Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లేఅవుట్లను పరిశీలించిన నగరపాలక కమిషనర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లేఅవుట్లను పరిశీలించిన నగరపాలక కమిషనర్

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక అల్లీ పురం, ధనలక్ష్మిపురం, కనపర్తిపాడు, సప్తగిరి కాలనీ ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘు నాధరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు.
  • లేఅవుట్ ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, ప్లానులు తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లే అవుట్ ల నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు.
  • నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక అల్లీ పురం, ధనలక్ష్మిపురం, కనపర్తిపాడు, సప్తగిరి కాలనీ ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లే అవుట్ లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘు నాధరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు.

లేఅవుట్ ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు, ప్లానులు తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లే అవుట్ ల నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు.

అనుమతించిన మేరకు మాత్రమే లేఔట్ ల నిర్మాణాలు జరిగేలా, లే అవుట్ పరిధిలో నిర్దేశించిన అన్ని వసతులు ఏర్పాటు చేసేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం టి.పి.బి.ఓ లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *