కున్సి గ్రామంలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
నూతనంగా మంజూరైన 24 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భాగంగా కృష్ణా మండలం కున్సి గ్రామంలో నూతనంగా పెన్షన్లు మంజూరైన 24 మంది లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పథకం ద్వారా అర్హులైన పేదలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందడంతో వారి జీవనానికి కొంత భరోసా లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









