హిందూ దేవాలయాలలో వరుసగా జరుగుతున్న చోరీ కేసులను ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాలతో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ N.S.V.K. దుర్గారావు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీసు స్టేషన్ పరిధిలో గల తిమ్మాపురం మెయిన్ రోడ్‌లోని వినాయకుని ఆలయంలోను మరియు కాకినాడ జిల్లాలోని పలు ఆలయాలలో దొంగతనాలు చేసిన నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి వెండి దేవతా మూర్తుల విగ్రహాల తొడుగులు, బంగారు వస్తువులు, బంగారు ముక్కలు, వెండి కడ్డీలు మరియు వెండి వస్తువులు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం సుమారు రూ.48,00,000/- (అక్షరాల నలభై ఎనిమిది లక్షల రూపాయలు) ఉంటుంది. కేసు వివరాలు ది. 17/18.10.2026 తేదీన అర్థరాత్రి 1.00 గంట నుండి 2.00 గంటల మధ్యలో తిమ్మాపురం పోలీసు స్టేషన్ పరిధిలో గల వినాయకుని ఆలయంలో తలుపు తాళం బద్దలు కొట్టి గుడిలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడగా Cr. No. 116/2026 U/S 331(4), 305(a) BNS కేసు నమోదు చేయబడినది. ప్రత్యేక దర్యాప్తు బృందాలు కాకినాడ జిల్లాలో పలు దేవాలయాలలో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ N.S.V.K. దుర్గారావు గారి పర్యవేక్షణలో కాకినాడ రూరల్ CI D.S. చైతన్య కృష్ణ, తిమ్మాపురం SI Y. గణేష్ కుమార్ లతో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతిక మరియు ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడి అరెస్టు 19.11.2026 తేదీన మధ్యాహ్నం 1.00 గంటకు తిమ్మాపురం గ్రామ శివారులోని NH-216 బైపాస్ రోడ్డు వద్ద తిమ్మాపురం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ Y. గణేష్ కుమార్ గారు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు

వార్తా మూలాలు
- Crime newsఅధికారిక ప్రకటన