Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి

డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదేశాలు

పెద్ద అంబర్‌పేట, అక్టోబర్ 13: పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని రేణుక గోల్డెన్ సిటీలో నెలకొన్న డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ స్తంభాలకు సంబంధించిన ఇబ్బందులతో స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలను జీఎస్ సేవా సమితి చైర్మన్, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేసినట్లు గ్యారల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. — గ్యారల శ్రీనివాస్ గౌడ్ చైర్మన్, జీఎస్ సేవా సమితి మాజీ కౌన్సిలర్, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ

రంగారెడ్డి

మాల్‌లో ఘనంగా గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం

మూడు మండలాల గ్రామీణ వైద్యుల అలాయ్‌ బలాయ్‌.. దసరా వేళ ఐక్యతకు వేదిక మాల్: గ్రామీణ వైద్యుల ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారమే లక్ష్యంగా మాల్ గ్రామంలో ఆదివారం గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాచారం, మాడుగుల, చింతపల్లి మండలాలకు చెందిన ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉక్కుల అశోక్ ఆధ్వర్యంలో, పద్మావతి ఆసుపత్రి నూతన యాజమాన్యం సహకారంతో ఈ సమ్మేళనం జరిగింది. వైద్యులు పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా గడిపారు. సమ్మేళనానికి హాజరైన వైద్యుల కోసం పద్మావతి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులు మహేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్, సందీప్ రెడ్డిలకు గ్రామీణ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యానికి తమవంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాచారం మండల అధ్యక్షుడు డాక్టర్ మంద మహేందర్, మాడుగుల మండల అధ్యక్షుడు విజయ్, చింతపల్లి మండల అధ్యక్షుడు సైదులు, మాడుగుల మాజీ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌తో పాటు జిల్లా నాయకులు విప్ వెంకటేష్, కృష్ణ నాయక్, భిక్షపతి, ప్రొద్దుటూరు రవీందర్, సరికొండ వెంకటేష్, నాగిళ్ల వెంకటేష్, శ్రీనివాస్ చారి, పగడాల వెంకటేష్, ఎస్.ఎస్. చారి, రాజు నాయక్, మూడు మండలాల కార్యదర్శులు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

కొత్తపేటలో ‘శారీపురం మిస్సమ్మ’ నూతన షోరూమ్ ప్రారంభం

ఎల్బీనగర్: కొత్తపేటలో ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ ‘శారీపురం మిస్సమ్మ’ నూతన షోరూమ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో, ఎల్‌బీనగర్ వెళ్లే మార్గంలో నూతన షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన చీరలను అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో రూ.199 నుంచి రూ.1,999 వరకు వివిధ రకాల చీరల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డైలీ వేర్‌తో పాటు వివిధ సందర్భాలకు అనువైన చీరలను ఏడాది పొడవునా అందుబాటు ధరల్లో అందిస్తున్నట్లు తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని రూ.5,000 విలువైన కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి సిల్వర్ కాయిన్ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కూకట్‌పల్లి, విజయవాడలో బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న శారీపురం బై మిస్సమ్మ, తాజాగా కొత్తపేటలో నూతన షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం తెలిపారు.

రంగారెడ్డి

స్వర్ణ మహల్లో అట్టహాసంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పెద్ద అంబర్పేట్ న్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవా సమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం పసుమాములలోని స్వర్ణ మహల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా సాగాయి. ఈ జన్మదిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేక్ కట్ చేసి, ఆయనకు స్వయంగా కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, జీఎస్ సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్యారాల శ్రీనివాస్ గౌడ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, అభిమానుల సందడి మధ్య స్వర్ణ మహల్లో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానుల కోలాహలం, శుభాకాంక్షల నడుమ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాలతో ఘనంగా ముగిశాయి.

