Monday, 27 April 2026

Blog

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి పార్థివ దేహానికి నివాళులర్పించిన తలపా దామోదరం రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిచేటి మురళి మరణ వార్త విన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని వారికి నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. నివాళులర్పించిన వారిలో తిరుపతి జిల్లా యువజన అధ్యక్షులు సీతారాం, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నాగరాజు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి. బిఎన్.కండ్రిగ సర్కిల్ సిఐ తిమ్మయ్య

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల ప్రజలకు సీఐ తిమ్మయ్య దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని సుఖశాంతులను తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.నూనె దీపాలు వెలిగించి సాంప్రదాయబద్ధంగా పండుకుని జరుపుకోవాలని కాలుష్య రహితంగా పండుగ జరుపుకోవాలన్నారు.అదేవిధంగా ప్రజలందరూ టపాకాయలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ముఖ్యంగా చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి జాగ్రత్త వహిస్తూ టపాకాయలు కాల్చాలన్నారు.దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో,సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేసిర్ కుమార్తె కల్వకుంట్ల కవిత

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఆదివారం దర్శించుకున్నారు.ముందుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వయ్యాల కృష్ణారెడ్డి తదితరులు దక్షిణ గోపురం వద్ద వారికి స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక రాహు కేతు పూజ,స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.

ఖమ్మం

మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు

ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు నిన్నటితో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువును, ఈ నెల 23వ తేది వరకు పొడిగించి, 27వ తేదీన లాటరీ తీయనున్న ఎక్సైజ్ శాఖ ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రానందున, చివరి నిమిషంలో గడువు పొడిగిస్తూ ప్రకటన గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి కేవలం 87 వేల దరఖాస్తులు రావడంతో గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

అనకాపల్లి

శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఘనంగా దన్వంతరి జయంతి వేడుకలు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం (పున్నమి న్యూస్ ప్రతినిధి కె. ఆనంద్ : కన్నుల పండుగగా ధన్వంతరి హెమం ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ కు సన్మానం శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రి నందు ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు, రామసీత దంపతులు, వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల నడుమ ధన్వంతరి హెూమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచన కర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు గారు అతిధులుగా విచ్చేసారు. అతిధులను విద్యార్థులు కోలాటం మరియు వేదపండితులు పూర్ణాహుతి తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ ను చాగంటి కోటేశ్వరావు చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డా|| కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆయుర్వేదం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప సంపద అని, ఆయుర్వేదం మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దారిని చూపే ఒక దిక్సూచి అని, ప్రపంచ దేశాలు కూడా నేడు ఆయుర్వేద వైద్య ఆవశ్యకతను గుర్తించి ఈ వైద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరైన అశేష జనవాహిని తో మాట్లాడుతూ పుస్తకాల ప్రాముఖ్యత ను వివరించారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల జీవిత చరిత్ర చదవడం ద్వారా మనకు మరియు మన శ్రేయోభిలాషులకు కూడా జ్ఞానప్రాప్తి కలుగుతుందని, మానవ శరీరం ఒక అద్భుతమని, మన శరీరంలో మనస్సు ను అధీనంలో ఉంచుకొంటే అద్భుతాలు సృష్టించగలమని, మన శరీరం మనసు రెండూ బాగున్నప్పుడే భావితరాలకు ముందుతరాల విషయసంపద ను అందించగలమని తెలిపారు. గురువు స్వార్థం లేని వ్యక్తి అని ఉన్నత స్థితికి చేరడానికి గురువు ఒక దిక్సూచి అని పలువురు ప్రముఖుల జీవిత చరిత్ర నుండి మనం ఈ విషయాన్నీ గ్రహించి గురువు కి మన జీవితంలో ఉన్నత స్థానం ఇవ్వాలని ఆయన విద్యార్థులకు తెలిపారు. శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు మాట్లాడుతూ ఈ ధన్వంతరి జయంతి రోజున ఆయుర్వేదంలో విశిష్ట సేవలందించిన వారిని సన్మానించడంఎంతో ఆనందదాయకమని, కేరళ రాష్ట్రంలో ప్రసిద్ది పొందిన ఆయుర్వేద వైద్యాన్ని ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నామని అయన తెలిపారు. కార్యక్రమంలో అకామి ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డా|| యు.ఇందూలాల్, సైకలాజికల్ కౌన్సిలర్ అపర్ణ శర్మ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన వైద్యులు డా|| టి.రమేష్ బాబు, డా|| ఎమ్ .ఏ సుమయ్య, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది, శ్రీ ప్రకాష్ ఉపాద్యాయ బృందం ఆయుర్వేదం పై మక్కువ కల్గిన తుని మరియు పాయకరావుపేటకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు….

