వార్త ముఖ్యాంశాలు
- – రూప్‌కుమార్‌ను గెలిపించుకోవడం బీసీల బాధ్యత – జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాషా బీసీలకు అండగా ఎప్పుడూ తెలుగుదేశం ఉంటుందని, నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిత్వం విషయంలో రిజర్వేషన్ ఓసీ జనరల్‌కు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలు బీసీ…
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
- ఓసీ జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని ప్రకటించడం నిజంగా సాహసోపేతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
– రూప్‌కుమార్‌ను గెలిపించుకోవడం బీసీల బాధ్యత
– జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాషా
బీసీలకు అండగా ఎప్పుడూ తెలుగుదేశం ఉంటుందని, నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిత్వం విషయంలో రిజర్వేషన్ ఓసీ జనరల్‌కు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలు బీసీ అయిన పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్‌కే టికెట్ ఇచ్చి బీసీలపై తమ అభిమానాన్ని చూపారని, కనుక రూప్‌కుమార్ యాదవ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత జిల్లా బీసీలపై ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ కౌన్సిలర్ షేక్ బాషా పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసీ జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని ప్రకటించడం నిజంగా సాహసోపేతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. బీసీలపై అభిమానంతో సీఎం చంద్రబాబు నాయుడు రూప్‌కుమార్ యాదవ్‌కు నెల్లూరు మేయర్ టికెట్ ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ విషయంలో రూప్‌కుమార్ యాదవ్‌కు అన్ని విధాలా సహకరించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఎంతో అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.