Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Kakinada

కాకినాడ

మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించు కుని శుక్రవారం కలెక్టరేట్‌ లో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ ..

మహాత్మా గాంధీ జయంతి మరియు దేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించు కుని శుక్రవారం కలెక్టరేట్‌ లో నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేంధిర ప్రసాద్ .. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి,మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.*

కాకినాడ

నేడు గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

నేడు గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్ లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గారు, KUDA చైర్మన్ శ్రీ తలాటం సత్య గారు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములవుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

కాకినాడ

“చిన్నతనంలో నడక నేర్పిన పెద్దలకు, వృద్ధాప్యంలో తోడుగా నిలవడమే మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం.”.డా అడ్డాల

స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ వృద్దాశ్రమం లో శ్రీ సత్య దంత వైద్యశాల వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యాన వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు, ఈ సందర్భంగా డా అడ్డాల మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 1990 డిసెంబర్ 14న ఆమోదించిన తీర్మానం ప్రకారం, 1991 అక్టోబర్ 1 నుంచి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ప్రారంభించారని, సమాజం, కుటుంబం మరియు దేశ ప్రగతిలో వయోవృద్ధులు అందించిన సేవలను స్మరించుకోవడం, వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక మరియు సామాజిక సమస్యల పట్ల సమాజంలో చైతన్యం తీసుకురావడం, వారిని నిర్లక్ష్యం చేయకుండా, హింస లేదా వివక్షకు గురికాకుండా చూసుకోవడం మరియు వారి ప్రాథమిక హక్కులను కాపాడడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు, రోజువారీ జీవితంలో వృద్ధులతో సమయం గడపడం, వారి మాటలను శ్రద్ధగా వినడం. అనుభవాన్ని ఉపయోగించుకోవడం,వారి వద్ద ఉన్న జీవిత అనుభవం మరియు జ్ఞానాన్ని తర్వాతి తరాలకు మార్గదర్శకంగా ఉపయోగించడం చేయాలని, వారి ఆహారం, మందులు మరియు మానసిక ఉల్లాసం పట్ల క్రమం తప్పకుండా శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ చరణ్, వీరభద్ర రావు, ఆశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు.

కాకినాడ

“అర్నబ్” తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, దిగువన ఉన్న తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అవంతి నగర్ కాలనీ ముంపునకు గురికాకుండా కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

“అర్నబ్” తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పేట కాలువలోని నీరు కిందకు దిగకపోవడంతో, దిగువన ఉన్న తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అవంతి నగర్ కాలనీ ముంపునకు గురికాకుండా కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి, పెనువెంటనే జేసీబీలతో పనులను ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని నీటి సంఘం ప్రెసిడెంట్లు మరియు సొసైటీ సభ్యులు కూడా తక్షణమే తమ పరిధిలోని కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. స్థానిక నాయకులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో (DLDO) శ్రీ వాసుదేవరావు, ఎంపీడీవో (MPDO) శ్రీ పి. సతీష్, ఇవోపీఆర్డి (EOPRD) శ్రీ రామాంజనేయులు, కూటమి నాయకులు శ్రీ బుర్ర అను బాబు, శ్రీ తాటికాయల వీరబాబు (బుజ్జి), శ్రీ మదారపు తాతాజీ, శ్రీ మేక లక్ష్మణ్ మూర్తి, శ్రీ కర్రి వెంకట్రాజు, శ్రీ కుడుపూడి బాలాజీ, శ్రీ బత్తుల దొరబాబు, శ్రీ రామిశెట్టి సునీల్, శ్రీ తోటకూర సతీష్, శ్రీ తురగ సంతోష్, శ్రీ కాళ్ళ శ్రీనివాస్, శ్రీ గిడుతూరి శ్రీనివాస్, శ్రీ రాయుడు అనిల్, శ్రీ పంపన మహేష్, శ్రీ పాలిక వాసు, శ్రీ ముద్దుర్తి రోహిత్ కుమార్, శ్రీ పాలిక అరవింద్, శ్రీ చంటి రెడ్డి, శ్రీ చోడిశెట్టి ఇంద్ర, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’

కాకినాడ రూరల్ మండలం, వాకలపూడి గ్రామ పంచాయతీ ఏరియా లో ‘స్వచ్చతే సేవా’ కార్యక్రమం లో భాగంగా కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రవి కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై గ్రామం లో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు MPDO శ్రీ సతీష్ గారు, PR Dept. Deputy MPDO శ్రీ MSR ఆంజనేయులు గారు, GSWS స్వర్ణ గారు, Panchayat Deputy MPDO శ్రీ బ్రహ్మాజీ గారు, పంచాయతీ అభివృద్ధి అధికారి P. పాండురంగారావు గారు, వాకలపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గంట ప్రసాద్ గారు, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదల చిన్నారావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చొక్కా నల్లబాబు, కణితి శ్రీనివాస్, సందిపర్తి తాతబ్బాయి, పెచ్చేటి సూర్యకుమారి, మానేపల్లి నాగేశ్వరావు(పండు) పాకాలపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

*కాకినాడ రూరల్ మండల పరిషత్ పాలకవర్గానికి ఆత్మీయ వీడ్కోలు.. రూ.635 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చాం: ఎమ్మెల్యే పంతం నానాజీ**

కాకినాడ రూరల్ మండల పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పాలనా కాలం ముగుస్తున్న సందర్భంగా స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ పి.సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీటీసీలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూరల్ మండలంలో **రూ.230.74 కోట్ల** అభివృద్ధి పనులు, **రూ.404.43 కోట్ల** సంక్షేమ పథకాలు కలిపి మొత్తం **రూ.635.17 కోట్లతో** క్షేత్రస్థాయి అభివృద్ధి సాధించామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందీల విరీషా, ఏఎంసీ చైర్మన్ మాసుమేను మంగ గంగయ్య, డీఎల్‌డీఓ వాసుదేవ్, కూటమి నేతలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

కాకినాడ

ఎన్టీఆర్ బీచ్ పార్క్‌గా నామకరణం చేయాలి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన పిల్లి దంపతులు

కాకినాడ, సెప్టెంబరు 16: కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని సూర్యారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బీచ్ పార్క్‌కు ‘ఎన్టీఆర్ బీచ్ పార్క్’గా నామకరణం చేసి అధికారిక బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె తన భర్త, టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తితో కలిసి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను కలసి వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ కో-కన్వీనర్ కొమిరిశెట్టి నరసింగరావు కూడా వారితో ఉన్నారు. 2014–19 మధ్య తాను కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీచ్ ఫెస్టివల్‌ను వరుసగా నాలుగు సంవత్సరాలు ఘనంగా నిర్వహించినట్లు పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీచ్ ప్రాంతాన్ని రహదారి మార్గంలో, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ పరిశీలించి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.50 కోట్లతో బీచ్ పార్క్‌ను, రాష్ట్ర ప్రభుత్వం పుష్కర నిధులతో సుమారు రూ.12 కోట్లతో బీచ్‌కు అనుసంధాన రహదారి, ఫోర్‌లేన్ రోడ్డు, విద్యుత్ దీపాలంకరణ, గెస్ట్‌హౌస్ తదితర పనులను చేపట్టినట్లు వివరించారు.ఒక బీచ్ ఫెస్టివల్ సందర్భంగా అప్పటి మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అప్పటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తాను, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో బీచ్‌కు ‘ఎన్టీఆర్ బీచ్’గా పేరు పెట్టాలని కోరినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని పేర్కొన్నారు.బీచ్ పార్క్ పనులు పూర్తయిన అనంతరం ‘ఎన్టీఆర్ బీచ్’ పేరుతో బోర్డు ఏర్పాటు చేయవచ్చని అప్పటి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపినప్పటికీ, అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి సమక్షంలో తీసుకున్న నిర్ణయం మేరకు ‘ఎన్టీఆర్ బీచ్ పార్క్’ పేరుతో అధికారిక బోర్డు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు పిల్లి అనంతలక్ష్మి తెలిపారు.

కాకినాడ

స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం కింద సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ..

జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి: -జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కాకినాడ, సెప్టెంబర్ 16: జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా,ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంపై కాకినాడ కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.. జిల్లా పరిషత్తు,పురపాలక సంస్థ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా,పాఠశాల విద్య,పట్టణ పేదరిక నిర్మూలన తదితర శాఖల అధికారులు,పురపాలక కమిషనర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కాకినాడ

ఏపీఎస్పీ మూడో బెటాలియన్ శిక్షణ కేంద్రంలో 30 నూతన కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం .

కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారు కాకినాడ మూడో బెటాలియన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శిక్షణార్థుల సౌకర్యార్థం 30 నూతన కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. శిక్షణార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని, శిక్షణ సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె. నవీన్ కుమార్, అడిషనల్ కమాండెంట్ శ్రీ ఎస్. దేవానంద్ రావు, అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీ డి. గంగరాజు, శ్రీ బి. చంద్రశేఖర రావు, శ్రీ ఎస్. మన్మధ రావు, ఆర్.ఐలు శ్రీ రవిశంకర్, శ్రీ శివరామకృష్ణ, శ్రీ కె. శ్రీనివాస్, శ్రీ డి. రాజు, శ్రీ హరిబాబు, ఇతర అధికారులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న శిక్షణార్థులు పాల్గొన్నారు.

కాకినాడ

పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పత్రికా ప్రకటన కాకినాడ జిల్లా అటవీ శాఖ తేదీ: 10.09.2026 పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజవొమ్మంగి రేంజ్ పరిధి నుండి ఒక పెద్ద పులి ది. 10.09.2026 న ఉదయం సుమారు 5:30 గంటలకు రేడియో కాలర్ ద్వారా అందిన సమాచారాన్ని బట్టి కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలోని ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్, కంపార్టుమెంట్ నెం. 574, పెద్దిపాలెం బీట్, ఏలేశ్వరం సెక్షన్ పరిధిలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దారపల్లి, బురదకోట, మిత్తివాడ, బౌరువాక, తాడువాయి మరియు పరిసర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. హనుమాన్ rescue బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజల భద్రత దృష్ట్యా: – ఎవ్వరూ అడవిలోకి వెళ్లరాదు. – అత్యవసర పరిస్థితి తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎవరూ ఒంటరిగా సంచరించరాదు. – తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దారపల్లి వాటర్ ఫాల్స్ ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదు. – పులి సంచారం గురించి ఎటువంటి సమాచారం, ఆనవాళ్లు లేదా కదలికలు కనిపించినా ప్రజలు స్వయంగా దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. – పులిని వెంబడించడం, గుంపులుగా చేరి చూడడం లేదా ఫోటోలు/వీడియోల కోసం దగ్గరకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడరాదు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలు మరియు కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ ఎన్. రామచంద్రరావు గారి ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరడమైనది. – జిల్లా అటవీ శాఖాధికారి కాకినాడ జిల్లా Uploaded Video: