Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

గడువులోగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు పూర్తి చేయాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గడువులోగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు పూర్తి చేయాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప,

కృష్ణ మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీజేపీ నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లె నర్సప్ప, జి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. నవంబర్ 6లోగా ఓటరు నమోదు గడువు ముగియనున్నందున గతంలో ఓటు ఉన్నవారితో పాటు, 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులను కలిసి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు డి. రాఘవేంద్ర, సచిన్ బట్, సీనియర్ నాయకులు నారాయణ బట్, శంకరయ్య శెట్టి, బి. శంక్రప్ప, నరసింగప్ప, గుంతల హన్మంతరాయ, సురేష్ బట్, సాబు గౌడ్, కుర్వ బాలరాజు, కండ్రయ రాజు, కావలి బస్వరాజు, నాగేంద్ర, తిరుపతి, బీరప్ప, అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు పూర్తి చేయాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప,

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *