Thursday, 7 May 2026

Blog

హైదరాబాద్

35 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు

పున్నమి ప్రతినిది హైదరాబాద్లిం బాలాపూర్ గణేష్ లడ్డు లింగాల దసరద్ 35 లక్షలకి కైవసం చేసుకున్నారు. గత ఏడాది కన్నా ఎక్కువ ధర కి పోయినట్లు గా నిర్వాహకులు తెలిపారు

ఆంధ్రప్రదేశ్

మంచి ఆరోగ్యం

శారీరక ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది – పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది – నిత్య వ్యాయామం (నడక, సైక్లింగ్, యోగా) రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది – సక్రమమైన ఆహారం, వ్యాయామం వల్ల ఊబకాయం తగ్గుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది – ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. జబ్బుల ప్రమాదం తగ్గుతుంది – నిత్యం వ్యాయామం, మంచి ఆహారం మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి సమస్యలను నివారిస్తాయి. 🧠 మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఒత్తిడి తగ్గుతుంది – ధ్యానం, లోతైన శ్వాస, రిలాక్సేషన్ టెక్నిక్స్ మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది – క్రమబద్ధమైన నిద్ర, పుస్తకాలు చదవడం, పజిల్స్ వంటివి మెదడు శక్తిని పెంచుతాయి. భావోద్వేగ స్థిరత్వం – ఒక సరైన రొటీన్ ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ తగ్గుతాయి. 🏃 జీవనశైలి ప్రయోజనాలు ఉత్పాదకత పెరుగుతుంది – రోజువారీ పథకం ఉండడం వల్ల సమయం వృథా కాకుండా పని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సంబంధాలు బలపడతాయి – కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మాట్లాడటం, నడక వంటి అలవాట్లు బంధాలను బలపరుస్తాయి. శక్తి స్థాయి మెరుగవుతుంది – సరైన నీరు, పోషకాహారం, విశ్రాంతి వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆయుష్షు పెరుగుతుంది – ఆరోగ్యకరమైన అలవాట్లు దీర్ఘాయుష్షుని, జబ్బులేని జీవితాన్ని ఇస్తాయి.

క్రైమ్

మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితె మీ జిల్లాలోని ఏసీబీ కి కంప్లైంట్ చేయవచ్చు . జిల్లాల వారీగా వివరాలు

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితె మీ జిల్లాలోని ఏసీబీ కి కంప్లైంట్ చేయవచ్చు . జిల్లాల వారీగా వివరాలు ఈ విషయంలో బ్యూరో ఈ క్రింది వాటిని ఉపయోగించి సమాచారం ఇవ్వవచ్చని అభ్యర్థిస్తోంది: 1. టోల్ ఫ్రీగా నెంబర్ “1064” 2. వాట్సాప్ :.8333995858 3. ఇమెయిల్: dg_acb@ap.gov.in డిస్ట్రిక్ట్ వైస్ కాంటాక్ట్స్ కర్నూల్ Dy.Supdt. of Police, Anti-Corruption Bureau, Kurnool range, 43/120, Narsing Rao pet, Kurnool Phone : 08518 – 273783 Cell : 9440446178 Email : dg_acb@ap.gov.in అనంతపూర్ Dy.Supdt. of Police {FAC}, Anti-Corruption Bureau Anantapur Range 28/414, Srisadan, Sangamesh Nagar Anantapur Phone : 08554 -274170 Cell : 9440446181 Email : dg_acb@ap.gov.in నెల్లూరు Dy.Supdt. of Police, Anti-Corruption Bureau, Nellore Range 24-11-890, Door No.24/II/727, Konda Balaram Reddy Street, Rajagopal Puram, Dargamitta, Nellore. Phone : 0861 -2331833 Cell : 9440446184 Email : dg_acb@ap.gov.in ఒంగోలు Dy.Supdt. of Police , Anti-Corruption Bureau H.No.A12, CRP Qrs. Ongole Phone : 08592 -232300 Cell : 9440446189 Email : dg_acb@ap.gov.in తిరుపతి Dy.Supdt. of Police, Anti-Corruption Bureau Tirupati Range 19-14-13, Raghaverndra Nagar, Ist Lane, Kesavayana Gunta, Tirupati Phone : 08772 – 220252 Cell : 9440446190 Email : dg_acb@ap.gov.in కడప Dy.Supdt. of Police, Anti-Corruption Bureau H.No.1/311, Maruthinagar Cuddapah Phone : 08562 – 244637 Cell : 940446191 Email : dg_acb@ap.gov.in ఈస్ట్ గోదావరి Dy.Supdt. of Police, Anti-Corruption Bureau Rajahmundry Range 86-26-12, V.L.Puram, Tilak Road, Rajahmundry Phone : 0883 – 2467833 Cell : 9440446160 Email : dg_acb@ap.gov.in కాకినాడ Dy.Supdt. of Police, Anti-Corruption Bureau Nagamalli Thota Junction, 5 Buildings Centre KAKINADA Phone : 0884 – 2342785 Cell : 9440446161 Email : dg_acb@ap.gov.in ఏలూరు, వెస్ట్ గోదావరి Dy.Supdt. of Police , Anti-Corruption Bureau Eluru Range, St.Xavier Nagar, Near Boys Convent, Opp. Working Women’s Hostel, ELURU Phone : 0881 – 2232017 Cell : 9440446157 Email : dg_acb@ap.gov.in కృష్ణ Dy.Supdt. of Police {FAC}, Anti-Corruption Bureau Vijayawada Range, 60-6-15/1, Siddarthanagar, 3rd lane, Pinnamaneni Polyclinic Road, Vijayawada Phone : 0866 – 2474140 Cell : 9440446164 Email : dg_acb@ap.gov.in గుంటూరు Dy.Supdt. of of Police , Anti-Corruption Bureau Chandramouli Nagar, 1st lane, 4-4-84/1, Guntur Phone : 0863 – 2225850 Cell : 9491305638 Email : dg_acb@ap.gov.in విశాఖపట్నం Dy.Supdt. of Police, Anti-Corruption Bureau Visakhapatnam Range Plot No.25, Doctors Colony, Seethammadhara, Visakhapatnam Phone : 0891 – 2552894 Cell : 9440446170 Email : dg_acb@ap.gov.in విజనగరం, Dy.Supdt. of Police, Anti-Corruption Bureau VIZIANAGARAM RANGE Kusuma Gajapathi Nagar Near Ashok Gajapathi bangalow Vizianagaram Phone : 08922 – 276404 Cell : 9440446174 Email : dg_acb@ap.gov.in శ్రీకాకుళం Dy.Supdt. of Police, Anti-Corruption Bureau Qr.No.A-11, Official Colony , Srikakulam Phone : 08942 – 222754 Cell : 9440446124 Email : dg_acb@ap.gov.in

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముత్తుకూరు గేట్ ప్రాంతంలో ఇసుక రవాణాపై శ్రద్ధ అవసరం

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముత్తుకూరు గేట్ సమీపంలో ఇసుక రవాణా టిప్పర్లు నిర్దిష్ట సమయాల్లో అనుమతి లేకపోయినా నిర్బంధం లేకుండా వెళుతున్నాయి. ఈ టిప్పర్లలో ఇసుకను సక్రమంగా కప్పకుండా తరలించడంతో గాలికి ఇసుక ఎగిరి వెనక వచ్చే ద్విచక్ర వాహన దారుల కళ్లలో పడుతూ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిరోజూ ఈ పరిస్థితి కారణంగా రోడ్లపై చిన్నపాటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. రవాణా వాహనాల పైన సరైన కవర్లు వేసి రవాణా చేయాల్సిన నియమాలను పాటించకపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత పెరుగుతోంది. ప్రజల భద్రతను కాపాడే దిశగా తక్షణమే కఠిన చర్యలు తీసుకొని, నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

యూపీ లో తవ్వకాలలో బయటపడ్డ 100 ఏళ్ల నాటి ట్రాక్టర్

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి జి ప్రతాప్@ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు. బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు. వాటిలో ఇదీ ఒకటి. ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రారంభమైన శోభాయాత్రలో భక్తుల సందడి వెల్లివిరిసింది. భారీ బందోబస్తు నడుమ గణనాథుడి మహా విగ్రహం భక్తుల హర్షధ్వానాల మధ్య ప్రస్థానం కొనసాగిస్తోంది. ప్రస్తుతం విగ్రహం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. అక్కడ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రోచ్ఛరణలతో ఆరాధన చేశారు. కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకోనుంది. ఈ మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించేందుకు తరలివస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు శోభాయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హుస్సేన్ సాగర్లో క్రేన్ నం.4 వద్ద మహాగణపతిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయనున్నారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఉత్సాహభరితంగా పాల్గొంటున్న భక్తులు ఈ మహోత్సవాన్ని మరింత వైభవోపేతంగా మలుస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

మహిళల హాకీ టోర్నీలో భారత్ భారీ విజయం.

