Tuesday, 28 April 2026

Blog

ఖమ్మం

బీసీ బంద్ లో బీజేపీ నాయకులు మీద కాంగ్రెస్ నాయకులు దాడి. దాడి లో గాయపడిన వారిని పరమర్శించిన జిల్లా కమిటీ

పున్నమి ప్రతి నిధి బీసీ బంద్ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు అమానుషంగా దాడి చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ దాడిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయ్, బీజేపీ నాయకుడు నాయుడు రాఘవ గాయపడినట్లు సమాచారం. గాయపడిన నాయకులను బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆసుపత్రిలో పరామర్శించి, వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనమవడంతో ప్రజల మద్దతు కోల్పోయింది. అందుకే భయంతో దాడులకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ఇది అంగీకారయోగ్యం కాదు. దాడికి పాల్పడిన వారిపై పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి” అని హెచ్చరించారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవి రమేష్, సుదర్శన్ మిశ్ర, వీరమ్రాజు నంబూరి రామలింగేశ్వరరావు, దొంగల సత్యనారాయణ, గుత్త వెంకటేశ్వర్లు, బోయినపల్లి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, బీసీ హక్కుల కోసం జరుగుతున్న న్యాయమైన బంద్‌కి బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని, ప్రజల సమస్యలను అణగదొక్కే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా బంద్ నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు హింసకు తెగబడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడిచి, బీసీల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, ప్రజాస్వామ్య హక్కులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందన హర్షణీయం — ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు వెలుగోటి మధు*

దీపావళి కానుకగా నవంబర్ నెల నుంచి ఒక డిఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడం, ఆర్‌టీసీ ఉద్యోగుల ప్రమోషన్‌లపై వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఏపీ ఎన్జీవోస్ వింజమూరు తాలూకా (కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలు) అధ్యక్షులు వెలుగోటి మధు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి పండుగకు ముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం, ముఖ్యమంత్రితో మరియు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో జరిగిన స్నేహపూర్వకమైన, గౌరవప్రదమైన, హుందాతన చర్చలు — దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో జరగడం — సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. చైల్డ్ కేర్ లీవ్‌పై ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన మహిళా ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్యాకేజీ రేట్లు పెంచడం, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పరిమితిని ₹50,000 నుండి ₹1,00,000కి పెంచడం, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమయ్యేలా చూడటం, వైద్య సేవల సీలింగ్‌ను ₹2 లక్షల నుండి ₹5 లక్షల పైబడేలా పెంచడం, అలాగే ఆరోగ్యశ్రీ (EHS) విధానాన్ని ఇన్సూరెన్స్ మోడల్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని కమిటీకి ఆదేశించడం — ఇవన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లలో ఆనందాన్ని కలిగించే నిర్ణయాలుగా పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు, ఎన్‌జీవో హోమ్‌లను గతంలో మాదిరిగానే ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయించడం, అలాగే చెల్లించవలసిన బకాయిలను రద్దు చేయడం కూడా హర్షణీయమని తెలిపారు. దీపావళికి ముందే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుబట్టి, ఆ సమావేశాన్ని సాధించగలిగిన ఏపీ జేఏసీ స్టేట్ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి. రమణ గారికి ఉద్యోగ సంఘాల తరఫున అభినందనలు గవర్నమెంట్ ఉద్యోగుల తరుపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. పిఆర్సి కమిటీ ఏర్పాటు విషయంలోనూ, 57వ మెమో ప్రకారం సుమారు 11,000 మంది ఉద్యోగులను ఓపిఎస్ (OPS) పద్ధతిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడాన్ని కూడా జేఏసీ హర్షించింది. మిగిలిన సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల సాధనలో ఇది మొదటి అడుగు మాత్రమేనని, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ వార్డు సచివాలయాల నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ రంగ సంస్థల వయోపరిమితి 60 నుంచి 62 పెంచడం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయడం, మిగతా అన్ని అంశాల పరిష్కారం కోసం మా Apngo స్టేట్ అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ రమణల నాయకత్వంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, వైజాగ్ శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, చీఫ్ సెక్రటరీ శ్రీ కే. విజయానంద్ గారికి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ ఎన్జీవోస్ మరియు ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని వింజమూరు తాలూకా apngo అధ్యక్షులు వెలుగోటి మధు తెలిపారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ ఎస్పీకి ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు

