Wednesday, 6 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇంచార్జి ల ప్రకటన

బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు PVN. మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇంచార్జిలను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ) : శ్రీ మట్టా ప్రసాద్ గోదావరి జోన్ (కాకినాడ, డా. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు ) : శ్రీమతి లక్ష్మీప్రసన్న కోస్తాంధ్ర జోన్ (ఎన్టీఆర్ , గుంటూరు,పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు ) : శ్రీ నాగోతు రమేష్ నాయుడు రాయలసీమ జోన్ (చిత్తూరు, అన్నమయ్య, కడప,సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల) : శ్రీ ఎన్ దయాకర్ రెడ్డి లని ఇంచార్జి లుగా ప్రకటించారు.

ఖమ్మం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గా బండారు విజయలక్ష్మి..!

పున్నమి ప్రతి నిధి మాగంటి బాబు మరణం తో వచ్చిన జూబ్లీహిల్స్ శాసన సభ స్థానం యొక్క ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ జూబ్లీహిల్స్ శాసన సభ స్థానం కైవసం చేసుకోవాలానే ప్రయత్నం లో తెలంగాణ బీజేపీ ఉన్నది. అందుకు సం బందించి బీజేపీ సీనియర్ నేత గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు ని కేంద్ర బీజేపీ పరిశీలస్తుంది. ఇందుకు సంబందించి ప్రకటన ఒకటి రెండు రోజుల్లో విలువడే అవకాశం ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర వర్గాల సమాచారం

తిరుపతి

అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరణ

శ్రీకాళహస్తిలో 9వ తేదీన పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో కలసి అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై 9వ తేదీన అన్నదాత పోరు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు వైయస్సార్సీ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి అన్నదాత పోరు కార్యక్రమం యొక్క పోస్టర్ను ఆవిష్కరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అన్నదాత పోరు ను విజయవంతం చేయండి

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు నిరసనగా ఈనెల 9 వ తేదీన అన్ని కలెక్టరేట్ లు, ఆర్డిఓ కేంద్రాల వద్ద వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీతారామపురం మండల వైసీపీ సీనియర్ నాయకుడు పిసి. అల్లూరు రాజు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు లు పేర్కొన్నారు. ఆదివారం సీతారామపురంలో అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ల పిలుపుమేరకు సీతారామపురం మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీల కతీతంగా రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, సరస్వతి నారాయణ రాజు, పిడుగు నవీన్, పాలగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కోలాహలంగా కోలా ఆనంద్ అభినందన సభ

భారతీయ జనతా పార్టీ ర్రాష్ట్ర ఉపాధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించిన కోలా ఆనంద్ కు శ్రీకాళహస్తి కూటమి నాయకులు పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అన్న అంటే నేనున్నా అంటూ పలికే ఒకే ఒక్క నాయకుడు,మనసున్న మారాజు కోలా ఆనంద్ అని కొనియాడారు.కోలా ఆనంద్ మాట్లాడుతూ ఈ బాధ్యత నాకు ఇచ్చి అవకాశం కల్పించి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్,సంఘటన మంత్రి మధుకర్ కి మరియు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కి ,కేంద్ర రాష్ట్ర పెద్దలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

నాగర్‌కర్నూల్

సభావత్ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మర తండా గ్రామ పంచాయతీ లో BRS పార్టీ సీనియర్ నాయకులు సభావత్ ఆంజనేయులు గత 4 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు,వారి వెంట పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశాలు ఇందిరమ్మ అధ్యక్షతన జరిగాయి ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయడానికి సిపిఐ శ్రేణులు ప్రజా సంఘాలు సిద్ధం కావాలని ఆయన అన్నారు అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని వాటిని సరి చేయకపోతే సిపిఐ పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గ లో త్వరలోనే అన్ని మండల కేంద్రాలను సిపిఐ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒకవైపు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కమ్యూనిస్టులు ముందుంటారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదేపదే చెప్తున్న దానికి భిన్నంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని కమ్యూనిస్టులు ఎన్నికల అప్పుడు మాత్రమే అవసరం తర్వాత వారి అవసరం లేదనే విధంగా గౌరవ మంత్రివర్యులు ప్రవర్తిస్తున్న తీరు సరైనది కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందాలని లేకపోతే విడతలవారీగా ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేయడానికి వెనకడుగు వేసేది లేదని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, విజయుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణాజి, మర్యాద వెంకటయ్య, శంకర్ గౌడ్, బిజ్జా శ్రీను, బండి లక్ష్మీపతి, శివశంకర్, రవీందర్, తుమ్మల శివుడు, మల్లేష్, పరశురాములు, గడ్డం శ్రీను, గోపాల్, మధు గౌడ్, నరేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి నైజాంని ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు జరిగిన అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని బీజేపీ పోరాటంలో మేమున్నామంటూ వక్ర భాష్యాలు చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని కానీ బిజెపి మాత్రం హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని తప్పుడు సంకేతాలు పంపిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు.. ఒకరు విద్రోహం అని ఒకరు విమోచన అని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.. నిజంగా తెలంగాణ సాయుధ పోరాటం విలీనం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా వక్ర భాష్యాలు చెబుతున్న బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు దేశ్య నాయక్ ఆంజనేయులు బి ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు నరసింహ పొదిల రామయ్య శంకర్ నాయక్ కొంపల్లి అశోక్ దశరథం తారా సింగ్ నాగరాజు నాయకులు మధు కురుమయ్య మల్లికార్జున్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

చిట్వేలి మండలంలో రెండు విషాదాలు: మహిళా అనుమానాస్పద మృతి, మరోకరు ప్రమాదంలో దుర్మరణం

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం రెండు విషాద ఘటనలకు వేదికైంది. నేతివారిపల్లె ఎస్‌.టి. ఎరుకుల కాలనీలో దాసరి ప్రశాంతి (25) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతిచెందింది. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆమె సుమారు తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రాజేష్‌ను వివాహం చేసుకుంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి దాసరి రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో ఘటనలో కె.కె. వడ్డేపల్లికి చెందిన రాయన శాంతమ్మ (34) కూలీ పనుల నుండి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఎగువపల్లిలో పని ముగించుకొని ట్రాక్టర్‌లో వస్తుండగా, డ్రైవర్ మల్లేశ్వరయ్య నిర్లక్ష్యంగా నడపడంతో కందులవారిపల్లె వద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర శాంతమ్మ పడిపోవడంతో ట్రాక్టర్ కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త మాల్దీవుల్లో పనిచేస్తున్నాడని, ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు ఘటనలపై చిట్వేలి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య

సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం – భారత్‌లో నాలుగు నగరాల్లో క్లియర్ వ్యూ

2025 సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సుమారు 82 నిమిషాలు కొనసాగే ఈ గ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం ప్రజలు వీక్షించగలరని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో ఇది స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో మాత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో క్లియర్ వ్యూ లభిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్లని పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 వరకు సంపూర్ణంగా కనిపించి, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత స్పష్టమైన చంద్రగ్రహణాల్లో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.