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్లో థాయ్లాండ్పై 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. ప్రపంచ కప్ బెర్త్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ తరఫున ముంతాజ్ ఖాన్, ఉదిత, బ్యూటీ డుంగుంగ్ రెండేసి గోల్స్ చేశారు. నేడు జరిగే మ్యాచ్లో జపాన్తో భారత్; థాయ్లాండ్తో సింగపూర్ తలపడతాయి.

ఆంధ్రప్రదేశ్

ఫేక్ న్యూస్ టార్గెట్‌లను భలే ఫిక్స్ చేస్తున్నారుగా

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం చేయడానికి తొందరపడుతున్న వారిని అదే ట్రాప్ లోకి లాగి .. కఠిన చర్యలు తసుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.ముందుగా ఓ వార్తను మీడియా ప్రతినిధులకు లీక్ చేస్తున్నారు. అయితే చెప్పాల్సినంత వరకే చెబుతున్నారు. మిగతాది ఫేక్ న్యూస్ హ్యాండిల్స్ ఊహించుకునేలా టెంప్ట్ చేస్తున్నారు. దాంతో వారు రెచ్చిపోతున్నారు. కానీ వెంటనే ఆ పోస్టులను రికార్డు చేసి.. ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఇదిగో మీరు చర్యలు తీసుకోదగ్గ నేరం చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా ఓ హెలికాఫ్టర్ అద్దెకు తీసుకుంది. పాత హెలికాఫ్టర్ స్థానంలో కొత్త హెలికాఫ్టర్ అద్దెకు తీసుకుంది. ప్రత్యేక విమానాల అవసరం లేకుండా అందులో రాష్ట్రమంతా పర్యటించవచ్చు. అయితే వెంటనే ప్రభుత్వంపై బురదచల్లాలనుకునే హ్యాండిల్స్.. ఏపీ ప్రభుత్వం హెలికాఫ్టర్ కొనేసిందని ఇష్టం వచ్చినట్లుగా రాసేశారు. అలాంటి హ్యాండిల్స్ అన్నింటినీ నమోదు చేసుకున్నారు. ఇలా ఇటీవల పలు అంశాల్లో ప్రభుత్వం ఇస్తున్న సమచారాన్ని వక్రీకరించడం, ఎక్కడో జరిగిన వాటిని ఏపీలో జరిగినట్లుగా చూపించడం వంటి ఫేక్ న్యూస్ పై ప్రభుత్వ వర్గాలు విరివిగా స్పందిస్తున్నాయి. చంద్రబాబు కూడా ఈ అంశంలో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరిని కాకుండా.. ఇలా ఎక్కువగా ఫేక్ చేస్తున్న వారందర్నీ ఒకే సారి టార్గెట్ చేసేందుకు వ్యూహాత్మకంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కొన్ని హ్యాండిల్స్ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలన్నీ బయటకు తీసి..కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. చట్టం కూడా తీసుకు వచ్చే అవకాశం ఉన్నందున ఉద్దేశపూర్వకంగా ఫేక్ చేసేవారికి అసలైన సినిమా ముందు ఉందని..దానికి తగ్గ ట్రాప్ రెడీ చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

క్రైమ్

రాజధానిలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ప్రతాప్ నగర్ నివాసి మిత్తర్ సింగ్ కుమారుడు సుధీర్ అలియాస్ బంటీ, అలాగే బ్రహ్మపాల్ కుమారుడు రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే GTB ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

*ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో శ్రీ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించింది. ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారు బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి, విద్య, ఉపాధి, ఆర్థిక సాయ పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో, యువతకు అవగాహన కల్పించడంలో ఆయన చురుకైన పాత్ర పోషించనున్నారు. ఈ నియామకం పట్ల బ్రాహ్మణ సమాజ పెద్దలు, సంఘ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో సమాజ శ్రేయస్సు కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.