Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

జలదంకి గమళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తిరుణాళ్ళు…////

జలదంకి :సెప్టెంబర్ 07 (పున్నమి న్యూస్) ప్రతినిధి :// జలదంకి మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని గమ్మళ్లపాలెం లో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు నిర్వహించారు. గమళ్లపాలెంలో ఎంతో అంగరంగ వైభవంగా పోలేరమ్మ తల్లి తిరునాళ్లు కోలహాలంగా నిర్వహించారు. ఈ తిరుణాలలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వింతా సుబ్బారెడ్డి గమళ్ల పాలెం గ్రామ ప్రజలతో కలసి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంపాని వెంకటేశ్వర్లు, సూరం రమేష్, జంపాని శ్రీకాంత్,జంపాని శీనయ్య, అన్నం వెంకటేశ్వర్లు, అన్నం మల్లికార్జున,ఉప్పాల శీనయ్య, సూరం నవీన్, అన్నం మధు, అన్నం వెంకయ్య, చలంచర్ల నారాయణ, ఈసారపు బ్రహ్మయ్య గ్రామ నాయకులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి, మారుబోయిన నారాయణ, ఏగూరి రఘు, ఒంగోలు మాల్యాద్రి, ఒంగోలు మదన్, కొమరగిరి నారాయణ, ఉప్పు ప్రసాదు, ఎస్ కే రఫీ గమల పాలెం గ్రామ ప్రజలతో కలిసి పోలేరమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్నారు.

తిరుపతి

కనబడుటలేదు

శ్రీకాళహస్తి నియోజకవర్గం తోట్టంబేడు మండలం , పొయ్య గ్రామం లో నివాసముంటున్న గంధం.ఆదిలక్ష్మి (42,) తోట్టంబేడు మండల ఆఫీసులో తలారి పని చేస్తూ ఉన్న ఈమె శనివారం 06/09/2025 నాడు పొయ్యి గ్రామం నుంచి కుటుంబ గొడవల వల్ల ఇల్లు విడిచి మనస్థాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోవడం జరిగింది.ఆచూకీ తెలిసినవెడల ఈ క్రింది నెంబర్ కి 9391264743 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

*రాష్ట్ర వ్యాప్తంగా గురు పూజోత్సవం చేయండి — ఏజిటియుపిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ

* తిరుపతిలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో ఏ జి టి యు పి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ * “గాండ్ల కార్పొరేషన్” పై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి *తిరుపతి :* గురువులను స్మరించుకోవడం, ఉత్తమ గురువులను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం (ఏ జి టి యు పి ఎస్ ఎస్) ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని ఏజిటియుపిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.. 2025లో భాగంగా అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం- తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్ నందు గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షులు కందాటి రామిశెట్టి సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ విశిష్ట అతిథిగా, తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్స్లర్ సరోజమ్మ, డిఎస్పి (తిరుపతి) వి.శ్రీనివాసులు, రెడ్డి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ మాట్లాడుతూ, మన గాండ్ల కులంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం చాలా గర్వకారణమన్నారు. అలాగే, గాండ్ల కులస్తులకు కార్పొరేషన్ రావడంలో చాలా ఆలస్యం జరుగుతున్నదని, దీంతో యువత చాలా నష్టపోతున్నారని అన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వము గాండ్ల కులస్తుల కోసం కార్పొరేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామని, త్వరగా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, డి భాస్కర్, (కోశాధికారి, తిరుపతి), టి.చంద్రశేఖర్ (వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి) రాష్ట్ర నాయకులు గిరి శ్రీనివాస్, ఆర్కాట్ హేమాద్రి, మురళి, పూజారి, సుధాకర్ బాబు తదితరులు తమ సందేశాలు ఇచ్చారు. గాండ్ల తెలికుల అభివృద్ధి సంక్షేమానికి సమష్టగా కృషి చేస్తూ, గాండ్ల కార్పొరేషన్ కోసం, అలాగే తిరుపతిలో ఏజిటియుపిఎస్ఎస్ భవనం ఏర్పాటుకు అందరి సహాయ సహకారాలతో కార్యరూపంలోకి తీసుకొద్దామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గాండ్ల కుల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విజయలక్ష్మి దుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం కుంకుమ పూజ

న్యూస్ సెప్టెంబర్ 6 కాట్రేనికోన గెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కముజు లక్ష్మీరమణారావు శ్రీమతి లక్ష్మీ శ్రీ బాలా దంపతులి చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

కరిమి రాజేశ్వరరావుకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు ప్రత్యేకంగా హాజరై, శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ప్రధాన నాయకులు పాల్గొని, పార్టీకి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. కొత్త బాధ్యతలతో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.స్థానిక నాయకులు మాట్లాడుతూ — “రాజేశ్వరరావు గారి నియామకం మా ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చింది. ఆయన నాయకత్వం వల్ల పార్టీ శక్తివంతమవుతుంది” అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం 

