Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఘన సన్మానం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం ఘనంగా సన్మానం చేసిన బండ లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాదిక్ బొప్పాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ మాజీ డైరెక్టర్ జంగా శ్రీకాంత్ రెడ్డి బండ లింగంపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగెల రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండే రాజు రెడ్డి ఆకారం రాజు జంగ బుచ్చిరెడ్డి దడిగెల బిక్షపతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

బండ లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాదిక్ బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ ను కాంగ్రెస్ పార్టీ మాజీ డైరెక్టర్ జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు కొండే రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు దడిగల రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి జంగ బుచ్చిరెడ్డి బిక్షపతి రెడ్డి కొత్తపల్లి బాలరాజ్ ఆకారం రాజు దడిగెల శ్రీనివాసరెడ్డి ఎండి యూసుఫ్ బొడ్డు దేవయ్య ఎండి సలీం ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేయడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

పర్యావరణ ప్రేమికుడు పకృతి ప్రకాష్ ఆదర్శ వ్యక్తి

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఆడబిడ్డల కోసం ఉచితంగా గునుగు పువ్వులు సుద్దాలకు చెందిన పర్యావరణ ప్రేమికుడు పకృతి ప్రకాష్ ఆదర్శంగా నిలిచారు గుట్టలు చెట్లు అంతరించి బతుకమ్మ పూలు కరువైన వేల ఆడబిడ్డల కోసం తన రెండు ఎకరాల చేన్లో గునుగు పూలు తాగు చేశారు 100 బతుకమ్మలకు సరిపడా పూలను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు అని ప్రకటించారు వివిధ గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి పూలు సేకరిస్తూ ఆయన చొరవను కొనియాడుతున్నారు పక్షుల కోసం మొక్కజొన్నను కూడా వదిలి పకృతి ప్రేమను చాటుకున్నారు

రాజన్న సిరిసిల్ల

గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు విప్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ అమ్మవారి విగ్రహాన్ని మూలవాగు సమీపంలోని తెప్ప వద్దకు చేర్చారు ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బిజెపి నాయకుడు ప్రతాపరామకృష్ణ కౌన్సిలర్లు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాపతినిధులు గౌరీ మాత అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడలో బతుకమ్మ వేడుకలు ఘనంగా

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా శుక్రవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని బతుకమ్మ తెప్ప వద్దకు తీసుకువెళ్లి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు పాల్గొన్నారు రూ . 34 లక్షలతో పండుగ ఏర్పాట్లు చేసినట్లు వేములవాడ పట్టణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు

రాజన్న సిరిసిల్ల

రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తాసిల్దార్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు అకస్మాత్తు గా దాడులు నిర్వహించారు వ్యవసాయ భూమి గిఫ్ట్ డిడి రిజిస్ట్రేషన్ కు సహకరించేందుకు రూ. 8 వేల లంచం డిమాండ్ చేసి ప్రైవేటు వ్యక్తి సుంకశాల అనిల్ కుమార్ ద్వారా స్వీకరించినట్లు తాసిల్దార్ కం జాయింట్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ అబు బాకర్ పై ఏసీబీ ఆరోపించింది లంచం మొత్తాన్ని ప్రవేట్ వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నారు ఇద్దరినీ కరీంనగర్ లోని ఏసీబీ ప్రత్యేక హోదా హాజరు పరిచినట్లు అధికారులు తెలిపారు కేసు దర్యాప్తులో ఉంది

రాజన్న సిరిసిల్ల

హత్య కేసు చేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో టైల్స్ వర్క్ యజమాని పవన్ హత్య కేసును పోలీసులు 12 గంటల్లోనే చేదించారు హత్యకు పాల్పడి అక్కడి నుంచి పరారైన ఇద్దరు కూలీలను ప్రత్యేక పోలీసు బృందం పట్టుకొని అరెస్టు చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన టైల్స్ వర్క్ యజమాని పవన్ అదే రాష్ట్రానికి చెందిన కూలీలు జోగేందర్ శివం డబ్బులు కోసం హత్య చేసి పరారైనట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది ఈ ఘటనపై కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దర్యాప్తును వేగవంతం చేసింది పరారీలో ఉన్న నిందితులు జోగేందర్ శివం రైల్వే స్టేషన్ లో పోలీసులకు పట్టుబడ్డారు

రాజన్న సిరిసిల్ల

గ్రామీణ ఉపాధి పనుల వద్ద బతుకమ్మ వేడుకలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి లో ఉపాధి హామీ కూలీలు పని వద్దనే సద్దుల బతుకమ్మను పేర్చుకొని ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మహిళా కూలీలంతా బతుకమ్మ సంబరాలు వికసిక్ భారత్ గ్రామీణ ఉపాధి పనుల వద్ద జరుపుకోవడం అక్కడ పండుగ వాతావరణం నెలకొంది తెలంగాణలో కూలీలు పనుల వద్ద పనులు చేసుకునే సమయంలో పనులు చేస్తూనే జానపద పాటలు పాడుకోవడం ఆనవాయితీగా వస్తుంది కానీ పని ముగిసిన అనంతరం బతుకమ్మను ఆడుకొని బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకున్నారు మహిళా కూలీలు ఆడుకోవడానికి వీలుగా ఆ ప్రదేశంలో పలువురు పురుష కూలీలు చక్కగా అమర్చారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పకృతి ఆరాధ్య దేవతగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు

రాజన్న సిరిసిల్ల

DSP పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఇల్లు అద్దెకు ఇవ్వరాదు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ఇంటి యజమానులు లు క్షుణ్ణంగా పరిశీలించి ఇంటి అద్దెకు ఇవ్వాలి డి.ఎస్.పి నాగేంద్ర చారి పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఇల్లు గదులు అద్దెకు ఇవ్వరాదని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇంటి యజమానులు అద్దెకు వచ్చే వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని డి.ఎస్.పి నాగేంద్ర చారి సూచించారు గుర్తింపు పత్రాలు పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఇల్లు గదులు అద్దెకు ఇవ్వవద్దని స్పష్టం చేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉండాలనుకునే వ్యక్తుల గుర్తింపు వివరాలను ఇంటి యజమానులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించడంతో పాటు అద్దెకు వచ్చే వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో అందించి అవసరమైన పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇల్లంతకుంట మండలాల విద్యుత్ వినియోదారుల సమస్య ల పరిష్కారానికి ఈనెల 23న శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రోడ్ లోని ఫ్రెండ్స్ క్లబ్ లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ 2 ఏర్పాటు చేస్తున్నట్లు చైర్ పర్సన్ కె కిషన్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు