Wednesday, 6 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి డిపో నుండి బస్సులు పెంచండి

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు.శ్రీకాళహస్తి బస్సు డిపో వివిధ ప్రాంతాలకి బస్సు సర్వీసులు పెంచాలని టీడీపీ నాయకులు టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ డీవీ నారాయణ,శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్, వాకచర్ల గురప్ప శెట్టి లు మంగళవారం శ్రీకాళహస్తి డిపో మేనేజర్ చంద్రయ్య ని కలిసి లేఖను ఆయనకి అందించారు. వారు మాట్లాడుతూ చెన్నై నుండి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని మధ్యాహ్నం మూడు తరువాత తమిళనాడు డిపోకి బస్సులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే,విజయవాడ, నెల్లూరు,నాయుడుపేట ప్రాంతాలకు గతంలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిచేవని ఇప్పుడు మరల వాటి పునరుద్ధరించాలని డిపో మేనేజర్ ని కోరారు.

ఆంధ్రప్రదేశ్

వై.ఎస్ ఆర్.సి.పి ఆధ్వర్యంలో ఎరువుల కోసం అన్నదాత పోరు

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 9) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో రైతులకు జరుగుతున్న అన్యాయం లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న దగా కోరు మాటలు యూరియా వాడితే జైల్లో పెడతాను అంటున్న చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్సిపి పార్టీ కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత కొవ్వూరు మెరకవేది నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ఆర్టీవోకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది

సినిమా

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆత్మ + ఆత్మ వర్సెస్ చిత్రగుప్త

దాడి జనార్దన్ రావు, డాక్టర్ పీర్ కుమార్, వెంకట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆత్మ + ఆత్మ వర్సెస్ చిత్రగుప్త శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. రెండు ఆత్మలు ఒక శరీరంతో చిత్రగుప్తుని సహాయంతో ఏవిధంగా తమ తీరని కోరికలను తీర్చుకుంటాయో దర్శకులు జనార్దన్ రావు ఆసక్తిగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరామెన్, ఎడిటింగ్ వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిర్మాత, కథ,మాటలు, దర్శకత్వం.. దాడి జనార్దన్ రావు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం

సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశముల ప్రకారం రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమం ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు పి గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపుశ్రీనివాసరావు మరియు మూడు మండల పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, యన్నబతుల ఆనంద్, కొమ్ముల రాము, మరియు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిసిసిబి చైర్మన్ ను కలిసిన సొసైటీ అధ్యక్షుడు ఎస్.రాజా

సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డిని మంగళవారం సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్(రాజా) మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందజేశారు. నెల్లూరులోని డిసిసిబి కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల సొసైటీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామపురం సొసైటీ అధ్యక్షుడు ఎస్. రాజా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేకంగా డిసిసిబి చైర్మన్ ను కలిసి సీతారామపురం మండల సమస్యలపై చర్చించారు. సీతారామపురం మండల రైతులను ఆదుకునేలా రుణాలను మంజూరు చేయాలని అదేవిధంగా సొసైటీ కాంప్లెక్స్ గదులు, గోడౌన్ నిర్మాణాల ప్రతిపాదనలను అంగీకరించి,వేగంగా పనులు జరిగేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకుడు భోగినేని కాశీ రత్తయ్య(గాంధీ) తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్చందంగా పాల్గొన్న వేలాదిమంది అన్నదాత లు..అన్నదాత లకి యూరియా అన్దిన్చి తక్షణమే ఆదుకోవాలి…లేనిపక్షంలో అన్నదాత ల తరుపున పోరాటం ఉదృతం చేస్తాం….////