నరసన్నపేట నియోజకవర్గంలో ఉరుములు–మెరుపులతో భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం మొత్తం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. గంటలకొద్దీ కురిసిన వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యాయి. తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కారణంగా పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడగా, విద్యుత్ సరఫరా కూడా అంతరాయమైంది.అకస్మాత్తుగా పడిన ఉరుములు, మెరుపులు ప్రజల్లో భయాందోళన కలిగించాయి. వర్షపు నీటితో చెరువులు, బావులు నిండిపోవడం తాగునీటి వనరులకు ఊరట కలిగిస్తోందని అధికారులు తెలిపారు.స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

బొల్లా కి కొండి శెట్టి అభినందనలు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గా మాజీ ZPTC సభ్యులు దివంగత నేత బొల్లా మాల్యాద్రి చౌదరి తనయుడు లక్ష్మి నరసాపురం ఎంపీటీసీ సభ్యులు బొల్లా నరసింహ రావు ని నియమించిన సందర్భముగా బీజేపీ కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి కొండి శెట్టి వెంకట రమణయ్య ఆధ్వర్యంలో బీజేపీ బృందం బొల్లా నరసింహ రావు కి శుభాకాంక్షలు తెలియజేసింది. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొప్పరపు సుబ్బారావు, అల్లురయ్య, కొత్తూరు హర గోపాల్, జాజం చిన్న సుబ్బయ్య, మల్లికార్జున లు ఉన్నారు

ఖమ్మం

యూరియా కొరత సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి స్టాఫ రిపోర్టర్ ఖమ్మం జిల్లా) తల్లాడ యూరియా కొరత సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నంబూరి రామలింగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ శ్రీ నంబూరి రామలింగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో రైతులతో సమావేశమై, పొలాలను పరిశీలించారు. ఆయనతో పాటు తల్లాడ మండల మాజీ అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి ఒక్క కట్ట యూరియా కూడా అందని దుస్థితి నెలకొంది. వరి పంటలు ఎదగక గిడసబారిపోతున్నాయి. ఇప్పటికైనా యూరియా ఇవ్వకపోతే మేము పెట్టిన పెట్టుబడే మాకు తిరిగి రాని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేమంతా నష్టపోతున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై స్పందిస్తూ శ్రీ నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ • కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగినంత యూరియా సరఫరా చేసినా, రాష్ట్ర ప్రభుత్వం దానిని రైతులకు అందించకుండా నల్లబజారుకు మళ్లించడం వల్లే ఈ రోజు రైతులు రోడ్లమీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఖమ్మం జిల్లాలో అత్యధిక వరి సాగు జరిగే సత్తుపల్లి నియోజకవర్గం, ముఖ్యంగా 20,000 ఎకరాలకు పైగా వరి పంటలు ఉన్న తల్లాడ మండలంలోనే ఈ విధంగా యూరియా కొరత రావడం, ప్రభుత్వ దుర్వ్యవస్థకు నిదర్శనం. • రైతులను మోసం చేయడమే కాకుండా, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి కేంద్రంపై ఆరోపణలు చేయడం అసభ్యకరమైన రాజకీయ నాటకం తప్ప మరొకటి కాదు. • రైతులను వంచించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, ఇప్పటికైనా తక్షణమే యూరియా సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తరువాత తల్లాడ వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించి, అధికారులను కలసి రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని కోరారు.“ఏ గ్రామానికి వచ్చిందో ఆ గ్రామంలో రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. – “రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే, బీజేపీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపడుతుంది. రైతు భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల మాజీ అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గాదె కృష్ణారావు, మండల ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్, ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు వాడవల్లి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంజనీరింగ్లో ప్రతిభ చూపిన తేజస్విని కి అభినందనలు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన . చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న కాట్రేనికోనకు చెందిన ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి చిన్న కుమార్తె చి. ఆకొండి తేజస్విని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఏక కాలంలో మైనర్ డిగ్రీగా కంప్యూటర్ సైన్స్ లో 8.97 పెర్సంట్ తో టాపర్గా నిలిచి ప్రధమ స్థానం సంపాదించిన సంధర్భంగా బంధు,మిత్రులు మరియు సంస్థ సభ్యులు చిరంజీవికి అభినందనలు తెలియజేసారు.

రంగారెడ్డి

ఇనామ్గూడ చెరువులో ప్రశాంతంగా నిమజ్జనం: అబ్దుల్లాపూర్ మెంట్ సీఐ అశోక్ రెడ్డి

పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెంట్ మండల పరిధిలో ఇనామ్ గూడ చెరువులో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. పోలీసులు, ఇతర శాఖల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిమజ్జనాలను ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు. 3 అడుగుల కంటే ఎక్కువ ఉన్న మొత్తం 303 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.