*జాతీయ మానవ హక్కుల* *కమిషన్ కు పిర్యాదు చేసిన డా.జగన్ గౌడ్* *అడ్వకేట్..సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబెర్..* *నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల సి.ఇ విష్ణువర్ధన్ రెడ్డి పైన పిర్యాదు..* *జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా సుపెరడెంట్ కి నోటిసులు జారీ……* *తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సిఐ అధికార దుర్వినియోగం గురించి 17/10/2025న కమిషన్ కు* *ఫిర్యాదు అందింది. దీనిని అనుసరించి కమిషన్ ఈ క్రింది విధంగా ఆదేశించింది:* *ఫిర్యాదుదారుడు డా జగన్ గౌడ్ న్యాయవాది,* *సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ మెంబెర్,* *04.10.2025న వెల్దండ పోలీస్ స్టేషన్ లో ABVP విద్యార్థి నాయకుడు గేజ్ హరిప్రసాద్ ను అవమానించి, శారీరకంగా దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ CI* *విష్ణవర్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.* *పెద్దాపూర్ గ్రామంలో స్థానిక* *కాంగ్రెస్ నాయకులు పండుగ ఫ్లెక్స్* *బ్యానర్లను తొలగించడంపై* *వివాదం తర్వాత ఈ సంఘటన జరిగింది CI పై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం* *మరియు విద్యార్థి మానవ హక్కులు మరియు గౌరవాన్ని ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.* *ఆ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి మరియు ABVP సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.* *ఫిర్యాదు కాపీని ఆన్‌లైన్ మోడ్ ద్వారా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నాగర్ కర్నూల్, తెలంగాణలోని నాగర్ కర్నూల్ కు పంపించి, అవసరమైన చర్యను నిర్ధారించి, నాలుగు వారాల్లోగా కమిషన్ కు చర్యలు తీసుకోవాలని కోరుతూ, చర్య నివేదికను సమర్పించాలి అని తెలిపారు..*

విశాఖపట్నం

తెలంగాణలో 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఏపీ మహిళ!*

ఏపీతో పాటు యూపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా టెండర్లు వేసిన వైనం శనివారం ఒక్కరోజే 30వేలకు పైగా దాఖలైన దరఖాస్తులు ఈ నెల 23న డ్రా ద్వారా మద్యం లైసెన్సుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రంలో 150 మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో టెండర్లు భారీగా దాఖలయ్యాయి. శనివారం ఒక్కరోజే 30 వేలకు పైగా దరఖాస్తులు అందగా, మొత్తం సంఖ్య 90 వేలు దాటినట్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గత నెల 27న టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల గడువు ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 23న డ్రా ద్వారా లైసెన్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ఏకంగా 150 దుకాణాలకు దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం విశేషంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వ్యాపారులు, పెట్టుబడిదారులు, మహిళలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడం రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది

ఖమ్మం

పెనుబల్లి మండలం లో బీసీ బంద్ విజయవంతం

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో బీసీ సంఘాల పిలుపుతో జరిగిన బంద్ ఘనవిజయం సాధించింది. బీజేపీ, తెలంగాణా రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), తెలుగు దేశం పార్టీ (టీడీపీ), కాంగ్రెస్, సీపీఏం, ఎంఆర్ఎపీఎస్ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బంద్‌కు మద్దతు తెలుపడంతో మండల వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బంద్ సందర్భంగా స్థానిక నేతలు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించి బీసీ వర్గాల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు బొర్రా నరసింహరావు, బీఆర్ఎస్ నేత చెక్కిళ్లాల మోహన్‌రావు, సీపీఏం నాయకుడు చాలామల విఠల్‌రావు, ఎంఆర్ఎపీఎస్ ప్రతినిధులు కొలికపోగు వెంకటేశ్వరరావు, తోట ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు పంది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బంద్ పూర్తిగా శాంతియుతంగా సాగింది. ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు బీసీ సమాజాల సమస్యలపై ఐక్యతతో స్పందించారు. నేతలు మాట్లాడుతూ, బీసీ వర్గాల రాజకీయ ప్రాధాన్యాన్ని గుర్తించి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లా లో బీజేపీ జెండా ఎగురవేయాలి. బిజెపి రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు :బీజేపీ జిల్లా నూతన కమిటీ కి అభినందనలు

