వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
బాసర: పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పీవీ రమణారెడ్డి, మేడారం ప్రదీప్, మలేష్, పాకాల రాంచందర్, పి. రమేష్ రెడ్డి, కొప్పుల శ్రీధర్, రవికిరణ్, రమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:

