Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఘనంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం నిర్మల్, అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి): నిర్మల్ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిర్మల్ జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం విశేషం.
  • అక్టోబర్ 13న ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన జి.

రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం
నిర్మల్, అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి): నిర్మల్ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిర్మల్ జిల్లాలో రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం విశేషం.
అక్టోబర్ 13న ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతన జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన జి. జనార్దన్‌తో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, పలు సంఘాల ప్రతినిధులు రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించారు. తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు షేక్ ముజాహిద్, ఉపాధ్యక్షుడు సాజిద్, ప్రధాన కార్యదర్శి అల్మాస్ చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *