Wednesday, 6 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!

సెప్టెంబర్10 పున్నమి ప్రతినిధి @ ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలిమ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. యూఏఈ జట్టుతో టీమిండియా తలపడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ జట్టుకు యూఏఈపై విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు.. ఈనెల 14న పాకిస్థాన్ జట్టుతో కీలక పోరుకు ముంగిట యూఏఈ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ ఘనవిజయం సాధించి సరైన స్థితిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.యూఏఈతో భారత జట్టు ఓకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. 2016 ఆసియా కప్ లో జరిగిన ఆ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత్ తో మూడు వన్డేలు కూడా ఆడిన యూఏఈ అన్నింట్లో ఓడింది. మరోవైపు భారత్ జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ నుంచి ఆడిన 27 మ్యాచ్ లలో భారత జట్టు మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది. ఆసియాకప్ టోర్నీలో భాగంగా యూఏఈ జట్టుతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. శుభ్‍మన్ గిల్ చాలాకాలం తరువాత మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కించుకు న్నాడు. వైస్ కెప్టెన్ హోదాలో గిల్ ఆసియా కప్ తుది జట్టులో ఉండడం ఖాయం. దీంతో ఇన్నాళ్లూ ఆడుతున్న తుది జట్టు నుంచి అతడి కోసం స్థానం ఖాళీ చేసేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మిడిలార్డర్ బ్యాటర్ రింకు సింగ్ ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో అదొక్క మార్పే ఉండకపో వచ్చు. గిల్ ఓపెనర్ గా క్రీజులోకి వస్తే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడు. అయితే, ఇప్పటి వరకు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా వస్తున్న సంజు శాంసన్ అక్కడి నుంచి కిందికి దిగాల్సిందే. టాప్ ఆర్డర్లో ఆడించేట్లయితేనే సంజు శాంసన్ తుది జట్టులో ఉండే చాన్స్ ఉంది. మిడిలార్డర్ బ్యాటరే కావాలనుకుంటే జితేశ్ మెరుగైన ప్రత్నామ్నాయం కావొచ్చు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోల వివాదం – తొలగించాలంటూ హైకోర్టులో పిల్‌

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారంటూ హైకోర్టులో పిల్‌ – చిత్రపటాలు తొలగించాలంటూ పిటిషనర్ అభ్యర్థన చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలతో హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్‌) దాఖలైంది. చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని పిల్‌లో పేర్కొన్నారు. పిల్‌ దాఖలు చేసిన వ్యక్తి వివరాలు: ఈ పిల్‌ను రైల్వే విశ్రాంత ఉద్యోగి, విజయవాడకు చెందిన వై. కొండలరావు దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్‌లో ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలను ప్రదర్శించడంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట విధానం రూపొందించలేదని స్పష్టం చేశారు. చిత్రపటాల ప్రదర్శన విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని తీసుకొచ్చేంత వరకు పవన్‌ కల్యాణ్‌ ఫోటోలను తొలగించేలా ఆదేశించాలని కోరారు. ప్రతివాదుల జాబితా: ఈ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిల్‌పై బుధవారం విచారణ జరపనుంది. ఆర్‌టీఐ సమాధానాలు: పిల్‌ దాఖలు చేసిన కొండలరావు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాల ప్రదర్శనకు సంబంధించిన ఉత్తర్వులు, నిబంధనలు, సర్క్యులర్లు వివరాలు కోరుతూ దరఖాస్తులు వేశారు. దీనికి సమాధానంగా సమాచార, పౌరసంబంధాలశాఖ “ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి జీఓలు, మార్గదర్శకాలు, నిబంధనలు లేవు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల చిత్రపటాలను ప్రదర్శించమని ప్రభుత్వం కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ విషయమై ఏ సమాచారం లభ్యం కాలేదు” అని తెలిపింది. రాజ్యాంగపరమైన ప్రశ్నలు: కొండలరావు తన పిటిషన్‌లో, రాజ్యాంగంలోని అధికరణ 164లో ఉప ముఖ్యమంత్రి అనే పదవిని స్పష్టంగా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. అందులో సీఎం, ఇతర మంత్రులను గవర్నర్ నియమించే అంశం మాత్రమే ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటం పక్కన ఉప ముఖ్యమంత్రి ఫొటో ఉంచడం వల్ల ఈ రెండు పదవులు రాజ్యాంగపరంగా సమానం అనే తప్పుడు భావన కలుగుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: రాజ్యాంగబద్ధం కాని(నాన్‌ కాన్‌స్టిట్యూట్‌) ఉప ముఖ్యమంత్రి పోస్టును సీఎం స్థాయి పోస్టుగా పెద్దది చేసి చూపుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని వినియోగించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా పిటిషనర్ తన పిల్లో ప్రస్తావించారు. ప్రజాధనం ఉపయోగించి రాజకీయ వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టను పెంచడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పిటిషనర్ అభ్యర్థన: ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వం నిర్దిష్ట విధానం రూపొందించేంత వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో హైకోర్టును కోరారు.

