Tuesday, 28 April 2026

Blog

విశాఖపట్నం

*అమెరికా అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖకు చేరుకున్న ఎంపీ భరత్ కి ఘన స్వాగతం*

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): అమెరికా అధ్యయన యాత్రను విజయవంతంగా ముగించుకొని విశాఖ నగరానికి విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ కి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విశాఖ 35వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు గారు పార్టీ కార్యకర్తలతో కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చ రామిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని భరత్ ని పూలమాలలతో ఆహ్వానించారు. విశాఖ అభివృద్ధికి భరత్ చేస్తున్న కృషిని కార్యకర్తలు ప్రశంసించారు.

ఖమ్మం

లక్ష్మి పురం లో ఇంటి గ్రేటెడ్ రెసిడెన్సీ యల్ స్కూల్ పనుల పర్యవేక్షణ లో ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క

పున్నమి ప్రతి నిధి లక్ష్మీపురం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు స్వయంగా పర్యవేక్షించారు. స్కూల్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు, ప్రాంగణం, సదుపాయాల రూపకల్పనను పరిశీలించిన ఆయన అధికారుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క, నాణ్యమైన మెటీరియల్ వాడాలని, విద్యార్థుల భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. స్కూల్‌ను అనుసంధానం చేసే రహదారుల పనులను వేగవంతం చేయాలని గుత్తేదారులకు ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచి, సమయానికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “విద్య అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన ఆస్తి. తెలంగాణ బిడ్డలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ నిర్మిస్తున్నాం,” అని తెలిపారు. సదుపాయాల పరంగా రాష్ట్రంలో ఈ పాఠశాల ఆదర్శంగా నిలవాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొత్త అవకాశాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం

సత్తుపల్లి లో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజి శాసనసభ్యులు సండ్ర

పున్నమి ప్రతి నిధి సత్తుపల్లి పట్టణంలో ఆనందోత్సాహాల నడుమ జరిగిన వివాహ వేడుకలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టణానికి చెందిన బాణోత్ రాములు – కృష్ణవేణి దంపతుల కుమారుడు కార్తీక్ సాయి – తేజస్విని వివాహం ఇటీవ‌ల ఘ‌నంగా జరిగింది. ఆదివారం నాడు సండ్ర వెంకట వీరయ్య దంపతుల నివాసానికి వెళ్లి నూతన వధూవరులను స్వయంగా అభినందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, యువ దంపతులు సుఖసంతోషాలతో, సాఫల్యమయ జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని, పరస్పర విశ్వాసం, గౌరవం, ప్రేమతో దాంపత్య జీవితం సుసంపన్నంగా సాగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, షేక్ రఫీ, మల్లూరు అంకంరాజు, చాంద్ పాషా, పర్వతనేని వేణు, గుండ్ర రఘు, జొన్నలగడ్డ కృష్ణ, కోట రాజకుమార్ తదితర బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సండ్ర వెంకట వీరయ్య గారిని స్వాగతించి కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో ఈ వివాహ వేడుక శుభ వాతావరణంలో సంతోషంగా జరిగింది.

తిరుపతి

టపాసుల దుకాణాలను పరిశీలించిన డి.ఎస్.పి నరసింహమూర్తి

శ్రీకాళహస్తి పట్టణంలోని దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను శ్రీకాళహస్తి డి.ఎస్.పి కే. నరసింహమూర్తి పరిశీలించారు.ముందుగా ప్రాంగణంలోని టపాసుల దుకాణాల్లోను ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసి ఉన్నారా లేదా ప్రతి దుకాణాన్ని పరిశీలించారు.అనంతరం డిఎస్పి మాట్లాడుతూ నరసింహమూర్తి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రభుత్వ యంత్రాంగం,ఫైర్ సిబ్బంది సిద్ధంగా వున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి,బి.ఎన్ కండ్రిగ సర్కిల్ సిఐ తిమ్మయ్య,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి:

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శ్రీకాళహస్తి: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు, అధికారులు అనధికారులకుమహిళలకు నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మనిషి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటున్నామని తెలిపారు.వెలుగుల కాంతులతో ఈ పండుగ జరుపుకుంటారని,భవిష్యత్ తరాలకి వారికి హిందూ సాంప్రదాయ మూలాలను మరిచిపోకుండా రేపటి తరాల వారికి తెలియజేయాలని కోరారు.అయితే టపాకాయ లు కాల్చే సమయం లో తగు జాగ్రత్త లు పాటించాలని సూచించారు.

