Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అరకు కాఫీ తోటల్లో కాఫీ గింజలకు సోకిన వైరస్ పై గిరిజన శాఖ మంత్రి & జిల్లా కలెక్టర్ పరిశీలన

సీతారామరాజు జిల్లా, అరకు వేలి మండలం, చినలబుడు పంచాయతీ, పకనకుడి గ్రామం అరకు కాఫీ తోటల్లో కాఫీ గింజలకు సోకిన వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, జిల్లా కలెక్టర్ గారు చినలబుడు పంచాయతీలోని పకనకుడి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మొస్య ప్రేమ్ కుమార్, స్వామి జగన్ గారు కాఫీ రైతుల తరపున సమస్యలను వివరించారు. ప్రధానంగా వారు వినిపించిన సమస్యలు: 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఇతర వ్యక్తులు, మల్టీనేషనల్ కంపెనీలు, దళారీలు, సంస్థలు ఆదివాసీ భూములు, ఆస్తులు, వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. సమతా జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే వైరస్ వంటి సమస్యలు పెరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీ పంటను ఉపయోగించి, మండల కేంద్రాల్లో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాఫీ మార్కెటింగ్‌లో ఆదివాసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జిసిసి, ఐటిడిఏ ద్వారా స్థానిక యువతకు అనుమతులు ఇచ్చి, కాఫీ హౌసులు, కాఫీ మ్యూజియంలు, కాఫీ షాపులు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వైరస్ కారణంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కేజీకి రూ.50 నష్టపరిహారం సరిపోదని, దీనిని పెంచి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అనధికారికంగా కాఫీ కొనుగోలు చేస్తున్న దళారీలు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ లేకుండా, లైసెన్సులు లేకుండా, అనుమతులు లేకుండా కాఫీని కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలన్నారు. వైరస్ నివారణ చర్యలను వేగవంతం చేసి, దీనికి కారణమైన కుట్రలను వెలుగులోకి తెచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, కాఫీ రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున నాయకులు, అధికారులు, స్థానిక కాఫీ రైతులు, గ్రామస్తులు హాజరయ్యారు.

తిరుపతి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్న కుమార్ కు సన్మానం

శ్రీకాళహస్తి నియోజకర్గం ఏర్పేడు మండలం లోని రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు రత్న కుమార్ ను సర్పంచ్ చెంగల్ రాజు,జడ్పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలసరస్వతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం బాలసరస్వతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల్లోని 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో రత్న కుమార్ వుండటం సంతోషంగా ఉందన్నారు.తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మ సార్ధకతకు గురు జ్ఞానాన్ని ఇస్తాడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీసీ వెల్ఫేర్ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల..! హాస్టల్లో స్థితిగతుల గురించి సమీక్ష../////

వింజమూరు సెప్టెంబర్ 6 :(పున్నమి న్యూస్ ):/// వింజమూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు బీసీ వెల్ఫేర్ హాస్టల్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ కమిటీ అధికారుల తో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం లోగల బీసీ హాస్టల్ ల స్థితిగతుల గురించి, విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందుతున్న సదుపాయాల గురించి, మెరుగైన విద్య, భోజన మరియు వసతి సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వింజమూరు బీసీ వెల్ఫేర్ హాస్టల్ నందు చదువుతున్న మన ప్రాంత విద్యార్థులు పదవ తరగతి నందు 600 మార్కులకు గాను 584 మార్కులను సాధించి జిల్లాలోనే మొదటి ర్యాంకును, ఇంటర్మీడియట్ నందు 1000 మార్కులకు గాను 962 మార్కులను సాధించి జిల్లాలోనే రెండవ ర్యాంకును సాధించారని అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేశారు.

విశాఖపట్నం

కొట్టి లింగాల గణేశుడు.

