధిలో వారి పాత్ర కీలకమన్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజకీయంగా ఆర్థికంగా పూర్తిగా వెనక్కి నెట్టేసిందని, కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి పొందుతూ ముందుకు వెళుతుందన్నారు. వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లలో నియోజకవర్గంలోని 143 పంచాయతీలలో కనీసం పంచాయతీల నిధులు లేని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలకు నిధులు కేటాయించి పంచాయతీల అభివృద్ధికి తోడ్పడిందన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నిటిని అమలు చేసి ప్రజల ఆదరణాభిమానాలు పొందిందన్నారు. కేవలం టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందినదని,మిగిలిన వారు ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తూ కాలాన్ని గడిపేసారన్నారు. రాష్ట్రంలో వైసిపి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాబోయే స్థానిక ఎన్నికలలో మరోసారి వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పి నియోజకవర్గంలోని 143 పంచాయతీలను, ఎంపీటీసీలు, జడ్పిటిసి లను గెలుచుకుంటామనే నమ్మకం ఉందని ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ సభ, కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.