ముఖ్య మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం పాలాభిషేకం జరిపారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 3.640 (కరువు భత్యం) డి.ఏ. ను ప్రకటించిన సందర్భంగా నగరంలోని తపోవనం పాఠశాలలో చిత్తూరు జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శి లు డాక్టర్ జయప్రకాష్ నాయుడు,చందనం రామయ్య, ఆర్థిక కార్యదర్శి బాబు రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.