తిరుపతి

*శ్రీ కాళహస్తి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన—– కొమారి విజయమ్మ వేణుగోపాల్*

.. *శ్రీ కాళహస్తి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన—– కొమారి విజయమ్మ వేణుగోపాల్* * *టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు నగర మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కోమారి విజయమ్మ, వేణుగోపాల్ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించిన సందర్భంగా నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దేవస్థానంలో శివపార్వతులను దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆలయ ఈవో బాపి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఈ పదవిని అందించిన మంత్రి నారాయణ గారు ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ముందస్తుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కోమరి విజయమ్మ వేణుగోపాల్ ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలియజేశారు*

అన్నమయ్య

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా ఈరోజు ఉదయం పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

కామారెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్ తొలగించాలి: నా.రెడ్డి మోహన్ రెడ్డి

కామారెడ్డి, 19 అక్టోబర్, పున్నమి ప్రతినిధి రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యకలాపాల్లో విద్యుత్ లైన్ అడ్డంకిగా మారినట్లు మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గ్రామంలో నిర్మా ణం పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, తెడ్డు జ్యోతి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, అక్కడ గల విద్యుత్ లైన్ కారణంగా నిలిచిపోయిందన్నారు. ఈ సమస్య ను సంబం ధిత విద్యుత్ అధికారులకు వివరించినట్లు తెలిపారు. ఫలితంగా, ఉన్నతాధి కారులు క్షేత్రస్థాయిలో విచారం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలిపా రు.అధికారులు రెండు విద్యుత్ స్తంభాలను మం జూరు చేయాలని నిర్ణయం తీసుకుని, విద్యుత్ లైన్ తొలగించి పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, నిశాంత్, బండి రవి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

చీకటిని పారదోలె వెలుగుల పండుగ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు BJHPS సోషల్ మీడియా & TDOA మోటార్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దూపం అంజనేయులు

పున్నమి అక్టోబర్ 19 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: సోషల్ మీడియా & తెలంగాణ డైవర్స్ & ఓనర్స్ అసోసియేషన్ మోటర్ ట్రాన్స్పోర్ట్ TDOA వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకటిని పాలద్రోలి వెలుగునిచ్చే దీపావళి ప్రజలు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ పండుగ వేడుక ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు.చిన్నపిల్లల టపాసులు కాల్చే సమయంలో తల్లి తండ్రులు దగ్గరుండి తగు జాగ్రత్తలు పాటించి టపాసులు కాల్చలని సూచించారు.భగవంతుని అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని,సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హైదరాబాద్ మధురానగర్ లో చిరు వ్యాపారులతో టి ఎన్ ఆర్ ఫ్యామిలీ దీపావళి సంబరాలు..!

హైదరాబాద్ మధురానగర్ లో చిరు వ్యాపారులతో టి ఎన్ ఆర్ ఫ్యామిలీ దీపావళి సంబరాలు..! వింజమూరు మాజీ జడ్పిటిసి సభ్యులు,శ్రీ తిప్పిరెడ్డి నారపరెడ్డి, ఆయన కుమారుడు తిప్పి రెడ్డి భరత్ రెడ్డి హైదరాబాదులోని మధురానగర్ లో ఉన్న చిరు వ్యాపారులకు దీపావళి కానుక అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వన్ ఇండియా, వన్ విలేజ్, దీనదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తిప్పిరెడ్డి భరత్ రెడ్డి తో కలిసి సంబరాలు నిర్వహించారు. చిరు వ్యాపారులతో కలిసి కాకర్స్ కాల్చడం తో పాటు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అందరికీ, కాకర్స్ టపాసులతోపాటు, పిండి వంటలు చేసుకునేందుకు, గోధుమ పిండి కూడా అందజేశారు. ఈ సందర్భంగా తిప్పిరెడ్డి నారపరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వింజమూరులోని జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో దీపావళి సంబరాలు నిర్వహించే వారిమని ఈ ఏడాది అందుబాటులో లేనందున, స్వగ్రామంలో చేయలేక హైదరాబాదులో చేశామని తెలిపారు. పేదవారిని ఆదుకునేందుకే తండ్రి కొడుకులం ఇద్దరం చారిటబుల్ ట్రస్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ట్రస్టు ద్వారా అనేక మందిని ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పిరెడ్డి ఆ యుత్, తిప్పిరెడ్డి హాసిని, సన్నీ తదితరులు ఉన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.