Wednesday, 6 May 2026

Blog

జోగులాంబ గద్వాల

రాజీ మార్గం రాజమార్గం – జాతీయ లోక్ అదాలత్

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, జిల్లా కోర్టులో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్.ప్రేమలత తెలిపారు. గద్వాల కోర్టు మరియు అలంపూర్ కోర్టులలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి.శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 13న శనివారం గద్వాల్‌, అలంపూర్ లోని న్యాయస్థానలో లోక్‌అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ ప‌ద్ద‌తిలో క్రిమిన‌ల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమై, వైవాహిక జీవితం సంబంధిత, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులపై సంబంధించిన కేసులను ఇరుపక్షాల సమ్మతితో రాజీతో పరిష్కారమయ్యే కేసులన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకు పోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తుందన్నారు. రాజీ మార్గం రాజమార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.గతంలో 8195 కేసులు పరిష్కరించి మన జిల్లా, రాష్ట్రంలోనే 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా ప్రజలంతా తమ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని శాంతియుతంగా, సంతోషంగా జీవించాలని ఆమె కోరారు.

జోగులాంబ గద్వాల

పిడుగు పడి ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం భూంపురం గ్రామం బుధవారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో సీడిపత్తి చేస్తున్న కూలీలు వేప చెట్టు కిందికి వెళ్లారు ఆ క్షణమే పిడుగు పడింది ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఒక యువకుడు ఉన్నారు. పార్వతమ్మ (22) సౌభాగ్య (40), సర్వేస్ (20) మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయపడిన వారిని‌ చికిత్స కోసం గద్వాల జిల్లా‌ ఆసుపత్రికి తరలించారు.‌ మృతి చెందిన వారు భూంపురం గ్రామానికి చెందినవారుగా పోలీస్ అధికారులు గుర్తించారు.

అన్నమయ్య

గరుగుపల్లెలో వినాయక స్వామి ఆలయంలో ఘనంగా మండల పూజలు

చిట్వేల్, సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం గరుగుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ వినాయక స్వామి ఆలయంలో 39వ మండల పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాయిని బ్రాహ్మణులు, గొల్లవారు, రజకులు కలిసి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, శిల్పకళా వైభవంతో గుడిని అలంకరించారు. సెప్టెంబర్ 10 బుధవారం నాడు నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన మారపురం గురవయ్య కుటుంబం ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వేకువజాము నుండి పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అభిషేకం, అర్చనలు జరగగా, సన్నాయి, డోలు, మృదంగం, నాదస్వరాల నాదంతో గ్రామమంతా భక్తి రసమయంగా మారింది. భక్తులు వినాయకుని పాటలకు పరవశించి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజల అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పాలు సమర్పించి, నైవేద్యంగా పళ్ళు, పలహారాలు సమర్పించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని బ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులను గురవయ్య వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

నాగర్‌కర్నూల్

గర్భిణి కి రక్తదానం చేసిన కానిస్టేబుల్ జితేందర్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఉద్యోగం అంటేనే బందోబస్తులు, కోర్టు డ్యూటీలు, ఇలా రకరకాల పనులతో బిజిగా ఉండడం అందరికి తెలిసిందే కాని ఓ కానిస్టేబుల్ మాత్రం పోలీస్ ఉద్యోగంతో పాటు మానవత్వం, తోటి వారికి సాయం కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే గర్భిణి కాన్పు కోసం వచ్చింది. కాని డెలివరీ కోసం ఆపరేషన చేయాల్సిందేనని యాదమ్మ కు రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు ఆమె భర్త విష్ణుకు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుండగా రోడ్ సేప్టీ ప్రెసిడెంట్ ఎద్దుల వెంకటేష్ వారి పరిస్థితిని గమనించాడు. వెంటనే బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జితేందర్ ను రక్తదానం చేయాలని కోరాడు. దీనికి వెంటనే అంగీకరించిన జితేందర్ వెంటనే గర్భిణి యాదమ్మ కు కావాల్సిన రక్తాన్ని దానం చేశాడు.ఆపరేషన్ కోసం కావాల్సిన రక్తాన్ని కానిస్టేబుల్ జితేందర్ మరో వ్యక్తి తిప్పర్తి గోపాల్ ఇద్దరు ఇవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు.కానిస్టేబుల్ జితేందర్ ఇటీవల బిజ

నాగర్‌కర్నూల్

పల్లె దావకారణం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వాంగ గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు. మరియు అక్కడే SC సబ్ ప్లాన్ కింద మంజూరు అయిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఎమ్మేల్యే గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు సంభందిత అధికారులు పాల్గొనడం జరిగింది.

నాగర్‌కర్నూల్

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై పోరాడుతాను మండల అధ్యక్షులు జస్వంత్ కుమార్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 బిజినేపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న జశ్వంత్ కుమార్ ను ఇటీవల జరిగిన జిల్లా నాయకుల ఆధ్వర్యంలోని మండల ముఖ్య కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు జశ్వంత్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ – “రాబోయే రోజులలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తాను. గ్రామస్థాయి కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలుగా పోరాటం చేస్తాను” అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ మండల ఉపాధ్యక్షులు సామ శ్రీశైలం, సహాయ కార్యదర్శులు రవి, రాము, పలువురు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

తూడుకుర్తి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

*బోనాల పండుగలో ఎమ్మేల్యే* పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఎమ్మేల్యే గారి సొంత ఊరు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊర్లో మర్రి చెట్టు నుంచి చెరువు కట్ట దగ్గర ఉన్న అమ్మ వారి దేవాలయం వరకు ర్యాలీగా బోనాలతో రావడం జరిగింది వారితో పాటు ఎమ్మేల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. ఎమ్మేల్యే గారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణరావు గారు, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జనగాం

జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఘనంగా – తెలంగాణ భాషా దినోత్సవం

సెప్టెంబర్ 9, పున్నమి ప్రతినిధి, జనగాం: కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకంగా, విభిన్న రకాల అద్భుతమైన టీ.ఎల్.ఎమ్ (TLM)లను తయారు చేసి ప్రదర్శించారు. అదనంగా నృత్యాలు, ప్రసంగాలు, పాటలు, వక్తృత్వాలతో తెలుగు భాషా మహత్యాన్ని ప్రతిబింబించారు. తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రజిత మాట్లాడుతూ — “తెలుగు భాష మన బతుకుబండి, మన సంస్కృతి శ్వాస. భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

తిరుపతి

పి ఆర్ సి కమిటీ నియమించాలి-ఎస్టియు డిమాండ్

ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం,శ్రీకాళహస్తి మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ,సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వేడం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలత్తూరు జగన్నాథం మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వెంటనే నియమించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,దసరా కైనా ఉపాధ్యాయ,ఉద్యోగ,కార్మికులకు కరువు భత్యాలు వెంటనే ప్రకటించాలని మరియు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు,రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ గ్రాట్యూటీ చెల్లింపులు,ఈ ఎల్,ఏపీ జిఎల్ ఐ,జడ్పిపిఎఫ్ తదితర రుణాల బకాయిలు సత్వరమే చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

ప్రధాన కాలువలలో చెత్త తొలగింపు.

శ్రీకాళహస్తిలో పట్టణం లో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో వివిధ ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది చే మురికి కాలువల్లో చెత్తను తొలగించారు.రానున్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని కాలువల్లోని చెత్తను తొలగించకుంటే వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.