Thursday, 7 May 2026

Blog

E-పేపర్

చేజర్ల మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు

చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో 16 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు. సభాధ్యక్షులు మండల విద్యాశాఖాధికారి శ్రీమతి ఇందిర,ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు తూమాటి విజయ భాస్కర్ రెడ్డి,యం పి డి ఓ అమర్,మాజీ యం.పి.పి రావి పెంచలరెడ్డి,బాలిరెడ్డి రమాదేవి,లక్ష్మీ నరసారెడ్డి, వీర రాఘవరెడ్డి,డి.సి మస్తానయ్య,సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం

బై ..బై.. గణేష.. ఖమ్మం నగరం లో ప్రశాంత వాతావరణం లో జరిగిన నిమజ్జన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతినిధి గత 10రోజులు గా పూజలు అందుకున్న గణ నాధులు శనివారం నాడు నిమజ్జనం కి తరలి వెళ్లారు. ఖమ్మం నగరం లో సుమారు గా 100కి పైగా గణ నాదులు కొలువై 10రోజు లు పూజలు అందుకున్నారు. గాంధీ చౌక్ నందు ఏర్పాటు చేసిన సామూహిక గణ నాధుల కి స్వాగత వేదిక మొత్తం ఖమ్మం నగరం నుండి మున్నేరు లో నిమజ్జనం అవ్వడానికి తరలి వచ్చే గణ నాధులకి స్వాగతము పలికారు. మంత్రి తుమ్మల నాగేస్వరావ్, స్థంబాద్రి గణేష్ ఉత్సవ సమితి బాద్యులు స్వాగత కార్యక్రమం లో పాల్గొన్నారు. కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ఏర్పాట్లు చేశారూ.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్త్రీ శక్తి విజయోత్సవ సభకు తరలిన మహిళలు

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతమైన సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం లోని వింజమూరు మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుండి ఎస్వి కన్వెన్షన్ హాల్ వరకు నిర్వహించే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయోత్సవ ర్యాలీ, సభకు సీతారామపురం మండలం నుండి ప్రత్యేక బస్సుల్లో భారీగా మహిళలు తరలి వెళ్లారు. ర్యాలీ కోసం తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సులను మాజీ జెడ్పిటిసి కలివెల జ్యోతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నేలటూరి జాషువా, గాజులపల్లి చంద్ర రెడ్డి, ఇజ్రాయిల్, మండల తెలుగు యువత నాయకుడు పసుపులేటి వికాస్ బాబు (విక్కీ), దేవర వెంకటేశ్వర్లు, కాశిపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

శ్రీరామ్ నగర్ కాలిని గల్లి గణేష్ నిమర్జనం

*శ్రీరామ్ నగర్ కాలనీలో నిన్న గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది* వేద న్యూస్, శేరిలింగంపల్లి. గల్లి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలు పులి సమ్మయ్య 201000రెండు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది అలాగే చిన్న లడ్డును గణేష్ ఫోటో స్టూడియో అధినేత గణేష్ యాదవ్80116 80 వేల 116 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో కాలనీలో పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇట్లు గల్లీ గణేష్ ఉత్సవ కమిటీ బలరామ్ యాదవ్

తిరుపతి

మానవ జీవనసరళిని మార్చేదే భగవద్గీత

మానవ జీవన సరళని మార్చేది భగవద్గీత ఒకటేనని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు శనివారం ఆయన శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈఓ మోహన్ కి భగవద్గీత మకరందాన్ని అందజేశారు ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ నా దేశం ఒక భవద్గీత,నా దేశం అగ్నిపునీత సీత,నా దేశం కరుణతరంగా నా దేశం సంస్కార గంగా అని సినారె పలుకులు అమృత సత్యం అని.ప్రతి ఒక్కరికి భగవద్గీత మార్గం చూపించి సత్ప్రవర్తనతో నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.మానసిక ప్రశాంతతతో మనిషి జీవనము కొనసాగాలంటే భగవద్గీత చదవటం వినడం ఒక్కటే సరైన మార్గమని తెలిపారు. భగవద్గీత చదవాలని కోరిక ఉన్నవారు నన్ను సంప్రదిస్తే వారికి ఉచితంగా భగవద్గీత మకరందాన్ని అందచేస్తానని తెలియజేశారు.

హైదరాబాద్

జనంలోకి సడన్ ఎంట్రీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు ఆకస్మికంగా సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుని నేరుగా కార్యక్రమాన్ని సందర్శించారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని, లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయనను చూసిన ప్రజలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అనేక మంది ఫోటోలు, వీడియోలు తీసేందుకు ముందుకు వచ్చారు. సీఎం ఆకస్మికంగా వచ్చిన ఘటనతో నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఉత్సాహం చేకూరింది.

E-పేపర్

28న BCCI సమావేశం – ప్రెసిడెంట్ ఎన్నికపై కీలక చర్చ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రెసిడెంట్ పదవి ఖాళీగా ఉండటంతో, కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఈనెల 28న బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల ప్రెసిడెంట్‌గా ఉన్న రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేయడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం సమావేశంలో చర్చించనున్నారు. అధ్యక్ష పదవితో పాటు ఇతర ముఖ్యమైన కార్యవర్గ పదవుల భర్తీపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ పదవికి ఎవరు పోటీ పడతారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. క్రికెట్ వర్గాల్లో దీనిపై విస్తృతంగా ఆసక్తి నెలకొంది. అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. భారత్ ఫైనల్‌కు చేరితే, బీసీసీఐ నుండి ఎవరూ సమావేశానికి హాజరయ్యే అవకాశం తక్కువగా ఉండొచ్చని సమాచారం. ఈ సమావేశం భారత క్రికెట్ భవిష్యత్‌పై ప్రభావం చూపే కీలక సమావేశంగా పరిగణించబడుతోంది

ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చింతు వాసుదేవరావు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండివిల్లిపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న కరవంజ గ్రామానికి చెందిన చింతు వాసుదేవరావు గారు 2025 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఘనమైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.వాసుదేవరావు గారు విద్యార్థులలో పఠన పట్ల ఆసక్తి పెంపొందించడం, సృజనాత్మకతను వెలికితీయడం, పాఠశాలలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విశేష కృషిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా వాసుదేవరావు గారు మాట్లాడుతూ – “విద్యార్థుల విజయం నా విజయమని ఎల్లప్పుడూ నమ్ముతాను. ఈ గుర్తింపు మరింత కృషి చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది” అని తెలిపారు.గ్రామ ప్రజలు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు: మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు

నెల్లూరులో సంచలనం కలిగించిన ఘటనలో, మూడు పెళ్లిళ్లు చేసుకున్న IFS ఆఫీసర్ బుడిగి శ్రీనివాసులు రెడ్డిపై ఓ మహిళ దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రేణుక అనే మహిళ తనను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. ప్రస్తుతం కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ, మరో పెళ్లికి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని దిశా పోలీసులను రేణుక కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు సమాచారం.

తెలంగాణ

గ్రామ పాలనాధికారులు పూర్తి శ్రద్ధలతో విధులు నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శనివారం(సెప్టెంబర్ 6) ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సిలింగ్ జరుగుతుందని ఎలాంటి సిఫారసులు, పక్షపాతం లేవని స్పష్టం చేశారు. అభ్యర్థుల సమక్షంలో ఖాళీల జాబితా ప్రదర్శించి ఐఛ్చికాల మేరకు పోస్టింగ్ లు కేటాయిస్తున్నామన్నారు. సోమవారం నాటికి నూటికి నూరు శాతం విధుల్లో చేరాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నందున గ్రామపాలన అధికారులు, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.