రంగారెడ్డి

వృద్ధులు, చిన్నారుల మధ్య సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా AMMA CHEYUTHA FOUNDATION – Hyderabad Old Age Home Centerలో వృద్ధులు, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులు, చిన్నారులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. జన్మదినాన్ని వృద్ధులు, చిన్నారుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వృద్ధుల ఆశీస్సులు పొందడం, చిన్నారులతో కొంత సమయం గడపడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినాన్ని జరుపుకోవడం ద్వారా మరింత సంతృప్తి లభిస్తుందని, సమాజంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని సురేష్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ ఘనంగా ప్రారంభం. నాణ్యమైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

చైతన్యపురి మారుతినగర్‌లో యూనియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ సంస్థను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిర్వాహకులు వంశీకృష్ణతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిజిటల్ ప్రింటింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్, అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. 1996 నుంచి ప్రింటింగ్ రంగంలో అనుభవం కలిగిన సంస్థ ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. నిర్వాహకులు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఫ్లెక్స్, వినైల్, బ్యాక్‌లిట్, ఫ్రంట్‌లిట్, అక్రిలిక్, 3డీ లెటర్స్, వాల్‌పేపర్స్, గ్లాస్, ఆఫీస్, వెహికల్ బ్రాండింగ్‌తో పాటు హోర్డింగ్స్, స్టిక్కర్లు, బ్రోచర్లు, విజిటింగ్ కార్డులు, ప్యాకేజింగ్ ప్రింటింగ్ తదితర సేవలను సరసమైన ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రతి బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త, బాలరాజ్ గుప్తా, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

నాగోల్‌లో మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌కు భూమి పూజ.. ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన నివాసాలు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాగోల్ ఫతుల్లాగూడలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్ సమీపంలో మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ రూపొందించిన ప్రాజెక్టు బ్రోచర్‌ను సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలమోని రవికుమార్‌తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, ఆధునిక సౌకర్యాలతో కూడిన నివాసాలను అందించాలనే లక్ష్యంతో మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. “విజన్ టు రియాలిటీ” అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సురక్షితమైన, సౌకర్యవంతమైన, ప్రీమియం జీవన వసతులను అందించేలా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నవీన్ గౌడ్, మహేష్ గౌడ్, గుడి మధుసూదన్ రెడ్డి, మహాదేవ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ఆహ్వానితులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

మిస్సింగ్ వ్యక్తి ఆచూకీ కోసం విజ్ఞప్తి

రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులగుట్ట ప్రాంతానికి చెందిన షేక్ బాషా (38), మెకానిక్ అనే వ్యక్తి కనిపించకుండా పోయారు. అక్టోబర్ 3న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన షేక్ బాషా, రాత్రి సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు ఆయన బైక్ తాళాలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. అక్టోబర్ 4న ఉదయం సుమారు 7 గంటలకు కుటుంబ సభ్యులు లేచి చూడగా ఆయన ఇంట్లో కనిపించలేదు. అయితే ఆయన సెల్‌ఫోన్, బైక్ తాళాలు ఇంట్లోనే ఉన్నాయి. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. షేక్ బాషా ఆచూకీ తెలిసిన వారు వెంటనే హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం కోసం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ – 8712662640

రంగారెడ్డి

పోచబోయిన సురేష్ యాదవ్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పాత్రికేయ మిత్రులు

వనస్థలిపురం: పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం వనస్థలిపురంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు అవిరేను రామ్మోహన్, మధు గౌడ్, దూపం అంజనేయులు, పరుశురాం గౌడ్, గుర్రం పాండు, మెరుగు సురేష్, రాజు తదితరులు పాల్గొని పోచబోయిన సురేష్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పూల బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు.

రంగారెడ్డి

విజయ ఆయిల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలి: తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు.. రంగారెడ్డి జిల్లా: విజయ ఆయిల్‌ను తెలంగాణకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించి, జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. విజయ వంట నూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయ బ్రాండ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. విజయ ఆయిల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేలా తయారీ, పంపిణీ, విక్రయ వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు, ఆయిల్‌ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.