పున్నమి ప్రతినిధి అక్టోబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు మహిళలు రంగురంగుల పూలతో పకృతిని ఆరాధించే దేవత బతుకమ్మ తల్లి బతుకమ్మ ను మహిళలు అంగరంగ వైభవంగా పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలుస్తారు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ముద్దపప్పు అన్నము ప్రసాదంగా సమర్పిస్తారు బతుకమ్మను మహిళలు ఆడిన తర్వాత ఈ ప్రసాదాన్ని మహిళలు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు మహిళలు బతుకమ్మ వేడుకలను ఒక్కొక్క రోజు ఒక పేరుతో బతుకమ్మ దేవతను కొలుస్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పకృతి ప్రసిద్ధమైన పండుగ మహిళలు దాండియా కోలాటం సందడితో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు మహిళలు చిన్న పిల్లలు వేడుకలను ఉత్సవ భరితంగా పాల్గొంటున్నారు
