వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (డీడీఈవో) స్వరూప్ సూచించారు.
- శుక్రవారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
- మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (డీడీఈవో) స్వరూప్ సూచించారు. శుక్రవారం మనుబోలు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 19న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.