ఉదయగిరి,కావలి : (పున్నమి న్యూస్ ) :/// కావలి లో కదం తొక్కిన రైతు పోరు బాట… ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు అండగా కావలి లో ఆర్డిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మద్దు నిద్రపోతుంది ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారులు దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల సంక్షోభం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గాని వ్యవసాయ మంత్రి గా అచ్చం నాయుడు గాని ఏమాత్రం చీమకుట్టినట్టైనా లేదు అని అన్నారు . రైతులు క్యూలో నిలబడితే దాన్ని బఫే భోజనంతో పోల్చిన అచ్చం నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగించేందుకు అర్హుడేనా? రైతుల ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తు రావడం దౌర్భాగ్యం. చేసిన తప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కష్టాలు వారి పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి.. ఇంకా అవమానపరచడం దారుణం అన్నారు . రాష్ట్రానికి వచ్చిన ఎరువుల్లో అధిక భాగం ప్రైవేటుకు మళ్ళించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అచ్చం నాయుడే స్వయంగా చెప్పాడు అన్నారు .సహజంగా రాష్ట్రాన్ని కేటాయించిన ఎరువులను 50 శాతం ప్రభుత్వము ఆధీనంలోని మార్క్ ఫెడ్ కు 50% ప్రైవేటుకు కేటాయిస్తారు. ఈ ఎరువులను మార్కెట్ యార్డుల ద్వారా పిఎసిఎస్ లు, ఏపీవోల ద్వారా పంపిణీ చేస్తారు . ప్రైవేటు కేటాయించిన ఎరువులను ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తారు. పద్ధతి ప్రకారం ఇలా జరుగుతుంది. మరి అలా కాకుండా మార్క్ ఫెడ్ ఇవ్వాల్సిన 50% ఎరువులను తగ్గించి ప్రైవేటు కేటాయించడం అత్యంత దుర్మార్గం అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని గతంలో కన్నా ఎక్కువే ఇచ్చామని చెప్తున్నారు గతంలో కన్నా యూరియా సహా ఎరువులు ఇస్తే రైతులకు ఎందుకు దొరకడం లేదు అన్నారు. సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గినప్పుడు ఎరువుల లభ్యత ఎందుకు లేదు అన్నారు . ఈ విషయాలు చూస్తుంటే ఎరువులను బ్లాక్ తరలించి సొమ్ము చేసుకున్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. సమస్య ప్రైవేటు వ్యక్తుల నుంచి వస్తుందని అనుకున్నప్పుడు వెంటనే ప్రభుత్వ విభాగమైన మార్క్ ఫెడ్ కు కేటాయింపులు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో పెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు ఆర్బికేల సిబ్బంది ప్రతి గ్రామాలలోనూ ఉన్నారు కదా వారి సేవలను ఎందుకు వాడుకోలేదు. గతంలో మేము చేసినట్టుగా ఆర్బికేల ద్వారా ఎరువుల పంపిణీ ఎందుకు చేపట్టలేదు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బికేల వ్యవస్థను నాశనం చేశారు ఉచిత పంటల బీమాకు పాతర వేశారు.ఏ సీజన్లో పంట నష్టం వస్తే అదే సీజన్లో ముగిసే లోపు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ మరుసటి సీజన్ లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (నష్ట పరిహారం) ను అందించే పద్ధతిని ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు . యూరియా సహా ఎరువులను కొరత లేకుండా చూడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉదయగిరి నలుమూలల నుండి రైతులు, నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్సీపి అభిమానులు పాల్గొన్నారు.

అన్నమయ్య

భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్

అన్నమయ్య జిల్లా, పుల్లంపేట – సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) పుల్లంపేట మండలం కేతరాజుపల్లి పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 206లో ప్రభుత్వం భూమిని రాత్రిపూట జెసిబి యంత్రాలతో సదులు చేస్తూ అక్రమంగా ఆక్రమిస్తున్న భూబకాసురులను వెంటనే అరెస్టు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిమాండ్ చేశారు.ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో కబ్జాలకు గురైన భూములను పరిశీలించిన అనంతరం పుల్లంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, తహసీల్దార్ పుల్లారెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజు బోయిన సెల్వన్ కుమార్, కేతరాజుపల్లి, ఉడుమువారిపల్లి ఎస్సీ కాలనీల వాసులు పాల్గొన్నారు.జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ, “రెవెన్యూ యంత్రాంగం కళ్ళు మూసుకుని కబ్జాదారుల ఆటవిక చర్యలను చూడనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకుల అండదండలతో భూబకాసురులు రాత్రిపూట జెసిబిలు పెట్టి చెట్లు నరికేస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరచి భూకబ్జాదారులపై కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలి” అని హెచ్చరించారు.అలాగే ఆయన, కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఎనిమిదో విడత భూ పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉడుమువారిపల్లి, కేతరాజుపల్లి ఎస్సీ కాలనీల్లో ఒక్కింట్లో నలుగురు–ముగ్గురు కుటుంబాలు ఉంటున్నందున వెంటనే ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్‌కి కోరారు.తహసీల్దార్ పుల్లారెడ్డి స్పందిస్తూ, “ఇంటి స్థలాలు లేని అర్హులైన వారికి తప్పక రెవెన్యూ పరంగా పట్టాలు మంజూరు చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కాని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు.

అన్నమయ్య

ఆటో కార్మికుల ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్

రైల్వే కోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కేంద్రంలో ఆటో కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ పాల్గొని ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం ప్రీబస్సు వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నదని, అనేక కుటుంబాలు ఆకలితో రోడ్లపై పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో కార్మికులను నిర్లక్ష్యం చేయకుండా, వారికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ఆటో కార్మికుల కోసం PF, ESI సౌకర్యాలతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆయన మరింతగా మాట్లాడుతూ, ఆటో కార్మికుల కనీస సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ నెల 16న అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని ఆటో కార్మికులను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఆటో సంఘం నాయకులు దేశయ్య, గంగయ్య, వెంకటసుబ్బయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైతు సమస్యలపై రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆందోళన

అన్నదాత పోరు కార్యక్రమం భాగంగా భారీ ర్యాలీ రైల్వే కోడూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ఉధృతమైంది. ఈ క్రమంలో మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ నేతలు, రైతులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.రైతులకు యూరియా, విత్తనాలు అందుబాటులో లేకపోవడం, గిట్టుబాటు ధరలు నిర్లక్ష్యం చేయడం, కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం అందించకపోవడంపై నేతలు మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న యూరియాను అడ్డుకోవాలని, రైతులకు తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ లు అందుబాటులో లేకపోవడంతో ఎఒ నాగభూషణం కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా పరిసలకులు, కడప మేయర్ సురేష్ బాబు, పీలేరు మాజీ ఎమ్మెల్యే రాంచంద్ర రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, రాజంపేట ఇంచార్జి అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.“రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని నేతలు స్పష్టం చేశారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమం

చిట్వేల్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలంలోని పోలోపల్లి, మైలపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, నేల ఆరోగ్యం కాపాడటం, పర్యావరణాన్ని సంరక్షించడం, నాణ్యమైన పంటలు పండించడం కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడటం అవసరమని సూచించారు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, పిల్లి పెసర, జీలగలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా 25 శాతం వరకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.నానో యూరియా, నానో DAP వినియోగం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయని, వృథా తగ్గుతుందని ఆయన వివరించారు. జీవన ఎరువులైన రైజోబియం, అజోల్లా, అజోస్పిరిల్లుమ్ వాడకం వల్ల వాతావరణ నత్రజని మొక్కలకు అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో PDMS కిట్స్, ఘన జీవామృతం, బీజామృతం వాడటం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గి అధిక దిగుబడులు సాధ్యమని రైతులకు అవగాహన కల్పించారు.యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మోతాదు మించితే చీడపీడల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. మండలంలో యూరియా కొరత లేదని, అవసరానికి తగ్గట్టు రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ షాపుల ద్వారా సరఫరా జరుగుతోందని తెలిపారు. ఎవరూ పుకార్లను నమ్మకూడదని, అవసరానికి మించి ఎరువులు నిల్వ చేయరాదని హెచ్చరించారు. అక్రమంగా యూరియా నిల్వ చేసినా, MRP మించి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి శ్రీ లోకేష్, రైతు సేవా కేంద్ర సిబ్బంది, గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.