కొట్టి లింగాల గణేశుడు. వైజాగ్, గాజువాక డిపో సమీపంలో మొత్త మొదటిసారిగా దాదాపు ఒక కొట్టి శివలింగాలతో గణపతిని తయారు చేసి గాజువాక డిపో రోడ్డుకి సమీపంలో ఉన్న గ్రౌండ్లో పెట్టారు. వినాయకుడిని చూడటానికి భారీగా తరిలి వస్తున్న జనం. నెట్టితో 11రోజులు పూర్తి చేసి రికార్డు సృష్టించిన వినాయకుడు.6సెప్టెంబర్ నిమజినం కన్నున వినాయకుడిని చూడడానికి భారీగా వచ్చిన భక్తులని అదుపు చేస్తున్న పోలీసులు. రిపోర్టర్; లోకేష్ కుమార్ (బాబీ).

కర్నూలు

కుంకనూర్ ZP హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక తరగతులు

దేవనకొండ, సెప్టెంబర్ 6(పున్నమి రచయిత): దేవనకొండ మండలం కుంకనూర్ గ్రామంలోని ZP హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రేరణాత్మక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ అయిన మహేంద్ర కోటకొండ గారు, K.K. ధామోదర్ రావు గారు విద్యార్థులకు సమయ నిర్వహణ, లక్ష్య సాధన తద్వారా. విజయ సాధన ల వంటి అంశాలపై సూచనలు అందించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలువైన మార్గదర్శకాన్ని స్వీకరించారు. తరగతుల అనంతరం ఉపాధ్యాయులు మోటివేషనల్ స్పీకర్స్ ను ఘనంగా సన్మానించారు. ఇలాంటి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు ఉన్నత స్థాయి మార్గదర్శనం ఉచితంగా అందించాలనే లక్ష్యంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వెళ్తుందని రీజియన్ ప్రెసిడెంట్ మహేంద్ర కోటకొండ గారు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీల ధర్నా

శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతదేశం పై అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న సుంకాలు,వ్యాపారస్తులు పైన పన్నులకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో పెళ్లి మండపం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తిరవి సిపిఎం పట్టణ కార్యదర్శి గంధం మణి (ఏఐటియుసి) నియోజకవర్గ కార్యదర్శి తొండు మల్లికార్జున్ సిపిఎం నాయకులు రాపూర్ సుబ్రహ్మణ్యం ప్రజానాట్యమండలి కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

అత్తి పండు తినడం వల్ల లాభాలు

అత్తి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉండి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యానికి కూడా ఇది మంచిదిగా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది. అత్తి పండులో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఉపయుక్తంగా ఉంటాయి. అదనంగా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రోజూ రెండు అత్తి పండ్లు తినడం శక్తిని పెంచి, అలసటను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా డాక్టర్ సలహాతో తినవచ్చు. సహజంగా తీపిగా ఉండటం వల్ల ఇతర తీపి పదార్థాల కంటే ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. సరైన మోతాదులో అత్తి పండు తినడం ద్వారా శరీరం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతో ఉపయుక్తమైన పండుగా భావించబడుతుంది.

హెల్త్ టిప్స్

ఆపిల్ తినడం వల్ల లాభాలు

ఆపిల్ ఒక ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పండు. ఇది శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. రోజూ ఆపిల్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఆపిల్ తినడం ద్వారా శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. హృదయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా, ఇందులో ఉండే సహజ చక్కెర శక్తిని అందించి అలసటను తగ్గిస్తుంది. ఆపిల్ లో విటమిన్ C, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. అదనంగా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఆపిల్ తినడం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజూ ఒక ఆపిల్ తినడం మంచి అలవాటు. ఇది తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఉత్తమ పండు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఈ నెల 8న మెగా జాబ్ మేళ

నెల్లూరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 8వ తేదీన మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరపురం ఐటీఐ బాయ్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో మొత్తం 15 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహించి, అర్హత గల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కోరారు.

జోగులాంబ గద్వాల

ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు.

అలంపూర్ : ఆగస్టు 05 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలోని.. ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం హెచ్ డబ్ల్యు ఓ గోపాల్ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల బాలుర వసతి వార్డెన్ రాంగోపాల్ మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతను ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త అని తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి ఎంతగానో సేవ చేస్తారని, విద్యార్థుల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాశపోగు బాబు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.