Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Manthani #Peddapalli

పెద్దపల్లి

ఈ నెల 27న ‘చలో యాదగిరిగుట్ట’ విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల పిలుపు

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ (ఆదివారం) యాదాద్రిలో నిర్వహించనున్న 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గం నుంచి ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మంథని సాయికుమార్, ముత్తారం మండల శాఖ అధ్యక్షుడు బండారి సుధాకర్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడమే ఈ వార్షికోత్సవ సభ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ఉద్యమ కాలంలో తాము పాల్గొన్న కార్యక్రమాలు, పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని (ఉద్యమ డాటా) వెంట తీసుకురావాలని సూచించారు. ఈ మహాసభ యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో గల జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో ఆదివారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి

జిల్లా మైనారిటీ అధికారిని సత్కరించిన ఎంసీపిఎఫ్ కమిటీ

పెద్దపల్లి/మంథని, సెప్టెంబర్ 22:నూతనంగా నియమితులైన పెద్దపల్లి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రవిని ఆయన కార్యాలయంలో మంథని కన్స్టిట్యూషన్ పోస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంసీపిఎఫ్ అధ్యక్షుడు ఐ. డేవిడ్ మాట్లాడుతూ… క్రిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్రైస్తవ సమాజం సద్వినియోగం చేసుకునేలా జిల్లా అధికారిగా తమవంతు ప్రోత్సాహాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఎఫ్ నాయకులు అధ్యక్షుడు ఐ. డేవిడ్, ఉపాధ్యక్షులు జయరాజ్, సెక్రెటరీ అశోక్ కర్నూరి, కో-సెక్రెటరీ జోషి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సుదర్శన్, నవీన్, బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ పెద్దపల్లి

వేదమంత్రాలతో గణపతి నిమజ్జన ఊరేగింపు

— సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక నిమజ్జన ఊరేగింపుమంథని పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ మహా గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఎంతో ఆకర్షించింది. వేద పఠనం, భక్తి పాటలతో కొనసాగిన ఈ కార్యక్రమం వేద పాఠశాల ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపులో వేద విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విరసిల్లుతున్న మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం అందరిని ఆకట్టుకుంది. గణపతి నిమర్జనం ఊరేగింపులో మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో మహావాది విజయ్ కుమార్, మహావాది శివ, ఆలయ అర్చకులు పల్లి రాము, వేద పాఠశాల విద్యార్థులు కౌండిన్య, చైతన్య, శ్రీనందన్, దేవిశ్రీ ప్రసాద్, సుమేద, శివ అభినవ శర్మ, శ్రీవత్సవ, అశ్విన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంథనిలో ఘనంగా జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమం

_ప్రవక్త మహమ్మద్ బోధనలు మానవతా విలువలకు ప్రతీక_ మంథని, సెప్టెంబర్ 20:మిలాద్ ఉన్ నబీ పర్వదిన్నాని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ ఫంక్షన్ హాల్‌లో సాలేహ మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు పాల్గొని ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర, ఆయన బోధనలు, మానవతా విలువలను వివరించారు. జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమం సందర్భంగా ఫంక్షన్ హాల్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గం, ఆయన జీవితం ద్వారా సమాజానికి అందించిన సందేశాలను మత పెద్దలు వివరించారు. ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం, పేదల పట్ల ఆదరణ, ఇతరులను గౌరవించడం వంటి మానవతా విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని వారు సూచించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని మత పెద్దలు పేర్కొన్నారు. మనుషుల మధ్య భేదాలను పక్కనపెట్టి పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగాలని, కుటుంబం నుంచి సమాజం వరకు మంచి నడవడిక, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలను పాటించాలని సూచించారు. ప్రవక్త మహమ్మద్ జీవితం కేవలం ఒక మతానికి సంబంధించిన అంశంగా కాకుండా మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వక్తలు వివరించారు. ఆయన బోధనల్లోని శాంతి, సహనం, దయ, సేవా భావం వంటి అంశాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల మార్గదర్శకంలో నడవడికను పిల్లలు అనుసరిస్తారని, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల దృష్టి ఆవశ్యకం అన్నారు. విద్యార్థుల్లో ప్రవక్త మహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర, బోధనలు, నైతిక విలువలపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 13 తేదీన పెద్దపల్లి జిల్లా జమియత్ ఉలమా ఆధ్వర్యంలో మంథని పట్టణంలో ‘సీరత్ ఉన్ నబీ టాలెంట్ పరీక్ష’ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మూడు గ్రూపులుగా నిర్వహించిన ఈ పరీక్షలో  ప్రతి గ్రూపులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు విలువైన బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందించారు. కార్యక్రమానికి హాజరైన మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సాలేహ మజీద్ కమిటీ సభ్యులు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు ముస్లిం సమాజ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సాలెహ మజీద్ కమిటీ నాయబ్ సదర్ సాబ్ హఫీజ్, ఉపాధ్యక్షుడు ఆజం, కమిటీ సభ్యులు నిజాం, అంజద్ పాషా, జనైద్, సోనూ, ఇమామ్ మోజం లతీఫ్, జమియత్ ఉలమా జిల్లా అధ్యక్షుడు లాయ్ ఖుల్లా, ముఖ్తి సాదిక్, మౌలానా జమీల్, మౌలానా ఖయ్యూం, మౌలానా రిజ్వాన్, స్థానిక మైనారిటీ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దపల్లి

