Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Crime

నంద్యాల

మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

నంద్యాల మూడవ పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్‌ మరియు పరిసర ప్రాంతాలలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP సుస్మిత IPS సూచనలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రాకపోకలు జరిగే ప్రదేశాలు, సున్నితమైన మరియు అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న వాహనాలను కూడా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసి, వారి గుర్తింపు, కదలికలపై ఆరా తీశారు. అవసరమైన చోట విచారణలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అభ్యంతరకర/చట్టవిరుద్ధ వస్తువులు గుర్తించబడలేదు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముందస్తు తనిఖీలు, భద్రతా చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రకాశం

కనిగిరిలో పాస్టర్‌ భారీ మోసం.. రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు!

కనిగిరిలో రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ ఆశ చూపి పేద, మధ్యతరగతి ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఓ పాస్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగి ఉండవచ్చన్న సమాచారం వెలుగులోకి రావడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. పాస్టర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన గుడే శ్రీనివాసులు రూ.2.50 లక్షలు చెల్లించి మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉప్పు శ్రీనివాసులు తెలిపారు. పాస్టర్ ఇంట్లో తనిఖీల్లో రూ.3.28 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. Video Link: https://www.instagram.com/reel/Dd_iMxnzzIm/?stkn=MWloaHZzYW1wemlmOQ== Uploaded Video:

నంద్యాల

నంద్యాల టూటౌన్ సీఐగా జి.సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

నంద్యాల: నంద్యాల రెండో పట్టణ (టూటౌన్) సీఐగా జి.సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నంద్యాల వన్‌టౌన్ సీఐగా పనిచేసిన ఆయన, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన వైఖరితో గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయడం, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడం మరియు ప్రజలకు భద్రతా భావన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

నంద్యాల

నంద్యాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐగా ఇస్మాయిల్‌ బాధ్యతల స్వీకరణ..

.నంద్యాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ నూతన సీఐగా ఇస్మాయిల్‌ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు…1996 బ్యాచ్‌కు చెందిన ఇస్మాయిల్‌ గతంలో నంద్యాల పట్టణంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు నంద్యాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించారు.ఆయా విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి,పోలీసు శాఖలో తనదైన గుర్తింపు పొందినట్లు సిబ్బంది పేర్కొన్నారు..!!బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ ఇస్మాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు,సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులు,పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులు,ఇతర పోలీస్‌స్టేషన్‌ కార్యకలాపాలపై ప్రాథమికంగా ఆరా తీశారు..!!ఇప్పటికే నంద్యాల పట్టణంలో పనిచేసిన అనుభవం ఉండటంతో వన్‌టౌన్‌ పరిధిపై ఆయనకు అవగాహన ఉండటం కలిసొచ్చే అంశంగా పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి.నూతన బాధ్యతల్లోనూ సీఐ ఇస్మాయిల్‌ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు..!!*.వన్‌టౌన్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఇస్మాయిల్‌కు పోలీస్‌ అధికారులు,సిబ్బంది అభినందనలు తెలిపారు..!!

నంద్యాల

రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌ను కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలు, అక్కడి పరిస్థితులు, గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై వెల్దుర్తి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలింగ్ కేంద్రాలు, పోలీస్ పికెట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఎస్సై నరేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలందించడం అభినందనీయం.

నంద్యాల లో పదవి వీరమణ పొందిన ARSI గారిని సన్మానించిన సన్మానించిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్. ఖాదర్ భాషా నంద్యాల జిల్లా సాయుధ బలగాలలో విధులు నిర్వహిస్తున్న ARSI ఎం. వెంకటరమణ గారు పదవీ విరమణ కానున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో పదవివిరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కుటుంబ వివరాలను, పిల్లల చదువులు, ఉద్యోగ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ…ARSI 43 సంవత్సరాలు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి పోలీసు సిబ్బంది పదవివీరమణ పొందడం అభినందనీయమన్నారు. కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.అనంతరం శాలువ, పూలమాలతో సత్కరించి బహుమతిని అందజేయడం జరిగింది. ఎం.వెంకటరమణ ARSI వివరాలు1983లో జిల్లా సాయుధ బలగాల పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా నియామకం పొంది 2008 హెడ్ కానిస్టేబుల్ గా 2026 లో ARSI గా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఈయన సుమారు 43 సంవత్సరాలు జిల్లా పోలీసు శాఖకు సేవలందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు AR డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, RI సురేష్ ,RSI హర్షవర్ధన్ రెడ్డి ,జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయక్,రిటైర్డ్ అయిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నంద్యాల

