Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Krishna mandal

నారాయణపేట

రాత్రివేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకునే వారేరీ?

కున్సి గ్రామం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఇసుక టిప్పర్ వేగంగా వెళ్తుండగా, దానిని వెంబడించినప్పటికీ వాహనం వేగం పెంచుకుంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇసుకను పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రివేళల్లో ఇంత బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతున్నా అడ్డుకునే వారే లేరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెంచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నారాయణపేట

పింఛన్ బాండ్ల పంపిణీకి కదిలిన కున్సి కాంగ్రెస్ బలగం.. మక్తల్‌కు భారీగా తరలివెళ్లిన నాయకులు!

మక్తల్‌లోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ మంజూరు బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కున్సి గ్రామ కాంగ్రెస్ బలగం పెద్ద సంఖ్యలో తరలివెళ్లి తమ సంఘీభావాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, భవిష్యత్తులో మిగిలిన హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఒంటరి మహిళలు, అక్కాచెల్లెళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వామినాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, బాడాల్ చిన్న నరసప్ప, ఖాన్దొడ్డి నారాయణ, గడ్డమీది శరణ్, నల్లె శ్రీనివాసులు, అలిగేరి మహదేవ్ జీ, లక్ష్మణ్, కాశీం, శివప్ప, నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

కృష్ణా మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

నవంబర్ 17న సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో పాల్గొనాలి: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహాదేవ్ కృష్ణా మండలం: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. కృపాకర రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా మండల CPS ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం. మునెప్ప మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని, CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నవంబర్ 17న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అధ్యక్షుడిగా నల్లే శివరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. స్వామినాథ్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా అభిలాష్, కోశాధికారిగా తిరుపతయ్య ఎన్నికయ్యారు. మహిళా విభాగం కన్వీనర్లుగా ఎస్. మాధవి, గీత, ఉపాధ్యక్షులుగా అజయ్, ఆంజనేయులు, కార్యదర్శులుగా ఖాసీం, రవి, రవి ఎన్నికయ్యారు. సమన్వయ సభ్యులుగా రంగారావు, వెంకటయ్య, బాలువివేక్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర సహా అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, PRTU నాయకులు రాఘవేంద్ర, అనిల్ కుమార్‌తో పాటు మండల CPS ఉద్యోగులు పాల్గొన్నారు.

నారాయణపేట

హాస్టల్‌కు వెళ్తానని చెప్పి వెళ్లి అదృశ్యమైన 7వ తరగతి విద్యార్థి.. ఆచూకీ కోసం తల్లిదండ్రుల ఆవేదన

క్రిష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన భంగి గంగప్ప (గౌతమ్) అనే 7వ తరగతి విద్యార్థి ఈ నెల 11-11-2026న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. హాస్టల్‌కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు, ఇప్పటివరకు హాస్టల్‌కు కూడా చేరుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు భంగి మహదేవ్, భంగి సంగీత ఆందోళన చెందుతున్నారు. బాలుడి వివరాలు: పేరు: భంగి గంగప్ప (గౌతమ్) చదువు: 7వ తరగతి గ్రామం: ఆలంపల్లి, క్రిష్ణ మండలం దుస్తులు: తెలుపు రంగు ప్యాంట్, నలుపు రంగు షర్ట్ ముఖ ఛాయ: ఎరుపు రంగులో ఉంటుంది. ఈ బాలుడు ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 7013910892 6302924297

నారాయణపేట

పాఠశాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ పంచాయతీకి ప్రత్యేక కృతజ్ఞతలు

ఎంపీపీ ఎస్ ఖాన్ దొడ్డి పాఠశాల పరిసరాల్లో పెరిగిన చెట్ల పొదల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాటిని తొలగించాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శిని కోరడం జరిగింది. పాఠశాల విజ్ఞప్తిపై వారు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్ల పొదలను తొలగించడం జరిగింది. విద్యార్థుల సౌకర్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి మండల విద్యాశాఖ తరఫున, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 💐💐💐

నారాయణపేట

ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణంలో ఘనంగా గడప పూజ

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ బనద రేణుకా ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మహత్తరమైన గడప పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మహేష్ స్వామి, ప్రధాన అర్చకులు పూజారి శరణప్ప ఆధ్వర్యంలో ముందుగా వినాయక, కలశ పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య గర్భగుడి, అంతరాలయంలో గడప పూజ చేసి గడపలను ప్రతిష్ఠించారు. దేవాలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రముఖులు, పెద్దలు, రైతులు, భక్తులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ దైవ కార్యానికి విరాళాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా విరాళాలు అందించాల్సిన వారు ఈ నెలాఖరులోగా అమ్మవారి దేవాలయానికి అందించి సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలందరి సహకారంతో ఫిబ్రవరి నెలలో జరిగే అమ్మవారి జాతరలోపు దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

నారాయణపేట

విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ప్రముఖ సైకాలజిస్ట్ రాధాకృష్ణారావు

కున్సి: పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కున్సిలో నిర్వహించిన ఎక్స్‌పర్ట్ టాక్ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్, బీఈడీ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ రాధాకృష్ణారావు విద్యార్థులకు విలువైన మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా చదువు ప్రాముఖ్యత, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించే విధానాలు, సమయపాలన, లక్ష్యసాధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించారు. చదువుతోనే జీవితాలను మార్చుకోవచ్చని, ప్రపంచంలో సమయం అత్యంత విలువైన సంపద అని, ఒక్కసారి చేజారిన సమయం తిరిగి రాదని పేర్కొన్నారు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. సంతోషి, ఉపాధ్యాయులు పి. నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సిములు, సత్యనారాయణ రెడ్డి, స్వాతి, గీత, ఆరీఫ్, రాధిక, స్మిత, నగేష్, కృష్ణవేణి, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్

కృష్ణ మండల కేంద్రంలోని క్షిరాలింగేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ కృష్ణ మండల శాఖ ఆధ్వర్యంలో దేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయించడంలో ఆయన చూపిన చాకచక్యం, ధైర్యసాహసాలు మరువలేనివని పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్, సీనియర్ నాయకులు డీకే కిష్టప్ప, అజిత్ దీక్షిత్, కె. ఆంజనేయులు, పల్లె రాము తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

గడువులోగా ఎమ్మెల్సీ ఓటరు నమోదు పూర్తి చేయాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప,

కృష్ణ మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీజేపీ నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లె నర్సప్ప, జి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. నవంబర్ 6లోగా ఓటరు నమోదు గడువు ముగియనున్నందున గతంలో ఓటు ఉన్నవారితో పాటు, 2023 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులను కలిసి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు డి. రాఘవేంద్ర, సచిన్ బట్, సీనియర్ నాయకులు నారాయణ బట్, శంకరయ్య శెట్టి, బి. శంక్రప్ప, నరసింగప్ప, గుంతల హన్మంతరాయ, సురేష్ బట్, సాబు గౌడ్, కుర్వ బాలరాజు, కండ్రయ రాజు, కావలి బస్వరాజు, నాగేంద్ర, తిరుపతి, బీరప్ప, అంబరీష్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడల్లో కున్సీ పాఠశాల విద్యార్థుల విజయభేరి కబడ్డీ, ఖో-ఖోలో జిల్లా ప్రథమ స్థానం..

కున్సీ: నారాయణపేట జిల్లాలో అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కున్సీ పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. బాలుర కబడ్డీ, బాలికల ఖో-ఖో విభాగాల్లో జిల్లా ప్రథమ స్థానాలు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. బాలుర కబడ్డీలో రఘు, తరుణ్, తిరుమలేష్‌తో పాటు మరో విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలికల కబడ్డీలో శ్రావణి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విద్యార్థినులు ఖో-ఖోలో సమన్వయం, పట్టుదలతో విజయం సాధించారు. విద్యార్థులకు శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు సౌమ్యను అభినందించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు బి. సంతోషి, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, నర్సింలు, సత్యనారాయణ రెడ్డి, గీత, స్వాతి, ఆరిఫ్, నాగేష్, రాధిక, కృష్ణవేణి, స్మిత విద్యార్థులను అభినందించారు.