తేదీ:-19-10-2025నరసన్నపేట పట్టణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే విద్యలో రాణించగలిగితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు తెలిపారు. ఆదివారం నరసన్నపేట ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉన్నత చదువులను బోధించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పాఠశాలలో చదివిన అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా, మండల స్థాయి సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీడీపి మండల కన్వీనర్ & సొసైటీ చెర్మన్ పేలపూడి వెంకటరత్నం…!

*దుత్తలూరు మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీడీపి కన్వీనర్ & సొసైటీ చెర్మన్ పేలపూడి వెంకటరత్నం…! సీఎం చంద్రబాబు నాయుడు గారి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక.! కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..! నియోజకవర్గ మరియు దుత్తలూరు మండల ప్రజలందరికీ దుత్తలూరు మండల కన్వీనర్ మరియు సొసైటీ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక అని మండల కన్వీనర్ పేర్కొన్నారు..ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్లు టిడిపి మండల కన్వీనర్ & సొసైటీ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం తెలిపారు.టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, కోరుకుంటునన్నరు

ఆంధ్రప్రదేశ్

శర్వాణి విద్యాలయం స్కూల్‌ టాపర్‌గా కిల్లి వంశీకి ఘన సత్కారం (నరసన్నపేట – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

నరసన్నపేటలోని శర్వాణి విద్యాలయంకు చెందిన విద్యార్థి కే. వంశీ, ఎస్‌.ఎస్‌.సి 2025లో స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్‌ పాఠశాలల సంఘం (APPSA) ఆధ్వర్యంలో అక్టోబర్‌ 19, 2025న నరసన్నపేటలోని ఎన్‌.ఏ.ఆర్‌. ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన School Topper Award Celebrations కార్యక్రమంలో వంశీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వంశీని హృదయపూర్వకంగా అభినందించారు.వంశీ కృషి, క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అప్సా అధ్యక్షులు, అప్సా అభిమానులు, నరసన్నపేట మండల విద్యాశాఖాధికారులు, నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, వివిధ మండలాల విద్యార్ధినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం నగరము లో దీపావళి సందడి

పున్నమి ప్రతి నిధి దీపావళి పర్వదినం సమీపిస్తుండటంతో ఖమ్మం లోని ఇల్లందు రోడ్డు పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. లక్ష్మీదేవి పూజ కోసం ప్రజలు పూజా సామగ్రి, పూలు, దీపాలు, ప్రమిదలు, బొమ్మల కొలువుల కోసం అవసరమైన వస్తువులను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాలు ప్రజలతో నిండిపోయాయి. ఇల్లందు రోడ్డు జనసంద్రంలా మారింది. ముఖ్యంగా పీజీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల స్టాళ్ల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ దీపావళి సంబరాలకు అవసరమైన వస్తువులు తీసుకునేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళలో దీపాల కాంతులతో ఖమ్మం నగరము లోని ఇల్లందు రోడ్డు విద్యుత్ వెలుగులతో నిండిపోనుంది. దుకాణదారులు కూడా పండుగ సీజన్‌కి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోళ్ల హడావుడి మరింతగా పెరిగింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు. ప్రజల ఉత్సాహంతో ఖమ్మం పట్టణం మొత్తం దీపావళి సందడిలో మునిగిపోయింది. పట్టణంలోని పూల మార్కెట్, టపాసుల స్టాళ్లు, పూజా సామగ్రి దుకాణాలు — అన్నీ ఒక్క పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దీపాల వెలుగులు, పూల సువాసనలు, టపాసుల శబ్దాలతో ఇల్లందు ప్రజలు సంప్రదాయ రీతిలో దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా నక్కా బాలకృష్ణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు నక్కా బాలకృష్ణ నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాసేవా తపనతో, యువతలో చైతన్యం నింపే దిశగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తరింపజేస్తారనే నమ్మకం ఉంది. ఈ నియామకం ద్వారా జిల్లా యువజన విభాగానికి కొత్త ఉత్సాహం లభించనుంది. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయిలను అధిరోహించి ప్రజల సేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అంటూ బొంతు చంద్ర శేఖర్ (చందు) ప్రత్యేక శుభాకాంక్షలు నక్కా బాలకృష్ణ గార్కి తెలియచేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.