Monday, 27 April 2026

Blog

విశాఖపట్నం

గాజువాకలో రాజభోగం హోటల్ పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం గాజువాక ( పున్నమి ప్రతినిధి): గాజువాక రాజీవ్‌నగర్ సమీపంలోని రాజభోగం హోటల్ టిఫిన్ సెక్షన్‌గా నిర్మించిన పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ఎవరో వెలిగించిన తరజువ్వ గుడిసె పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు. అయితే గుడిసె పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన సండ్ర

పున్నమి ప్రతినిధి హెడ్‌లైన్: సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు 100 Words News: దీపావళి పర్వదినం సందర్భంగా సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతిని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఐకమత్యం, స్నేహం, సంతోషం నిండిన దీపావళి ప్రతి ఇంటిని ప్రకాశవంతం చేయాలని కోరుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు.

అన్నమయ్య

పెనగలూరు మండలానికి దీపావళి శుభాకాంక్షలు

చిట్వేల్ అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి ) పెనగలూరు మండలంలో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు , మదన్ మోహన్ తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “దీపావళి కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు, అది చీకటిపై వెలుగు, దుఃఖంపై ఆనందం, అసత్యంపై సత్యం గెలిచిన ఈరోజు ఈ పండుగలో ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మరియు శాంతి నిండాలి” అని పేర్కొన్నారు.అతను ప్రజలను సురక్షితంగా మరియు పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవడానికి కూడా ప్రోత్సహించారు. చిన్న దీపాల వెలుగు మరియు మంచి సంకల్పాలు మన సమాజంలో ప్రేమ, ఐక్యత, మరియు సత్సంబంధాలను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అన్నారు.మదన్ మోహన్ చివరగా, పెనగలూరు మండలం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటిలో సంతోషం వెలిగాలని, ప్రతి మనసులో వెలుగు నిలవాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలతో తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*దీపావలి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలి*

*జాగ్రత్తలు పాటించి పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి* *రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన* మంత్రి ఆనం రామనారాయణరెడ్డి *పున్నమి ప్రతినిధి అక్టోబర్ 19 నెల్లూరు జిల్లా* రాష్ట్ర ప్రజలందరికీ ఈ దీపావళి పర్వదినం సంతోషాల సంబరం కావాలని, అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా మంత్రి ఆనం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.మన రాష్ట్రం మరోసారి వెలుగులదివ్వెలా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని మంత్రి ఆనం అన్నారు.ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలని మంత్రి సూచించారు. పెద్దపెద్ద శబ్దాలు చేసే బాణాసంచా కాకుండా వెలుగుపువ్వుల పర్యావరణహిత దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

తేదీ: 18/10/2025, శనివారం సాయంత్రం ఐదు గంటలకు , తిరుపతి “పాయ్ వైశ్రాయ్,హోటల్ నందు పి.వి.ఎన్. మాధవ్ (బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) “వెలమ సంక్షేమ సంఘం” తిరుపతి.వారు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి,సత్కరించడం అయినది. ఈ కార్యక్రమం నకు తిరుపతి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రంగినేని గోపాల్ నాయుడు . అధ్యక్షతన, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రొంగల గోపి శ్రీనివాస్.,శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు డైరెక్టర్ ,శ్రీ.మొక్కపాటి రమణయ్య నాయుడు గారు , చిత్తూరు జిల్లా బిజెపి కార్యదర్శి, .రమణ బాబు ., వెలమ ఫౌండేషన్ చైర్మన్, ఎం.వి.ఆర్. మూర్తి , మరియు వెలమ సంక్షేమ సంఘం తిరుపతి కార్యదర్శి . కె నాగేశ్వరయ్య గారు, కోశాధికారి .వి మురళి , వేదిక నలంకరించి పలు విషయాలపై వక్తలు వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, సందేశాలను వినిపిస్తూ, ముఖ్యంగా తిరుపతిలో “వెలమ సంక్షేమ ఉచిత యాత్రి నివాస్ భవనం” ఆవశ్యకతను వివరించి, ముఖ్య అతిథి పి.వి.ఎన్. మాధవ్ . దృష్టికి తీసుకురావడం జరిగినది. అందులకు పివిఎన్ మాధవ్ . సానుకూలంగా స్పందించి, భవనమునకు అవసరమైన స్థలాన్ని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి, భవన నిర్మాణానికి కూటమి పెద్దలు మరియు వెలమ ముఖ్య నాయకులు అందరితో చర్చించి, భవన నిర్మాణానికి కృషి చేస్తానని, చెప్పడమైనది. ఈ సమావేశం ద్వారా తిరుపతిలో వెలమ భవనం నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకోవడం అయినది . ⭐త్వరలో పార్టీలకు,ప్రాంతాలకు, వర్గాలకు,అతీతంగా సమావేశం ఏర్పాటు చేసి, భవన నిర్మాణం కొరకు కమిటీ మరియు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడానికి, ఏకగ్రీవంగా ఆమోదించడమైనది. ఈ సమావేశంలో అందరూ వెలమ సంక్షేమ ,అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తామని, ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, ముఖ్య అతిథి ,.పి.వి.ఎన్. మాధవ్ ని అభినందిస్తూ, సత్కరించడం అయినది. జై వెలమ! జై జై వెలమ. వెలమ ఐక్యత వర్ధిల్లాలి.

తేదీ 18-10-2025. పోలీసు కమిషనర్ గారి అదేశాలతో బాణసంచా సామాగ్రి అక్రమ నిల్వల పై నగర వ్యాప్తముగా మెరుపు దాడులు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ వారు ఈరోజు అనగా 18.10.2025 న మధ్యాహ్నం నుండి వారి సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించడం జరిగినది. క్రింద పేర్కొన్న వారు ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచా నిల్వలు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి బాణసంచా సామాగ్రి, స్వాధీనపర్చుకొని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు అప్పగించడమయినది. బాణసంచా సామాగ్రి అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడమైనది. ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన సూరి కిషోర్, 42 సంవత్సరాలు వద్ద 70,000/- రూపాయలు విలువ గల అక్రమ బాణా సంచా స్వాధీనం. ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నగర పోలీసు తరపున, విశాఖపట్నం సిటీ.

తిరుపతి

కిరాణా షాప్ లో చేతి వాటం చూపిన కిలాడి లేడీలు

శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపులో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ఏదో కావాలని అడగగా దుకాణ యజమాని లోపలికి వెళ్లి వచ్చే లోపు ఆ ఇద్దరిలో ఒక మహిళ చేతివాటం చూపి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాను తీసుకొని సంచిలో పెట్టేసి వేరే మహిళ ద్వారా పంపించడం జరిగినది.తరువాత మరో మహిళ కూడా ఏమీ కొనకుండానే వెళ్లిపోవడం జరిగింది.కిరాణా షాపు యజమాని వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ డబ్బా కనిపించకపోవడంతో సీసీ కెమెరా లో పరిశీలించి మహిళల కోసం వెతికిన ఫలితం లేకపోయింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.