Thursday, 7 May 2026

Blog

ఖమ్మం

సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం లో ఈ నెల 21 నుండి వచ్చే నెల 4 వరకు దసరా సెలవు లు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. బతుకమ్మ, దసరా నవరాత్రుల నేపథ్యంలో లో మొత్తం 13 రోజుల పాటు సెలవు లు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 5 న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయి అని తెలిపారు.

జోగులాంబ గద్వాల

జోగులాంబ ఆలయం చంద్రగ్రహణం కారణంగా మూసివేత.

అలంపూర్ సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శు|| పౌర్ణమి ఈరోజు తేది:-07.09.2025 ఆదివారము, రాహుగ్రస్త చంద్ర గ్రహణము సందర్భంగా, గ్రహణ వేధను ప్రామాణికముగా తీసుకొని తేది:-07.09.2025 ఆదివారము నాడు శ్రీ జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయములందు ప్రాత: కాలం నిత్య కైంకర్యములు, ఆర్జిత సేవలు, మధ్యాహ్నం గం.12-00లకు మహానివేదన నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 01-00 గంటకు ఆలయము తలుపులు మూసి, భక్తులకు దర్శనములు నిలిపివేయబడును. అనంతరం మరుసటి రోజు అనగా తేది:- 08.09.2025 సోమవారము నాడు ఉదయం ఆలయములు తెరచి ఆలయ శుద్ధి. మహా సంప్రోక్షణ, నివేదన, మహా మంగళ హారతి కార్యక్రమములు నిర్వహించి అనంతరం ఉ॥ గం.8-30ల నుండి దర్శనములు పునః ప్రారంభించబడునని ఆలయ ఈఓ దీప్తి తెలియజేశారు

ఖమ్మం

జావెద్ కి పితృ వియోగం.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి నవతెలంగాణ దిన పత్రిక ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ జావెద్ తండ్రి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు జియాద్దీన్ మృతి చెందారు. వారి యొక్క భౌతిక ఖాయానికి భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మందనపు రామారావ్ నివాళులు అర్పించారు.

ఖమ్మం

బోనకల్ లో పర్యటించి న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేత గల్లా…

ఖమ్మం పున్నమి ప్రతినిధి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ బోనకల్ మండలం లో పర్యటించారు. స్వగ్రామం అయినా రావినూతల లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ని సందర్శించిన గల్లా సత్యనారాయణ ని అక్కడ గ్రామ పెద్దలు సత్కరించారు. అనంతరం OBC మోర్చా బోనకల్ మండల అధ్యక్షులు మరీదు పరశురాం కుమారుడు శివాన్స్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని తెలుసుకొని బోనకల్ మండలంలోని సహచర పార్టీ నాయకులతో కలిసి బోనకల్ లోని పరశురాం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. వీరితో పాటు నాగేశ్వరావ్ర్, పటేల్ లు ఉన్నారు. కార్యకర్తలకి కొద్దిపాటి సమస్య ఉన్న వెంటనే స్పందించే నేత గల్లా సత్య నారాయణ అని ఈ సందర్భముగా కార్యకర్తలు అన్నారు.

తిరుపతి

యువకుడు అదృశ్యం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం లో గల సాయిబాబా టెంపుల్ వెనుక గల ప్రాంతంలో కాపురం ఉంటున్న హుస్సేన్ భాష కుమారుడు షేక్. రఫీ(28)సెప్టెంబర్ 5వ తారీఖు రాత్రి నుంచి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇతను స్థానికంగా వాహనాలు కొని అమ్మడం బిజినెస్ చేస్తూ ఉంటాడని, ఇతని ఆచూకీ తెలిసిన యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్ కి,(9440900008) మరియు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లకి సమాచారం ఇవ్వాలని రెండో పట్టణ సిఐ నాగార్జున రెడ్డి తెలియజేసారు.

ఖమ్మం

ర్యాలీ ని జయప్రదం చేయండి : నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం పున్నమి ప్రతిన 08 09 2025 సోమవారం ఉదయం 10.00గంటలకు జడ్పీ సెంటర్ నుండి కోర్టు వరకు స్థానిక సంస్థల ర్యాలీ కలదని ఈ ర్యాలీకి మాజీ MLA సైది రెడ్డి ముఖ్య అతిధి గా వస్తున్నారు అని రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, స్థానిక సంస్థ ల ఎన్నికల ఖమ్మం జిల్లా కన్వీనర్ ఇవి రమేష్ లు విజ్ఞప్తి చేసారు.

సినిమా

బిగ్బాస్ 9’ లాంచ్ ప్రోమో ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు

సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ‘బిగ్బాస్’ షో మరోసారి సిద్ధమైంది. 9వ సీజన్ ఈరోజు (సెప్టెంబరు 7) రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ షో లాంచ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించింది. ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది ఎంత వైవిధ్యంగా ఉండబోతోందో ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ఆంధ్రప్రదేశ్

మరోసారి ఢిల్లీకి నారా లోకేష్ !

సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. గత వారమే ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీతో దాదాపుగా గంట సేపు చర్చలు జరిపి వచ్చారు. అయితే ఈ సారి ఢిల్లీకి వెళ్లేది కేంద్రమంత్రులతో సమావేశానికి కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంపీలను సమన్వయం చేయడానికి వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. అంతకు ముందు కోయంబత్తూరు వెళ్తారు. అక్కడ ఓ నేషనల్ మీడియా చానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. నారా లోకేష్ జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రజెన్స్ ను.. బలంగా చూపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో కేవలం ఓ పార్టీగానే కాకుండా.. కూటమి బలాన్ని చాటే విషయంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఆకర్షిస్తోంది. నారా లోకేష్ నాయకత్వం వ్యూహాత్మకం, హడావుడి లేకుండా.. ఎంత అవసరమో అంత మేర వ్యూహాలు అమలు చేయడం వారిని అబ్బుర పరుస్తోంది. అందుకే ప్రధానమంత్రి నారా లోకేష్.. టీడీపీకి.. నేషనల్ ఫేస్‌గా నారా లోకేష్‌ను ప్రశంసిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు … నారా లోకేష్ ఆ అంశాన్ని జాతీయ స్థాయి చర్చనీయాంశంగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ మీడియాలో బలమైన వాదనలు వినిపించారు. జాతీయ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తండ్రికి తగ్గ కుమారుడని.. రాజకీయాలను ఆయనదైన శైలిలో బ్యాలెన్స్ చేస్తున్నారన్న ప్రశంసలు ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్నాయి.

విశాఖపట్నం

ఇలా అయితే ఎలా.

గాజువాక డిపో నుండి శ్రీహరిపురం వరుకు ప్రమాదకరంగా మారినా రోడ్డు ప్రయాణం. 5 నెలల ముందు తవ్విన రోడ్డు ఇప్పటికి వేయక పోవడం వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సగం రోడ్డు తవ్వి అలానే వదిలేశారు. గర్బిణి స్త్రీలు రోడుమీద వెళితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. ఈపాటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అసలే వర్షకాలం రోడ్డు ఇలా ఉంటె వాహనాలు ప్రయాణించడం ఎలా. దయచేసి ప్రభుత్వం దీనిని గమనించి రోడ్డు బాగుచేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. రిపోర్టర్; లోకేష్ కుమార్ (బాబీ).

ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం – వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం

సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి@అమరావతి: రాష్ట్రంలో ఆక్వా రంగానికి ప్రత్యేక స్థానం కల్పించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు విభాగం కింద ఇప్పటివరకు విభిన్న జోన్ల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించగా, ఈసారి “ఆక్వా కల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్” అనే కొత్త పదవిని సృష్టించింది. ఈ పదవికి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు శ్రీ వడ్డి రఘురాం నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్టు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఆక్వా రంగం ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్వా ఉత్పత్తుల ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా రొయ్యలు, చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం కీలకపాత్ర పోషిస్తుండగా, ఈ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పెద్ద డిమాండ్ పొందుతున్నాయి. రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఆక్వా సాగులో వ్యయభారం పెరగడం, ఎగుమతుల్లో ఎదురయ్యే సమస్యలు, ఫీడ్ ధరల పెరుగుదల, రోగాలు వంటి సవాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను సమన్వయం చేసి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం, రైతులకు సహాయం చేయడం కోసం ప్రత్యేక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్సీపీ దృష్టి రైతు, కూలీ, మత్స్యకారుల సంక్షేమమే పార్టీ ధ్యేయమని ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఆక్వా రంగానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ముందడుగు వేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ఆక్వా రైతులు మరింత బలోపేతం అవుతారని, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. స్పందన ఆక్వా రైతులు, సంఘాలు ఈ నియామకాన్ని స్వాగతిస్తూ, “రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెంపొందించేందుకు వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మైలురాయి అవుతుంది. వడ్డి రఘురాం నియామకం వల్ల రైతులకు ప్రత్యక్ష సహాయం అందే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.