Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు ప్రదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు ప్రదానం

శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పిఠాపురం అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆఫీసర్ రామకృష్ణ రాజు మరియు అగ్నిమాపక సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు విజయ జనార్ధనాచార్యులు విశ్వహిందూ పరిషత్ పిఠాపురం అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించి, వారిలో మరింత ఉత్సాహాన్ని నింపాలనే సదుద్దేశంతో ఈ ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లవడు గణేష్ సేవా సంఘం ఉపాధ్యక్షులు అప్పలరాజు జాయింట్ సెక్రెటరీ నాని. విశ్వహిందూ పరిషత్తు సభ్యులు సుంకర శివ. తదితరులు ఉన్నారు.

సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు ప్రదానం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *