17 నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 27 వరకు నిర్వహించనున్నామని ఆలయ అధికారులు ఆర్డీవో శ్రీధర్ బాబుకు తెలిపారు ఆర్డీవో కార్యాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గోడపత్రికలు అధికారులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం ఆర్ డి ఓ శ్రీధర్ బాబు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు ఈ నెల 26 ను రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈవో వెంకట మారుతి రావు తాసిల్దార్ మహేష్ మున్సిపల్ కమిషనర్ ఖాదర్ బాషా వికాస తరంగిణి సభ్యులు సత్యసాయి సేవా సమితి సభ్యులు దేవాలయం అర్చకులు పాల్గొన్నారు









