Thursday, 7 May 2026

Blog

జనగాం

జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఏడునూతుల, పున్నమి ప్రతినిధి: జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ ఘనంగా పూలమాలలు, కిరీటాలు, పూల బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ ప్రసంగించి విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. గురువు జీవనంలో వెలుగు నింపే దీపస్తంభం అని, క్రమశిక్షణ, కష్టపడి చదువుకోవడం, మానవీయ విలువలు పాటించడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హితబోధ చేశారు. తర్వాత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు—నృత్యాలు, పాటలు, ప్రసంగాలు—ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ తగ్గింపు పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం: నల్లా పవన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అనేక రకాలుగా ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం అమలాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 2000 వ సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి జిఎస్టి అమల్లోకి తీసుకు వద్దామని అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేసి ఎట్టకేలకు 2017జూలై 1 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశాన్ని ఏకీకృత భారత దేశంగా చేయాలని ఎన్నో కళలుగన్నారని అందులో ఇది కూడా వర్తిస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల 22 నుంచి అమలు అయ్యేలా వినూత్నంగా ఎక్కువ మొత్తంలో జీఎస్టీ తగ్గించేలా తగ్గింపు చేశారన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు పొందాలంటే చదువుకోవాలని ఉద్దేశంతో వారి చదువుకి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, రబ్బర్లు లాంటి స్టేషనరీ మీద జీరో పర్సెంట్ జీఎస్టీ చేశారన్నారు. ప్రతి వ్యక్తి కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం జరుగుతుందని, వాటి కొనుగోలుపై ప్రతి వాహనంపై 10,000 నుంచి 13,000 వరకు తగ్గించడం జరుగుతుందని, మహిళలు ఇంట్లో వాడే గృహాపకరణాలు అనగా ప్రిడ్జ్, వాషింగ్ మిషన్ లు, మిక్సీలు, గ్రైండర్ ల మీద భారీగా తగ్గించడం జరిగిందని, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన క్యాన్సర్ లాంటి కొన్ని రకాల ప్రాణాంతకమైన జబ్బులకు వాడే మందులు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తగ్గించడం జరిగిందని, కొన్ని మందుల మీద 12 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగిందన్నారు. ఆరోగ్య భీమాకు సంబంధించిన పన్నులు కూడా జీరో కి చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ పనిముట్లు మీద 18 నుంచి 5 శాతానికి పన్ను తగ్గించడం జరిగింది, పాలు, పన్నీరు మీద జీరో పర్సన్ టాక్స్ చేయడం జరిగింది అన్నారు. అలాగే ప్రతీ దాని మీద టాక్స్ తగ్గించి ఆత్మ నిర్భర భారత్ అనే దానిని తీసుకుని భారత్లో తయారైన వస్తువులే మన దేశం వాళ్లే కొనాలనే ఉద్దేశంతోనే తీసుకు రావడం జరిగిందని అన్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రకటన వరకే మాత్రమే పరిమితం కాదని సెప్టెంబర్ 22వ తారీకు నుంచి అమల్లోకి వస్తున్నాయని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారని అన్నారు. సందర్భంగా నిర్మల సీతారామన్ కి, ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫునుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా,పావులూరి వెంకట్,పట్టణ ప్రధాన కార్యదర్శి D V S రాజు ,బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ను సందర్శించిన : చైర్మన్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో మంచి స్థానంలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. శనివారం ( సెప్టెంబర్ 6) ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ను వారి శ్రీమతి గజాల అంజుమ్ అక్తర్ తో కలసి సందర్శించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా పవిత్రహోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభామయంగా అలంకరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఆలయం ఎదురుగా కొలువుదిర్చి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి పవిత్రాలను సమర్పించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు.దేవస్థానం ప్రధాన అర్చకులు,ఆస్థానాచార్యులు,అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

శ్రీకాళహస్తి పట్టణం లోని జయరాం రా వీధి నందు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గమనించి ఆటోను అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.రేషన్ బియ్యం ఎవరిదగ్గర నుండి సేకరించి ఎక్కడకు పంపుతున్నారని ఆరా తీస్తున్నామన్నారు.

తిరుపతి

మురికి కాలువల్లో వ్యర్థాలను తొలగించండి

శ్రీకాళహస్తి పట్టణంలో ని 14 వార్డు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి మురికి నీరు వెళ్ళడానికి వీలు లేకుండా అస్తవ్యస్తముగా ఉన్నది.దీని వలన దోమలు వ్యాప్తి చెందడం వలన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.పక్కనే ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణదారులు చెత్త వేయడం వల్ల దుర్గంధభరితంగా మారి ఇబ్బందిగా వున్నదని మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

అన్నమయ్య

రైల్వేకోడూరు నియోజకవర్గం – అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం – కె.ఎస్. అగ్రహారం గ్రామం

వినాయకుని నిమజ్జన మహోత్సవంలో గ్రామంలో గణనాథుడి ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి నాయకులు, క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారు గణనాథుడి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా గ్రామస్థులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారిని, రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు గారు, కరుణాకర్ రెడ్డి గారు, చిట్వేలి ఎరువుల అంగడి షేక్ కరిముల్లా గారిని ఘనంగా సన్మానించారు. వారికి పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు.గ్రామంలో నిర్వహించిన ఈ గణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవ వాతావరణాన్ని అలరించారు.

హైదరాబాద్

RTO చలాన్ కట్టాలంటూ వాట్సప్‌కు మెస్సెజ్ క్లిక్ చేస్తే అంతే..!

హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 లక్షలు పోగొట్టుకున్నారు.వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ RTO చలాన్ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ.6 లక్షలు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు.తెలియని మొబైల్ నంబర్ల ద్వారా పంపిన ఏ లింక్‌లపై క్లిక్ చేయవద్దని లేదా APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆర్థిక మోసాలను నివారించడానికి తెలియని నంబర్ల నుండి వచ్చిన ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దని. ఇటువంటి యాప్‌లు రహస్యంగా బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఒకసారి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత,ఈ ఫైల్‌లు బాధితుడి మొబైల్ ఫోన్,బ్యాంకింగ్ వివరాలను రహస్యంగా యాక్సెస్ చేస్తాయి.దీని వలన అనధికార లావాదేవీలు.భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది”అని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

గాయత్రి కళాశాలలో ఘనంగా గురుపూజోత్సవం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 5:గురువు బంగారు బాటను చూపే మార్గదర్శి అని గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విద్యార్థులు ఘనంగా నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గురువుల బోధనను అక్షరాలా పాటిస్తేనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, కళాశాల అధ్యాపక బృందాన్ని సన్మానించారు. అనంతరం విద్యార్థులు తమ గురువులను సన్మానించుకున్నారు. పోటీలలో గెలుపొందిన అధ్యాపకులకు ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు.ఈ వేడుకలో మేజర్ వంగ మహేష్, ఐక్యూ.ఏ.సి. డా. మార్తాండ కృష్ణ, సీతారాం నాయుడు, రాజకుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతీ విద్యార్థి ఉపాధ్యాయుడే కావాలి – లయన్ సంయుక్త

గురువే దేశానికి వెన్నుముక అని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడిలా మారాలని గాయత్రి కళాశాలల డైరెక్టర్ లయన్ జి. సంయుక్త అన్నారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవనంలో సద్గుణ జీఈవో ఆర్గనైజేషన్, కెరీర్ ఫెయిర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న సంయుక్త, డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ – “గురువులే విద్యా వ్యవస్థకు మూలస్తంభాలు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను ఆచరిస్తేనే ఉన్నత స్థానాలు సాధించగలరు. ఇంటివద్ద ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులను సత్కరించడం వినూత్న ఆలోచన” అని అన్నారు.కార్యక్రమంలో డా. మంత్రి వెంకటస్వామి, కెరీర్ ఫెయిర్ సాయి బాబా, జై శ్రీరామ్, మణికుమారి, ప్రశాంత్, సీనియర్ అధ్యాపకులు నరేష్, పాలిశెట్టి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి, దుస్తులువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జీఈవో సభ్యులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.