Tuesday, 28 April 2026

Blog

E-పేపర్

లంచం తీసుకుంటూ ఏ సి బికి దొరికిపోయిన అధికారి

పున్నమి అక్టోబర్ 18రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్: “ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్ లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని హిమాయత్ సాగర్ సెక్షన్‌లోగల గంధంగూడ సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు – అమర్ సింగ్. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

సత్యసాయి

తుమ్మల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామికి ఘనంగా ప్రత్యేక పూజలు.

అమడగూరు: మండలంలోని తుమ్మల గ్రామం,కొత్తపేట సమీపంలోని తుమ్మల కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక్కపొద్దుల సందర్భంగా నాలుగోవ శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.సుమారు 200 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనంతో కృతార్థులయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ప్రాంతంలోని అనేకమంది భక్తులు తిరుమలకు వెళ్లలేని పరిస్థితుల్లో తుమ్మల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తమ కోరికలు తీర్చించుకుంటున్నారు.ముఖ్యంగాకల్యాణయోగం మరియు సంతానయోగం కోసం స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఉందన్నారు.కుటుంబ సమేతంగా భక్తులు వచ్చి తలనీలాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత అని తెలిపారు.ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణను గువ్వల క్రిష్టప్ప బిల్డర్ కొత్తపేట వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేశారు.స్వామివారి కృప ఫలితంగా ఇది సాధ్యమైందని కృతజ్ఞతా భావంతో అన్నప్రసాదం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం నాలుగు వారాలపాటు స్వామివారి సేవలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రాబోయే సంవత్సరం కూడా ఇలాగే మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యంగా కొండ కింద షెడ్ నిర్మాణం జరుగుతున్నాయని వాటికి దాతలు సహకారం అవసరమని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసులు,బిల్లూరు మహేశ్వర్ రెడ్డి,రామనేని రామచంద్ర,సరళమ్మ,అరుణ్,అనంత,ఆదిమూర్తి,రామ్మోహన్,ఈశ్వరయ్య,పూజారి రమణ,తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి

స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం.

అమడగూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మండల అధికారులు పేర్కొన్నారు.మండలంలో స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను శనివారం ఎంపీడీవో మునెప్ప,పంచాయతీ కార్యదర్శి మమత ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెలలో మూడో శనివారంను స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు.స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించి స్వేచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.అనంతరం కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు.అనంతరం కార్యాలయాలు,పాఠశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప,ఎంఈఓ జిలాన్ భాష,పంచాయతీ కార్యదర్శులు మమత,ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సత్యసాయి

క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసానికి దోహదం.

అమడగూరు: క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసానికి దోహదడతాయని,క్రీడా స్ఫూర్తితో పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని మండల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప పేర్కొన్నారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్థానిక పాఠశాల,ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు.ముందుగా అధికారులు,ఉపాధ్యాయులు జట్లకు శుభాకాంక్షలు తెలుపుతూ టాస్ వేసి క్రీడను ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ…ఈ క్రీడలలో మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను,కదిరి డివిజన్ స్థాయికి పంపిస్తామని,డివిజన్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా,రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడ ఉపాధ్యాయులు మునెప్ప,లక్ష్మీనరసమ్మ,పంచాయతీ కార్యదర్శి మమత,ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపునకు జన విజ్ఞాన వేదిక చెకుముకి పరీక్ష.

అమడగూరు: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపునకు నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్‌ పరీక్షలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డి.నరసారెడ్డి పేర్కొన్నారు.శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ పరీక్షలను నాలుగు స్థాయిలలో విద్యార్థులకు నిర్వహించి మండల స్థాయికి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.అనంతరం నవంబర్ 1న మండల స్థాయి,నవంబర్ 23న జిల్లాస్థాయి,డిసెంబర్ 12న రాష్ట్రస్థాయి లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమణరెడ్డి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఇదీ BC రిజర్వేషన్ కాదు…….

