భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చ!
ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలి కాంగ్రెస్ అధిష్ఠానానికి సీనియర్ నాయకుడు డాక్టర్ మహమ్మద్ షాహిద్ విజ్ఞప్తి ఆదిలాబాద్, పున్నమి ప్రతినిధి: భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా పరిశీలకులు ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నిజాం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ షాహిద్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎం.ఏ. లతీఫ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందిస్తున్నారని, పార్టీ కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా ఉంటూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని షాహిద్ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు, సముచిత అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడికి కేటాయించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించాలని కోరారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న ఎం.ఏ. లతీఫ్‌కు ఈ పదవిని కేటాయించడం ద్వారా ఆయన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని డాక్టర్ మహమ్మద్ షాహిద్ విజ్ఞప్తి చేశారు. Uploaded Video:









