విశాఖ నీ అడ్డా నా?చంద్రబాబు
విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *విశాఖ.. నీ అడ్డానా? చంద్రబాబు* ! * *పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే.. ప్రాణ త్యాగాలకైనా సిద్ధం*… * *అభివృద్ధికి వైసిపి వ్యతిరేకం కాదు* ! * *ప్రజలను మోసం చేస్తూ.. విశాఖను నాశనం చేస్తే సహించం* * *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* నేల, నీరు, ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చెయ్యడానికి ఈ ప్రాంతం నీ అడ్డానా చంద్రబాబు అంటూ. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ఆసీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో వాసుపల్లి గణేష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, నారా లోకేష్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు నమ్మి మీకు ఓటు వేసారని, కేవలం ఐదేళ్ల పాలనకు మాత్రమే మీకు ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ప్రాణ త్యాగాలకైనా వెనకాడమని అన్నారు. పశ్చిమ దేశాలు తెలివిగా విసిరి కొట్టిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ప్రశాంతమైన విశాఖ నగరానికి తీసుకురావడాన్నీ వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖ నగరానికి అవసరాలకు సమానమైన రోజుకు 2500 మెగా వాట్స్ విద్యుత్తు అవసరమన్నారు. ఈ డేటా సెంటర్ లో టెక్నికల్ ఎటువంటి సమస్య వచ్చినా ఇతర ప్రాంతాలలో ఉన్న సిబ్బందితో పరిష్కరించుకుంటారు తప్ప, స్థానికంగా ఉద్యోగాలు ఈ సంస్థకు అవసరం లేదన్నారు. 1.8 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని లోకేష్ చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని వాసుపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ మాటలు నమ్మే ప్రసక్తి లేదని, నిజంగా ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారో చిత్తశుద్ధి ఉంటే గూగుల్ ప్రతినిధి సుందరం పిచ్చయ్యతోని ప్రకటించాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. జగన్ హయాంలో 23 వేల ఉద్యోగాల భర్తీ కి పారదర్శకమైన లింక్డ్ అప్రూవల్ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నారు. నిజంగా 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తే తాము ప్రాణాలు సైతం అర్పిస్తాం అని స్పష్టం చేశారు. ఎటువంటి ఉద్యోగ కల్పన చేయలేని డేటా సెంటర్ కి 22 వేల కోట్లు సబ్సిడీలను ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఐదు టీఎంసీల వాటర్ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంతా ఐదువంతులు నీరు ఈ డేటా సెంటర్కు అవసరమన్నారు. దానిలో 20% వేస్ట్ వాటర్ ను ఎక్కడ వదులుతారని ప్రశ్నించారు. నాయిస్ పొల్యూషన్ తో పాటు దేశవ్యాప్తంగా 495 డిగావాట్స్ విద్యుత్ అవసరమైతే కేవలం ఈ డేటా సెంటర్కు ఒక డిగా వాట్స్ విద్యుత్తు అవసరం అవుతుందన్నారు. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ సంస్థ వద్దని నిపుణులు మీకు సూచించలేదా చంద్రబాబు అంటూ వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి 50 కోట్ల కేజీల కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తాదని, అంటే పదివేల కోట్లు కార్లు వదిలే కార్బన్డయాక్సైడ్ తో సమానం అన్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 60 లక్షలు చెట్లు ఉండాలన్నారు. నారా లోకేష్ చంద్రబాబు 10 లక్షల కుటుంబాలు కాల్చే కరెంటును ఒక్క డేటా సెంటర్కు రాయితీతో కూడిన విద్యుత్, నో రిజిస్ట్రేషన్ ఫీజు, నో జిఎస్టి.. విశాఖ నేల నీరు అప్పనంగా దారా దత్తం చేస్తావా చంద్రబాబు అంటూ వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎకో సిస్టం. నాశనం చేసే మీ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు చేసే అభివృద్ధి చెయ్యాలని వాసుపల్లి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షులు, దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ పచ్చిరపల్లి రాము,జిల్లా ఆర్.టి.ఐ సెక్రటరీ అరుగుల రాజు,స్టేట్ ఆర్.టి.ఐ సెక్రటరీ దస్మాంతుల చిన్ని,స్టేట్ మేధావుల విభాగం సెక్రటరీ ఈతలపాక విజయ్,27వ వార్డ్ అధ్యక్షులు సర్వేశ్వరరెడ్డి,30 దశమంతుల మాణిక్యాలరావు,37వ వార్డ్ అధ్యక్షులు గంగళ్ల రాంరాజు,38వ వార్డ్ అధ్యక్షులు గురజాపు రవి,39వ వార్డ్ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, స్టేట్ సంస్కృత విభాగమ సెక్రెటరీ కంటుముంచు సాగర్ ,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ,దస్మాంతుల సంతోషి,వేణు, బాలకృష్ణ,చోడిపిళ్లి శివ, కొండా రామ దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.