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు గారు నూతన పదాధికారులను అభినందిస్తూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నూతన కమిటీదేనని పేర్కొన్నారు. ప్రజలతో సమీపంగా ఉండి, బీజేపీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి మండలంలో బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని గోంగూర వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీదేవి, టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ, నాయకులు రవి గౌడ్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ సారధ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ మరింత శక్తివంతమవుతుందని, ప్రజల విశ్వాసం గెలుచుకుంటుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

అన్నవరంలో ఏ బీ సీ వర్గీకరణ విజయోత్సవ సభ ముఖ్య అతిథులు హోం మంత్రి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ.

పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ): ఎలమంచిలి నియోజవర్గం : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అన్నవరంలో ఈ నెల 29 వ తేదీ అనగా బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏ బి సి వర్గీకరణ విజయోత్సవ జరుగుతుందని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివమణి మాదిగ తెలియజేశారు. ఈ సందర్భంగా శివమణి మాదిగ మాట్లాడుతూ అన్నవరంలో జరిగే విజయోత్సవ సభకు మాదిగలు, రెల్లి సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ విచయిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మనకున్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే మన ముఖ్య ఉద్దేశం. అలాగే అతిథులుగా వస్తున్న నాయకులు మన సమస్యల మీద మాట్లాడుతూ మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ పలివేల శివ మాదిగ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ ఎస్పీకి* *ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు*

*నాగర్ కర్నూల్ ఎస్పీకి* *ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు* వెల్దండ సిఐ వ్యవహారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం నాగర్ కర్నూల్ అక్టోబర్ 19 పున్నమి న్యూస్ నాగర్ కర్నూల్ ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) నోటీసులు జారీ చేసింది ఏబీవీపీ నేత హరి ప్రసాద్ గౌడ్ ను వెల్దండ సీఐ ఉద్దేశపూర్వకంగా అవమానించాలని శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్ జగన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు పెద్దాపూర్ గ్రామంలో ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో సీఐ ఇష్టానుసారంగా వ్యవహరించాలని చెబుతూ దానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు. పేపరు క్లిప్పింగ్లను జత చేశారు జగన్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సి నాగర్ కర్నూల్ ఎస్పీకి నోటీసులు ఇచ్చింది ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోలీస్ అమరవీరుల మెగా రక్త దాన శిబిరం లో పాల్గొన్న చినమాచనురు గ్రామస్తులు

పోలీస్ ఆధ్యర్యంలో మెగా రక్త దాన శిబిరం లో ఆత్మకూర్ సబ్ డివిజన్ ప్రాంగణంలో నిర్వహించారు ,కార్యక్రమంలో షేక్ గరిబ్ , ఆ గ్రామ ప్రజలు , యువకులు , ఉత్సవంతులు పాల్గొన్నారు మర్రిపాడు ఎస్ ఐ కాసుల శ్రీనివాసులు పిలుపు మేరకు పంచాయితీ గ్రామస్తులు, సేవా స్పూర్తి తో ముందుకు వచ్చి , మెగా రక్తదాన శిబిరం కు పాల్గొన్నారు అమర వీరుల త్యాగానికి స్మరించు కొంటు సమాజానికి మేలుచేయాలనే సంకన్పాలంతో నే యువత రక్త దాన చేయడం స్పూర్తి దాయకమని పేర్కొన్నార్ ఇలాంటి కార్యక్రమంలు ఇంకా మరెన్నో చేసుకోవాలని వారు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.