వనస్థలిపురం: పోచబోయిన సురేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం వనస్థలిపురంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు అవిరేను రామ్మోహన్, మధు గౌడ్, దూపం అంజనేయులు, పరుశురాం గౌడ్, గుర్రం పాండు, మెరుగు సురేష్, రాజు తదితరులు పాల్గొని పోచబోయిన సురేష్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పూల బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ యాదవ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు.