మద్యం దుకాణాల దరఖాస్తుల్లో పారదర్శకత

నంద్యాల : మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి టి. నాగలక్ష్మి తెలిపారు. 80 శాతం లైసెన్సులు పునరుద్ధరించగా రూ.36.32 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.నంద్యాల, కర్నూలు పరిధిలో 27 ఖాళీ దుకాణాలకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో డ్రా నిర్వహిస్తామన్నారు. రాజకీయాలు, సిండికేట్ల జోక్యాన్ని సహించబోమని, బెదిరింపులు ఎదురైతే జిల్లా అధికారి ఎస్. రవికుమార్‌ను 8008828467 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఏపీ ఎక్సైజ్ యాప్, ఏఐ ఆధారిత సీసీటీవీలతో నిఘా పెంచుతున్నట్లు నాగలక్ష్మి తెలిపారు.

నంద్యాల

మద్యం లైసెన్సుల ప్రక్రియలో పారదర్శకత: జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి

నంద్యాల, కర్నూలు జిల్లాల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కమిషనర్ శ్రీమతి టి. నాగలక్ష్మి మద్యం లైసెన్సుల పునరుద్ధరణ, కొత్త దరఖాస్తుల ప్రక్రియపై అధికారిక వివరాలను వెల్లడించారు. లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను న్యాయబద్ధంగా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్టెల్లు, బినామీ ప్రయోజనాలకు సంబంధించిన లైసెన్సులను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో 20 శాతం లైసెన్సులు పునరుద్ధరణకు నోచుకోగా, 80 శాతం లైసెన్సులు విజయవంతంగా పునరుద్ధరించబడ్డాయని తెలిపారు. వీటి ద్వారా రూ.36.32 కోట్ల ప్రభుత్వ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని 14 మండలాలు, రెండు మునిసిపాలిటీలు, ఒక పట్టణ పంచాయతీ పరిధిలో మొత్తం 27 మద్యం దుకాణాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. ఈ 27 దుకాణాలకు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అధికారిక డ్రా అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరైనా బెదిరింపులకు గురైతే 8008828467 నంబర్‌కు జిల్లా అధికారి ఎస్. రవికుమార్ను నేరుగా సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు.గత పనితీరును ప్రస్తావిస్తూ, 2024–26 కాలంలో 2,226 దరఖాస్తులతో నంద్యాల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. మద్యం దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయన్న వాదనలను అధికారిక రికార్డులు సమర్థించవని, వాటి లాభదాయకతకు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.అలాగే ఏపీ ఎక్సైజ్ యాప్ ద్వారా నిఘాను మరింత పెంచడంతో పాటు, ఏఐ ఆధారిత సీసీటీవీ వ్యవస్థలను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. నేర కార్యకలాపాలను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. లైసెన్స్ ప్రక్రియకు రాజకీయ నాయకులు, సిండికేట్లు లేదా ఇతరులు ఆటంకం కలిగించే ప్రయత్నాలను సహించబోమని జాయింట్ కమిషనర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఏవైనా అవకతవకలు, బెదిరింపులు లేదా జోక్యానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.

నంద్యాల

దాడి కేసులో ఇద్దరి అరెస్ట్

ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని త్రివేణి బార్‌లో గత నెల 8న జరిగిన దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఇమ్రాన్, ఈశ్వర్‌లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.సల్మాన్‌రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్‌పై నంద్యాల తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరించారు.

నంద్యాల

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

నంద్యాల మహానంది రోడ్డులో తమ్మడపల్లె చెరువు మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మహానంది నుండి నంద్యాల వైపు వెళుతున్న బొలెరో వాహనం మోటార్ సైకిల్ లిస్టును ఢీకొట్టడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తి నంద్యాల వాసిగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తికి సంబంధించిన వివరాలను ఆ వ్యక్తి జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా పోలీసులు వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తుంది.