అని అమిత్ షా గారు వివరించేదాకా ఎవరికి తెలియలేదు *BC ల ముసుగులో ముస్లిం లకు ఇచ్చే రిజర్వేషన్ లు..* ఆల్రెడీ, తెలంగాణ *2004 నుండి ముస్లిం లు బీసీ రిజర్వెషన్ తో AIIMS వైద్య కాలేజీ లల్లో ప్రెవేశం పొందడాన్ని అమిత్ షా గారి దృష్టికి వచ్చింది* ముస్లిం వారికీ ఉర్దూ మీడియమ్ మాత్రమే aiims లో ప్రవేశలు ఎలా…? వైద్యం లో ఉర్దూ ప్రవేశ పెట్టేలా వ్యూహం తీసుకవచ్చారు తెలంగాణ నుండి ఇక 2040 నాటికీ బోధకులు వారే నిపుణులు వారే 1) BC లకు 27 % రిజర్వేషన్ ఉంది.. 2) ఇప్పుడు ఇచ్చేది – 5% 3) ముస్లిం లకు ఇచ్చేది – 10%. 4) మైనారిటీ రిజర్వేషన్ 4% ఆల్రెడీ ఉంది అంటే, *అమిత్ షా గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రచారానికి వచ్చి బీసీ రిజర్వెషన్ లల్లో ముస్లింలు చొరబడిన విషయాన్నీ ప్రజలకు కాంగ్రెస్ పాలకులు తెలియనియలేదు* 2004 లో వై ఎస్ ఆర్..బీసీ లల్లో ముస్లిం లను జోప్పించి 32 శాతం నుండి 27 కు తగ్గించినారు …….మళ్ళీ కెసిఆర్ 22 కు తగ్గించిన్నారు…? అంటే 10 శాతం ముస్లిం లకు ఉంది ఇంకా పెంచే 42 శాతం లో 20 శాతం ముస్లిం లకు ప్రధాన భాగం కావున బీసీ లు ముస్లిం రిజర్వేషన్ కోసం కొట్లాడాలి సీఎం రేవంత్ రెడ్డి HYD city పోలీస్ నియామకలల్లో 100 లో 57 మంది ముస్లిం లకు ఉద్యోగా నియామక పత్రాలు అందజేసినారు *ముస్లిం లకు 10% రిజర్వేషన్* ఇవ్వడానికి, BC రిజర్వేషన్ అనే పేరు తో ఒక పార్టీ ఆడుతున్న డ్రామా. *ముస్లిం లు ఈ దేశాన్ని 800 ల సంవత్సరాలు పాలించారు..* ఏనాడు వివక్ష కు గురి కాలేదు.. మరి, ముస్లిం లు BC లు ఎలా అవుతారు.. BC రిజర్వేషన్ పేరు తో ముస్లిం లకు 10% రిజర్వేషన్ లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా.. వారికి ఆల్రెడీ 4% మైనారిటీ రిజర్వేషన్ ఉంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి BC రిజర్వేషన్ లు అనే డ్రామా ఆడుతున్న పార్టీ లు/ సెక్యూలర్. BC మేధావుల బ్యాచ్., ముస్లిం లను, BC లలో. కలిపితే, *భవిష్యత్తు జరిగే పరిణామాల గురించి ఆలోచన* లేకుండా మద్దత్తు ఇస్తున్న కొంతమంది బాగా తెలివికళ్ళ బిసి మేధావులు.. అందుకే, మన Socalled, Self. Declared. BC మేధావులను, BC నాయకులను తెలివిగా, ముందు పెట్టినారు.. ముస్లిం లు. మాత్రం సైలెంట్ గా ఉన్నారు.. మన BC నాయకులు, BC లకు తామే ప్రతినిధులం. అంటూ, Self declare చేసుకొని, ముస్లిం లకు 10% రిజర్వేషన్ లు ఇవ్వడానికి, BC రిజర్వేషన్ అంటూ, తెగ హంగామా చేస్తున్నారు.. ముందు, 800 సంవత్సరాలు పాలించిన ముస్లిం లు, మైనారిటీ హోదాలో అనేక హక్కులు అనుభవిస్తున్న ముస్లిం లు, మనలను కాఫీర్ లు అనే ముస్లిం లు,, ఎలా BC లు అవుతారో, *ముస్లిం ల రిజర్వేషన్ ల కోసం, BC లను పణంగా పెడుతున్న* Socalled BC మేధావులు/ నాయకులు చెప్పాలి…కాకతీయుల పాలనా తరువాత కాకతీయుల 2400 వందల మెట్ల బావులను కబ్జా చేసి *1275 సంవత్సరo లో ఘోరి ల పాలనా మొదలైనది కేవలం 50 సం రాలు ఉంది* క్రమంగా యాదవురాజుల పాలనా శాలివాహనుల పాలనా మొగల్ సామ్రాజ్యం లో భాగంగా నిజాం పాలనా బ్రిటిష్ అధీనం లో క్రమంగా ఘోరి ల పేరుమీద రికార్డు లు నమోదుని కాంగ్రెస్ పాలనా నేటి వరకు కొనసాగిస్తున్నది కానీ 1275 నాటి ఘోరి ల పాలనకు నేడు కూడ 2025 లో కూడ ఘోరి లు పుట్టుకు వస్తున్నారు …. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధాలల్లో ఉన్న వారు కూడ ఘోరి ల వారసత్వం కొనసాగింపుగా వస్తున్నారు ఇదే ఇపుడు బీసీ లకు కాంగ్రెస్ శాసనంగా మారబోతున్నది…

తిరుపతి

రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి

శ్రీకాళహస్తి, ఏర్పేడు అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు సబ్యుడు మద్దిల గురుమూర్తి శనివారం నాడు ఎంపీ ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ… ఏర్పేడు రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం కలుగుంతన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023 లో రూ.98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వెంకటగిరి రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడి బ్రిడ్జ్ నిర్మాణపనులను వేగవంతంగ పూర్తి చేసి బ్రిడ్జ్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బ్రిడ్జ్ పూర్తయితే ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, ఇటు ప్రయాణికులకు, అటు వ్యాపారులకు సరుకు రవాణాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన తన అభిమతం తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి చేస్థానాని ఎంపీ పేర్కొన్నారు.

విశాఖపట్నం

ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ దేయ్యం గండి బాబ్జి

*ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం* *జిల్లా టిడిపి అభ్యర్థులు గండి బాబ్జి* విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా జిఎస్టి సంస్కరణలు చేసిన నేపథ్యంలో ఏయూ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా భాగ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా క్షేమానికి శ్రేయస్సుకి కట్టుబడి ఉందని అన్నారు . అందులో భాగంగానే జిఎస్టి సంస్కరణలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు చేసిన ర్వాత వినియోగదారులు కొనుగోలు ఎక్కువగా చేస్తున్నారని తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగం పడుతుందని చెప్పారు.ఎగ్జిబిషన్ కి వచ్చిన వినియోగదారులను వ్యాపారస్తులను ధరలు సంస్కరణలు చేయకముందే ఎలా ఉన్నాయి చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అని మాట్లాడినప్పుడు వినియోగదారులు వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాన్ని బాబ్జి నడిపి పరిశీలించారు

విశాఖపట్నం

క్వాంటం కంప్యూటింగ్ పై వర్కుషాప్

*మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్ పై వర్క్ షాప్* – *అక్టోబర్ 27 నుంచి 31 వరకు నిర్వహణ* – *పోస్టర్ ఆవిష్కరించిన ఏయు విసి* విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ఆంధ్ర విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ *విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదు రోజుల వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ ను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.* రాష్ట్రీయ ఉచ్చత శిక్షా అభియాన్ (రూ. 2.0) సహకారంతో మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో “”క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ”” అనే అంశంపై ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీస్ పై ప్రాథమిక అవగాహన కల్పించడం, క్వాంటం అలగారిదం, క్వాంటం కమ్యూనికేషన్ క్రిప్టోగ్రఫీ, ప్రోటోకాల్స్ పై విస్తృతమైన జ్ఞానాన్ని అందించడం ఈ వర్క్ షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యావేత్తలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నడిపించే దిశగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఈసీఈ విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ వర్క్ షాప్ లో భాగం కావచ్చు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఏఐఎం-ఎల్ రంగాలలో పనిచేస్తున్న వారు సైతం ఈ వర్క్ షాప్ లో పాల్గొనడానికి అర్హులు. *పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, సదస్సు కన్వీనర్, గణిత శాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి. అనురాధ కామేశ్వరి, కో కన్వీనర్లు ఆచార్య పి.డి.ఎ.న్. శ్రీనివాసు, ఆచార్య జి. నానాజీరావు, రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగం డీన్ ఆచార్య వి.వల్లి కుమారి తదితరులు పాల్గొన్నారు.*

విశాఖపట్నం

ప్రణాళిక తొ నాయకత్వ వికాసం

*సృజనాత్మకత, ప్రణాళికతో నాయకత్వ వికాసం* విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *సృజనాత్మకత, పటిష్ట ప్రణాళికతతో నాయకత్వ వికాసం సాద్యపడుతుందని ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులు, ఐఐటీ భువనేశ్వర్ పూర్వ డైరెక్టర్, ఆర్ జియుకటి (ఐఐఐటి) వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య ఆర్.వి రాజ కుమార్ అన్నారు.* ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్ప వాలలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో “ఒక ఆదర్శ విశ్వవిద్యాలయాన్ని సృష్టించడంలో నాయకత్వ సవాళ్లు మరియు సంతృప్తికరమైన అనుభవాలు అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత, దూరదృష్టితో పనిచేసే తత్వం కలిగి ఉండాల ని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య ను అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్. జి.యు.కె.టి ల స్థాపన, అభివృద్ధి చేసిన విధానం, తొలి నాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లు. ప రిమిత వనరులతో పనిచేస్తూ పనిచేసిన విధానం వివరించారు. సాధారణ బోధనకు భిన్నంగా వీడియో లెక్చర్స్, హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అమలు చేసిన విధానం తెలియజేశారు. రూరల్ క్యాంపస్, పరిమిత వనరులు కలిగి ఉన్నప్పటికీ వీటిని నిర్మించిన విధానం నాయకత్వానికి ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు. కోర్సుల రూప కల్పన, బోధన తరగతుల నిర్వహణ, ఇంటర్న్ షిప్లు, పెరఫార్మింగ్ ఆర్ట్స్ లెక్చర్స్ అందించిన విధానం విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ జరిపిన బోదనను తెలియజేశారు. జాతీయ విద్య విధానంలో పేర్కొన్న మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్, స్థానిక, జాతీయ సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ వారసత్వం, ఇంటర్న్ షిప్లు కల్పన, పరిశ్రమ లతో అనుసందానం చేయడం, మానవ విలువలకు ప్రాధాన్యం కల్పించడం, జీవన నైపుణ్యాల ను అందించడం, వృత్తిపరమైన శిక్షణ కల్పించడం వంటివి నాడు రాము అమలు చేసిన విధానం కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రయోగశాలలు తీర్చిదిద్ది విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించడం, దేశంలోని అత్యుత్తమ ఐఐటిలతో సమానంగా ఇంటర్న్ షిప్లులు దేశంలో, ఇతర దేశాలలో అందించిన సందర్భాలను తెలియజేశారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య విధానం అందించిన ఫలితాలు, తొలిబ్యాచ్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో సాధించిన విజయాలు ఎంతో సంతృప్తిని కలిగించాయన్నాడు. *ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్ధిగా, ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులుగా సేవలందించిన ఆచార్య రాజ కుమార్ తో త నకున్న అనుబంధాన్ని వివరించారు.* ఐఐటి ఖర్గపూర్లో ఆయనతో కలసి పనిచేసిన సంధ ర్బాలను తెలియజేశారు. అడిగిన వెంటనే ఏయూలో ప్రత్యేక ప్రసంగం అందించడానికి విచ్చేసిన ఆచార్య రాజ కుమార్ను ఏయూ తరపున సత్కరించారు. *ఏయూ అవుట్ట్ డీన్ ఆచార్య డి. లలిత భాస్కరి కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ముఖ్య అతిథిని సదస్సుకు పరిచయం చేసారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జి. శశిభూషణ రావు, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్.పద్మశ్రీ మరియు డీసీలు ఆచార్య ఆనంద గజపతి రాజు, ఆచార్య సాల్మన్ టెన్ని, ఆచార్య పి. వెంకట రావు, పెద్దసంఖ్యలో ఆచార్యులు, పరిశోదకులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.