Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లా పర్యటన

నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3:30 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

నిర్మల్

ఎంబీబీఎస్ సీటు సాధించిన మంజుల రాజేశ్వర్ కుమారుడికి ఘన సన్మానం

నిర్మల్ పున్నమి ప్రతినిధి: లక్ష్మణచందా మండలానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ దంపతుల కుమారుడికి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించడంతో కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, కల్లెడ భూమన్న, ఓస రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్

బాధిత కుటుంబాన్ని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…

భైంసా : బైంసా మండలంలోని పాంగ్రి గ్రామానికి చెందిన నారాయణ పటేల్ గారి భార్య కుసుంబాయి గారు అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.

నిర్మల్

నైపుణ్యంతోనే మహిళా సాధికారత. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటిల్

**భైంసా, అక్టోబర్ 3 (పున్నమి):** యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను యువతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.యువతులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని యువతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ఎస్‌ఆర్‌టీ, ఆర్‌ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఆప్ నేతల ఘన నివాళులు నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ సమీపంలో గల గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

నిర్మల్

గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: కూచాడి శ్రీహరిరావు

నిర్మల్: గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యత సిద్ధాంతాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల బాటలో నడవాలని శ్రీహరిరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్ జిల్లా

నిర్మల్

గంజాల్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పున్నమి ప్రతినిధి:సోన్ మండలం, గంజాల్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గంజాల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాటను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ నిర్మల్ జిల్లా

నిర్మల్

ఆర్మీ జవాన్ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో చిరు సన్మానం

బైంసా.: అక్టోబర్ 02. బైంసా మహిషా పట్టణంలోని నేతాజీ నగర్‌కుచెందిన ఆర్మీ జవాన్ *రాథోడ్ గంగాధర్, రాథోడ్ షమ్క దంపతుల కుమార్తె **రాథోడ్ వర్ష రాణి** కరీంనగర్‌లోని జీఎంసీ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా జై జవాన్ సేవా సమితి** ఆధ్వర్యంలో ఆమెకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా జై జవాన్ సేవా సమితి సభ్యులు వర్ష రాణి నివాసానికి వెళ్లి ఆమెను శాలువాతో సత్కరించి, చిరు సన్మానం చేశారు. ఎంబీబీఎస్ సీటు సాధించిన వర్ష రాణిని అభినందిస్తూ, భవిష్యత్తులో వైద్యురాలిగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జై జవాన్ సేవా సమితి సభ్యులు **ఆకుల గోపాల్, యనుపోతుల మల్లేష్, గాలి రాజన్న, కనికరం శ్రీనివాస్, చెర్ల సుభాష్, కాసరోల్ల ప్రవీణ్ కుమార్, బండారి దిలీప్, చొప్పరి వెంకటేష్, భీమా శంకర్ తదితరులతో పాటు ఆర్మీ జవాన్ రాథోడ్ గంగాధర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నిర్మల్

ఆరోగ్యశ్రీ అండతో రాజన్నకు కిడ్నీ స్టోన్ ఆపరేషన్.

భైంసా, అక్టోబర్ 1:పున్నమి ప్రతినిధి.కుబీర్ మండలంలోని సిరిపెల్లి గ్రామానికి చెందిన రాజన్న కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ భైంసాలోని జీడీఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. ఆసుపత్రి వైద్యులు రాజన్నకు వైద్య పరీక్షలు నిర్వహించి, కిడ్నీ స్టోన్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించారు.చికిత్స పొందుతున్న సమయంలో రాజన్నకు ఆసుపత్రి తరఫున ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ సమయంలో ప్రయాణ ఖర్చులను సైతం అందించినట్లు తెలిపారు.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తనకు ఉచితంగా కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేసి, మెరుగైన వైద్య సేవలు అందించిన జీడీఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి రాజన్న కృతజ్ఞతలు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

నిర్మల్

గిరిజన ఆశ్రమ పాఠశాలలకు రూ.4.72 కోట్ల నిధులు

లోకేశ్వరం:నియోజకవర్గంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4.72 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భైంసా ఆశ్రమ పాఠశాలకు రూ.1.90 కోట్లు, దోడర్నకు రూ.99 లక్షలు, తానూర్ ఆశ్రమ పాఠశాలకు రూ.1.73 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని 15 గిరిజన తండాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.1.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.