కమాన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న అల్పాహార కార్యక్రమం దోహదపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కమాన్‌పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అల్పాహారం నాణ్యత, రుచి, పరిమాణంపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు.ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలి సమస్య లేకుండా చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోషకాహారం అందించడం ద్వారా, విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రతిరోజూ అందిస్తున్న అల్పాహారం ఎలా ఉంది, రుచిగా ఉంటుందా, పాలు లేదా రాగిజావ అందుతున్నాయా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణతో పాటు,వారి విద్యాభ్యాసానికి అవసరమైన అనుకూల వాతావరణం కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

రామగిరిలో ఘనంగా డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం, సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ నూనె రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో ప్రతినిధులు మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులను ఏకం చేస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్ చీమ శ్రీనివాస్ సేవలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో ఏళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం తో పాటు ముదిరాజ్ కవి, చిట్టేటి యాకు, అడ్డకొండ రవివర్మ, చిలక సమ్మయ్య, నల్లూరి రామ్మూర్తి, పులిపాక బానేష్, గాజుల రమేష్, పులిపాక దేవా, జనగామ శ్రీనివాస్, మాతాంగి రాయమల్లు, ఇతర మండల ఉద్యమకారులు, కళాకారులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభకు తరలిరావాలని పిలుపు

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, ఆకాంక్షల సాధన కోసం నిర్వహిస్తున్న 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 27న యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యలు, ఆకాంక్షలపై చర్చించి, వాటి సాధనకు కార్యాచరణ రూపొందించేందుకు సభ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఆధారాలు, ఉద్యమ డాటాను ప్రతి ఒక్కరూ సభకు తీసుకురావాలని సూచించారు. మంథని నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయకుమార్, మంథని మండల అధ్యక్షుడు కాసిపేట సాంబయ్య, ప్రధాన కార్యదర్శి జాడి జంపయ్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మంథని సాయికుమార్, సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు దాసరి శంకరయ్య పాల్గొన్నారు.

పెద్దపల్లి

పరిసరాల పరిశుభ్రతపై అందరూ అవగాహన కలిగి ఉండాలి

గుంజపడుగు సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ పరిసరాల పరిశుభ్రత పై గ్రామంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామ సర్పంచ్ దండేవేన సంధ్య బానేష్ కోరారు. గురువారం మంథని మండలం గుంజపడుగు గ్రామంలో స్వచ్ఛతా హే సేవ కార్యక్రమంలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థులకు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త. శానిటరీ చెత్త గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించినట్లు ఆమె తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్య కరమైన సమస్యలు ఉండవని ఆమె గుర్తు చేశారు. విద్యార్థిని విద్యార్థులందరూ మీ మీతల్లిదండ్రులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించాలని, ప్లాస్టిక్ గ్రహీత గ్రామంగా స్వచ్ఛ గ్రామంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలక లక్ష్మీ, దొడ్డిపట్ల శంకర్. దేవరకొండ పోచం, దేవళ్ళ లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు శివ లీల, కార్యదర్శి సతీష్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంథని పట్టణ అభివృద్ధి శ్రీధర్ బాబు ధ్యేయం: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మంథని పట్టణ అభివృద్ధి మంత్రి శ్రీధర్ బాబు ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మంథని పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో నష్టపోతున్న వారిని సంప్రదించి పనులు ముందుకు తీసుకెళ్లాలని తమకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారని వారు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడ కూడా పక్షపాత వైఖరి అవలంబించవద్దని మంత్రి సూచించినట్లు వారు పేర్కొన్నారు. నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మూల మలుపుల వద్ద అలాగే నాలుగు రోడ్లు కలిసే ప్రాంతం విస్తారంగా ఉండాలని ప్రణాళికలను రూపొందించినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పదో వార్డ్ కౌన్సిలర్ పెంటరి రాజు తో పాటు గ్రామస్తులు మహావాది విజయ్ కుమార్, రంగి అమర్నాథ్, జక్కం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

సింగపూర్ కంపెనీల ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం

హైదరాబాద్/మంథని, సెప్టెంబర్ 16: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’ లో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి, రాష్ట్రంలో ఫ్యాబ్‌ పరిశ్రమలతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేలా సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం బుధవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌ బాబుతో సమావేశమైంది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హబ్’ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హై వాల్యూ ఇండస్ట్రీస్‌, ఆర్ అండ్ డీ, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఐటీ/ఐటీఈఎస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, లైఫ్‌సైన్సెస్‌, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్‌, గ్రీన్‌ టెక్నాలజీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆర్ అండ్ డీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్‌ కంపెనీలకు విస్తృత అవకాశాలున్నాయన్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, అవకాశాలపై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో సింగపూర్‌ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ డా.ఫ్రాన్సిస్ చోంగ్, ఇండియా డైరెక్టరేట్ డైరెక్టర్ జీన్ యీ, సౌత్ ఏషియా ఎంటర్ ప్రైజ్ డైరెక్టర్ ఆట్రీ టూన్, తదితరులు పాల్గొన్నారు.