Monday, 27 April 2026

Blog

Blog

నంద్యాల నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు :-టిడిపి నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి మండ్ల గుర్రప్ప

దీపావళిను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహిస్తారని గుడివాడ నియోజకవర్గం ప్రజల్లో ఈ దీపావళి నూతన విజయాలను అందించాలని టిడిపి నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి మండ్ల గుర్రప్ప పేర్కొ న్నారు . నంద్యాల ననియోజకవర్గ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల ఇండ్లలో ఈ దీపావళి చీకటిని తొలగించి, వెలుగును ప్రసరింపజేయాలన్నారు. ఈ పండుగ నరకాసురుని వధించిన కృష్ణుడి విజయానికి గుర్తుగా, మరియు లక్ష్మీదేవిని పూజించడానికి ముఖ్యమైన పండుగ గా అందరూ హిందువులు ఆచరిస్తారన్నారు. ఈ దీపావళి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గూగుల్ ఏఐ, క్వాంటం వ్యాలీ ద్వారా అత్యున్నదో ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఖమ్మం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సుఖశాంతులు నిండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అఖండ భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే దీపావళి పర్వదినం అందరికీ సుభిక్షం, ఐక్యతను అందించాలని కోరుతూ, సామాజిక సౌభ్రాతృత్వం బలపడేలా ప్రతి ఒక్కరూ పండుగను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఖమ్మం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సుఖశాంతులు నిండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అఖండ భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే దీపావళి పర్వదినం అందరికీ సుభిక్షం, ఐక్యతను అందించాలని కోరుతూ, సామాజిక సౌభ్రాతృత్వం బలపడేలా ప్రతి ఒక్కరూ పండుగను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దీపావళి సందర్బంగా ప్రత్యేక పూజలు

నెల్లూరు రూరల్ ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ :20. ఈ రోజు దీపావళి పర్వదిన సందర్బంగా గణేష్ ఘాట్ లో వెలసివున్న స్వర్ణ లింగేశ్వరాలయం లో స్వామి వారికి రుద్రాభిషేకలు, పాలాభిషేకం, పంచామృతాలు అభిషేకం, అలంకరణ గుడి అర్చకులు యస్వంత్ శర్మ గారు ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు పూజలు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రాబోయే నాలుగు రోజులపాటు వర్ష సూచన

ఏపీలో రాబోయే నాలుగు రోజులపాటు వర్ష సూచన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ మార్పులను గమనించాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వింజమూరు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి..!

దీపావలి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాల వెలుగులు నింపాలి..జాగ్రత్తలు పాటించి పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి..!రాష్ట్ర ప్రజలందరికీ ఈ దీపావళి పర్వదినం సంతోషాల సంబరం కావాలని, అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని వింజమూరు టిడిపి మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా నరసారెడ్డి ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం మరోసారి వెలుగులదివ్వెలా ప్రకాశించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాది అవుతుందని, ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ కృషి మరువలేనిదని గూడా నరసారెడ్డి అన్నారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక..! కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..! జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు..ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తెలిపారు.టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, తెలుగింటి లోగిళ్లన్నీ దీప కాంతులతో వెలుగులీనాలని, ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని, సరికొత్త వెలుగులతో ప్రజల జీవితాలు మరింత ప్రకాశించాలని ఆకాంక్షించారు.

విశాఖపట్నం

50 ఏళ్ల వయస్సులోనూ బాల్య స్నేహం అదే ఉత్సాహం

– గాజువాకలో హిందుస్థాన్ షిప్ యార్డ్ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల స్నేహసమ్మేళనం గాజువాక, అక్టోబర్ 19: హిందుస్థాన్ షిప్ యార్డ్ జూనియర్ కాలేజ్‌లో టెన్త్‌ క్లాస్‌ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై మళ్లీ కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశం యాదృచ్ఛికం కాదు — తమ స్నేహితుడు బచ్చు వెంకటేశ్వరరావు ఇంట్లో జరిగిన శుభకార్యాన్ని పురస్కరించుకొని ఆయన పూర్వ బాల్య స్నేహితులకు విందు ఇవ్వాలని సంకల్పించడం ఈ స్నేహసమ్మేళనానికి కారణమైంది. యాభై ఏళ్ల వయస్సు దాటినా అందరూ బాల్య ఉత్సాహంతో సమావేశమై, కేరింతలతో పాత జ్ఞాపకాలను పునరావృతం చేసుకున్నారు. “మన స్కూల్‌ డేస్‌ మళ్లీ కళ్లముందు మెదిలిపోయాయి” అంటూ ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు పాత ఫోటోలు, పాఠశాల జ్ఞాపకాలు, ఆటపాటలతో మునిగిపోయారు. “కాలం మారినా మన స్నేహం మాత్రం యథాతథంగానే ఉంది” అని ఒకరు వ్యాఖ్యానించగా, అందరూ స్మితహాస్యాలతో సమ్మతించారు. ఈ సందర్భంలో వారు గురువులను స్మరించి, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమం చివరగా అందరూ ఒకే మాట చెప్పారు — “స్నేహం అంటే వయసుతో కాదు, మనసుతో నిలిచేది.”

తిరుపతి

శ్రీసరస్వతీ శిశు మందిర్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో చాగణం శైలజ

శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా బస్తీ లలో దీపావళి సందర్భంగా టపాకాయలను మరియు స్వీట్స్ ని పంచిపెట్టారు.పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో సేవభావం పెరుగుతుందన్నారు.నైతిక విలువలతో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన చాగణం శైలజ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చాగణం శైలజ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని,అష్టైశ్వర్యాలు కలిగించాలని తెలియజేసారు.ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ముందుకెళ్లాలని,మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని అన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామికి సేవ చేసుకొనే భాగ్యం కలిగించిన రాష్ట్ర,జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగిరెడ్డి,చాగణం.భక్తవత్సలయ్య,సుబ్రమణ్యం రెడ్డి,రాజేష్ వర్మ,ప్రకాష్,పాఠశాల మాతాజీలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం ఒకరి మృతి.. మరో ఇద్దరికి గాయాలు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 వద్ద ఘటన

పున్నమి: అక్టోబర్ 19 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: ఓ అర్అర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పస్నూర్ గ్రామానికి చెందిన చితలూరి గణేష్ (23) నాలుగు నెలలుగా ఎల్బీ నగర్లోని దుర్గా ఫైర్ వర్క్స్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం గణేష్ సహా ఇతర కార్మికులు డీసీఎం వాహనంలో బాణసంచా లోడుతో ఘట్కేసర్ వైపు వెళ్ళారు. అక్కడ బాణసం చా దించుకున్న అనంతరం, మరొక గోదాం ఉన్న మహేశ్వరం వైపు బయలుదేరారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున వారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం 10 వద్దకు చేరుకు న్నారు. అదే సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక లైట్లు లేకుండా రహదా రిపై వాహనాన్ని నిలిపి ఉంచాడు. డీసీఎం డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఆ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డీసీ ఎం క్యాబిన్లో కూర్చున్న గణేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న సతీష్, సందీప్ లకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసు లు ఉస్మానియా మార్చురీకి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.