ఆంధ్రప్రదేశ్

మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ కు తిరిగి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ను ఆదేశించడంతో నేడు అనంతపురం లో జరుగనున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ రద్దు చేసుకుని వెలగపూడి సచివాలయం లోని రియల్ టైమ్.గవర్నెన్స్ సెంటర్ కు వెళ్ళి పరిస్థితులను సమీక్షించనున్నారు 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్ రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్న మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి నారా లోకేష్ నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్.

తిరుపతి

యూరియా పై వైకాపా దుష్ప్రచారం — అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వరి కోతలు దాదాపు అయిపోయాయి.ఇప్పుడు యూరియా కొరత ఉందని వైసిపి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ పేర్కొన్నారు.యూరియా కొరత లేకపోయినా వైకాపా నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి రైతులు ఆందోళనా చెందొద్దని తెలియజేశారు.రబీకి సంబంధించి రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేకుండా కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,రైతులు అధైర్య పడవద్దు అని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

నెల్లూరులోని “దగదర్తి” విమానాశ్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – రూ. 916కోట్లతో టెండర్లు

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ 916 కోట్లతో దగదర్తి విమానాశ్రయ మొదటి దశ పనులకు టెండర్లు – పీపీపీ విధానంలో చేపట్టాలనున్న రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తెచ్చేందుకు రాజధాని అమరావతితో పాటు రోడ్లు, రైలు, వాయు మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను రూ.916 కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. పీపీపీ విధానంలో దీనిని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకంగా జరిగే కార్యకలాపాలతో విమానాశ్రయం నుంచి ప్రయాణీకులు, సరకు రవాణా బాగా పెరుగుతుందని ఏపీఏడీసీఎల్‌ అంచనా వేసింది. దీనివల్ల కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. టెండరు ప్రక్రియ ప్రారంభం : దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి ఏపీఏడీసీఎల్‌ అంతర్జాతీయ టెండరును పిలిచింది. వచ్చే నెల 10న ప్రీబిడ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. బిడ్‌ల దాఖలకు నవంబరు 3వ తేది తుదిగడువు. రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరో 7 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్‌పోర్టులను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రాయాల కట్టడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

పున్నమి నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి@గెడ్డం ప్రతాప్ తెలుగుదేశం పార్టీ & ఎన్డీఏ గవర్నమెంట్ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుణ్య దంపతులకు పున్నమి తెలుగు దినపత్రిక నుంచి హ్రృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

జోగులాంబ గద్వాల

జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన… జిల్లా కలెక్టర్

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, అయిజ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల (బాలుర)లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయములో విద్యార్థులందరూ ఇంటికి వెళ్లి ఉన్నారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ సెలవు కాదు. అధికారికంగా కూడా ఎటువంటి సెలవు లేదు. అయితే విద్యార్థులను అనుమతి లేకుండా ఇంటికి ఎందుకు పంపించారు, అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. దీనికి ఉపాధ్యాయులు, ఈ రోజు మాల పున్నమి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లారు అని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ప్రకటించని సెలవును మీరు ఎలా ఇస్తారు పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి బోధన పొందాలి. మీరు ప్రోత్సహించకపోతే విద్యార్థుల చదువు ఎక్కడ నేర్చుకుంటారు అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషపాణి శర్మను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ 100 శాతం హాజరుగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని ఆదిశగా కృషి చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మా దేవుడు మాన్యం భూమిని మాకు ఇప్పించండి:పాలూరి వెంకటముని

శ్రీకాళహస్తి పట్టణంలోని 19వ వార్డు ఎంఎం వాడ కు సంబంధించి శ్రీరామ మందిరంనకు గల దేవుడు మాన్యం పొలం ఐదు ఎకరాలను కొందరు భూ ఆక్రమణదారులు రియల్ ఎస్టేట్ పేరుతో పక్కనున్న ఈ దేవుడు మాన్యాన్ని ఆక్రమించి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. కావున శ్రీకాళహస్తి తహసిల్దార్ కి ఎంఆర్పిఎస్ తరఫునుండి పాలూరి వెంకటముని భూ కబ్జాదారుల నుండి ఈ భూమిని కాపాడి సర్వే చేసి మా మాదిగలకు సంబంధించిన ఈ దేవుడు మాన్య భూమిని తిరిగి ఇప్పించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు.

తిరుపతి

జన సైనికులకు అండగా జనసేన పార్టీ జనసేన జిల్లా కార్యదర్శి కొట్టే సాయి

శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు శ్రీ తిరుకాల్ల సోమయ్య ప్రమాదవశాత్తు అకాల మరణం చెందగా, వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఈరోజు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రెసిడెంట్ టీం సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి జనసేన నాయకుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ కార్యకర్త ప్రమాదానికి గురైతే వారి కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడకుండా ప్రమాద భీమా పథకం తీసుకొచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగసభ

సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్‌లో భారీగా ఏర్పాట్లు సూపర్‌ సిక్స్‌-సూపర్‌హిట్‌ పేరిట కూటమి ఉమ్మడి సభ 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభ సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్, మాధవ్, మంత్రులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.