Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ ఆలయ అధికారులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపానికి చేరుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆలయ వేద పండితులు అర్చకులు వేదర్శివచనం అందజేశారు ఈ సందర్భంగా ఆలయం పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి శాలువాతో సత్కరించి స్వామివారి శేష వస్త్రం బహూకరించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భీమేశ్వర స్వామివారిని రాష్ట్రం లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర సదన్ ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల భీమేశ్వర సదన్ ప్రాంగణంలో బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి స్థానిక మహిళలు యువతులు తంగేడు గునుగు చామంతి బంతిపూలతో మూడు వరుసలలో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది పైన పసుపు గౌరమ్మను నిలిపారు సాంప్రదాయ దుస్తులు విచ్చేసిన మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కీర్తిస్తూ పాటలు పాడి కోలాటాలు ఆడుతూ ఆనంద ఉత్సవాల మధ్య కొలహాలo సృష్టించారు బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగలో భాగంగా రోజుకు ఒక అమ్మవారిగా బతుకమ్మను పకృతి ఆరాధ్య దేవతగా పూజించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మను పూజించాలి

రాజన్న సిరిసిల్ల

500 బైకులతో భారీ నిరసన ర్యాలీ కేకే మహేందర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి అర్హులైన అతి పౌరుడికి ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారా శైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు 500 బైకులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ పై చర్యల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమీషా వైఖరిని ప్రశ్నించారు ఎన్నికల ప్రక్రియ పై ప్రజల్లో అనుమానాలు కలగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడికి సంబంధించిన అంశమని ఎన్నికల వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు

రాజన్న సిరిసిల్ల

2025-2026 ఖరీఫ్ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు ఖరీఫ్ కొనుగోలు సి ఎం ఆర్ డెలివరీ పై జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో కలిపి సమావేశం నిర్వహించారు ఈ ఖరీఫ్ సీజన్లో ఐకెపి 123 పి ఏసి ఎస్ 122 మే పా ఆధ్వర్యంలో ఆరు మొత్తం 251 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు అలాగే 2025_ 2026 ఖరీఫ్ యాసంగి సీజన్ సిఎంఆర్ డెలివరీ పై దృష్టి సారించాలని సూచించారు పౌరసరఫల శాఖ అధికారులు నిత్యం ప్రత్యేక దృష్టి భరించాలన్నారు

రాజన్న సిరిసిల్ల

వికాస్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి పకృతితో మనకున్న అనుబంధాన్ని ప్రతీక అని వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో జరుపుకొని మీ పండుగ మన తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు నిస్తుందని తెలిపారు తెలంగాణ ఆడపడుచులందరూ రంగురంగుల పూలతో తొమ్మిది రోజులు కనుల పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకొని 9వ రోజు గౌరమ్మను పవిత్రంగా పూజించుకొని సద్దుల బతుకమ్మ నాడు గంగమ్మ ఒడికి చేరేస్తారు అని బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు

రాజన్న సిరిసిల్ల

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్ నీ నో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగానికి సవాలుగా మారింది ఎల్ నీ నో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జోలి సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఇతర ఉన్నంత అధికారుల అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట రైతు వేదిక లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎల్ నీ నో ప్రభావాన్ని ఎదుర్కొనుటకు పలు సూచనలు చేశారు

రాజన్న సిరిసిల్ల

పల్లకి సేవపై హరిహరుల ఉత్సవ మూర్తులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పల్లకి సేవ పై హరిహరుల ఉత్సవ మూర్తులు అంతరాలయం లో విహరించారు ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ భక్తిని చాటుకున్నారు పవిత్రమైన దేవి నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు మేళ తాళాలు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో నడుమ పల్లకి సేవ సాగింది భక్తులందరూ హరిహరుల పల్లకి సేవ పై ఉత్సవమూర్తులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చకులు నిర్వహించడం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పల్లకిసేన మోస్తూ ప్రదక్షణలు చుట్టూ చేస్తూ అమ్మవారి కృప కావాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు మహిళలు రంగురంగుల పూలతో పకృతిని ఆరాధించే దేవత బతుకమ్మ తల్లి బతుకమ్మ ను మహిళలు అంగరంగ వైభవంగా పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలుస్తారు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ముద్దపప్పు అన్నము ప్రసాదంగా సమర్పిస్తారు బతుకమ్మను మహిళలు ఆడిన తర్వాత ఈ ప్రసాదాన్ని మహిళలు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు మహిళలు బతుకమ్మ వేడుకలను ఒక్కొక్క రోజు ఒక పేరుతో బతుకమ్మ దేవతను కొలుస్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పకృతి ప్రసిద్ధమైన పండుగ మహిళలు దాండియా కోలాటం సందడితో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు మహిళలు చిన్న పిల్లలు వేడుకలను ఉత్సవ భరితంగా పాల్గొంటున్నారు

రాజన్న సిరిసిల్ల

పండుగ సందర్భంగా ఇండ్ల భద్రతపై జాగ్రత్తలు జిల్లా ఎస్పీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బతుకమ్మ దసరా పండుగకు ఊర్లకు వెళ్లేవారు ఇండ్ల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమన్నారు తాళాలు కనిపించకుండా ఉంచడం విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లో దాచడం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ఒక గదిలో లైట్ వెలిగేలా ఉంచడం చేయాలన్నారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు దీనికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని అనుమానిత వ్యక్తులు కనబడినచో పోలీసులకు సమాచారం అందించితే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శిక్షించడం జరుగుతుంది

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన పాలన సౌలభ్యంతో పాటుగా ప్రస్తుతం గంటల వ్యవధిలోని కలిసే అవకాశం ఉందన్నారు రాజన్న సిరిసిల్ల నిర్వహించిన జిల్లా ఆవిర్భావం దశాబ్ది ఉత్సవాలు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ గతంలో కలెక్టర్ ఎస్పీలను కలవాలంటే ఉమ్మడి కరీంనగర్ కు ఒకరోజు ముందు వెళ్లవలసి వచ్చేదని ప్రస్తుతం పరిపాలన సౌలభ్యం నిమిత్తం BRS పార్టీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక చొరవతో జిల్లాల విభజన పూర్వం తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు పరిపాలన సౌలభ్యం నిమిత్తం ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ సేవలు కల్పించాలని ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర గొప్పతనం అని ఆయన హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు