వార్త ముఖ్యాంశాలు
- జడ్పీటీసీ డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన దారపనేని, పువ్వాడి పామూరు, నవంబర్ 21@2:58 am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మండల జడ్పీటీసీ డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్కాపురంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి పామూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
- కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు కార్యక్రమానికి హాజరై డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
జడ్పీటీసీ డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన దారపనేని, పువ్వాడి
పామూరు, నవంబర్ 21@2:58 am (పున్నమి తెలుగు దినపత్రిక )
పామూరు మండల జడ్పీటీసీ డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్కాపురంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పామూరు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు కార్యక్రమానికి హాజరై డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జడ్పీటీసీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ముందుకు సాగాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పామూరు సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి జయరామిరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లెబోయిన బాలబ్రహ్మం, మోపాడు నీటి సంఘం చైర్మన్ చుంచు కొండయ్య, కంబాలదిన్నె ఎంపీటీసీ పోకా వెంకటరత్నం, మాజీ సింగిల్ విండో చైర్మన్ గద్దే గంగయ్య చౌదరి, మాజీ సర్పంచ్ మల్లెబోయిన గురుబ్రహ్మం, మాజీ ఎంపీటీసీ చెనికల మాలకొండయ్య, టీడీపీ నాయకులు దారపనేని రాజేంద్రప్రసాద్, మెట్లు రాహుల్ యాదవ్, స్టూడియో మల్లికార్జున, రైస్ ట్రేడర్ అధినేత హాజీ గౌస్, గాజులపల్లి వెంకటేశ్వరరెడ్డి, బైరెడ్డి జస్వంత్ రెడ్డి, యరసింగు రాయుడు, మైనార్టీ నాయకులు గౌస్ బాషా, స్టాంప్ రైటర్ రఫీ తదితరులు పాల్గొని జాహ్నవిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.