Tuesday, 28 April 2026

Blog

హైదరాబాద్

బంద్‌లో రక్తపాతం..!

తెలంగాణాలో జరిగిన ఈ రాష్ట్రవ్యాప్తంగా బంద్ గురించి ముఖ్యాంశాలు తెలుగులో ఇలా ఉన్నాయి: 📌 ప్రధాన కారణం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీల (బ్యాక్‌ వార్డెడ్ క్లాసెస్ = BC) కోసం 42 % రిజర్వేషన్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో అందించాలని డిమాండ్ చేస్తూ బంద్ ఆహ్వానించారు. దీనికి సమరం కాల్పించినది: Telangana High Court ఒక ఉత్తర్వులతో (GO No.9) BCలకు 42 % రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశంపై అంతరాయంగా (‘ఇంటరిమ్ స్టే’) ఆదేశించింది. బంద్‌కు ముఖ్య రాజకీయ పార్టీలు-లు మద్దతునిచ్చాయి, ఇలా అన్నిపక్షాలూ, వర్గసంఘాలూ భాగస్వామ్యం అయ్యాయి. — 🕒 బంద్ పరిస్థితులు & ప్రభావాలు బంద్ రోజు: 2025 ఆక్టోబర్ 18 వ తేదీన ఈ ఉద్యమం జరిగింది. బంద్ కారణంగా రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్, బస్సు సేవలు పెద్దగా నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రహదారుల వెంట బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. ప్రారంభ సమయంలో జరిగిన వివరాలు: హైదరాబాద్‌లో కక్కన్ బస్సు డిపోలు, MGBS, రాథిఫైల్, అంబర్‌పేట్ లాంటి ప్రధాన డిపోల వద్ద బస్సులు బయిల్లోకి రాలేదని సమాచారం ఉంది. ప్రజల ప్రయాణం సమస్యలో పెట్టుకుంది: బండ్ల నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో లేకపోవడంతో క్యాబ్-ఆటో డ్రైవర్లు ఉన్నత ధరల్ని వసూలు చేస్తున్నారని వార్తలున్నాయి. — 🧭 అధికారుల స్పందన ‏DGP కలిగి ఉన్న అధికారులు బంద్ సడలకుండా, నిర్భయంగా జరగాలని కోరారు. బంద్ సమయంలో అత్యావశ్యక సేవలకు (ఆమ్బులెన్స్, మెడికల్ షాప్లు) మినహాయింపు ఉండాలని వారు స్పష్టం చేశారు. — దృష్టిలో పెట్టాల్సిన అంశాలు ఈ రిజర్వేషన్ వ్యవహారం కోర్టు, ప్రభుత్వ నిర్ణయములు, రిజర్వేషన్ పరిమితులు (50% మెక్సిమం) వంటి చట్టపరమైన అంశాలతో కూడుకున్నది. ఉదాహరణకు, సుప్రీమ్‌కోర్టు 50% క్యాప్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బంద్ వెలవడగా ఉన్నా, దీని వలన నిరంతర సమాధానం నమోదు కావడంలో ప్రభుత్వానికి, వర్గ సంఘాలకు భవిష్యత్ తరుచులైన డైలాగ్ అవసరం ఉంది. సాధారణ ప్రజల ప్రయాణాభ్యర్థనలు, బంద్ వలన కలిగిన అవాంఛిత ప్రభావాలు కూడా గమనించవలసినవి.

విశాఖపట్నం

బాణాసంచా అక్రమ నిల్వల పై పోలీసుల దాడి

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* *పోలీసు కమిషనర్ గారి అదేశాలతో బాణసంచా సామాగ్రి అక్రమ నిల్వల పై నగర వ్యాప్తముగా మెరుపు దాడులు* నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ వారు ఈరోజు అనగా 18.10.2025 న మధ్యాహ్నం నుండి వారి సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించడం జరిగినది. క్రింద పేర్కొన్న వారు ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా బాణసంచా నిల్వలు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి బాణసంచా సామాగ్రి, స్వాధీనపర్చుకొని, ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు అప్పగించడమయినది. బాణసంచా సామాగ్రి అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడమైనది. ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన సూరి కిషోర్, 42 సంవత్సరాలు వద్ద 70,000/- రూపాయలు విలువ గల అక్రమ బాణా సంచా స్వాధీనం. ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

అమరావతి

చంద్రబాబు తొ భేటీ ఐన ఉద్యోగ సంఘాల నేతలు

*అమరావతి* అక్టోబర్ పున్నమి ప్రతినిధి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో భేటీకి హాజరైన ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీకి హాజరైన మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు *మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ* గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తున్నాం గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడం చారిత్రాత్మక ఘట్టం రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నాం ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. ఎవరినీ కించపరిచే పరిస్థితి లేదు. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్ మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం. అంటే 91శాతం ఖర్చు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం పొరుగు రాష్ట్రాలన్నీ గత ఐదేళ్లలో జాగ్రత్తపడ్డాయి. తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 39 శాతానికి ఈ వ్యయాన్ని తగ్గించుకున్నాయి గత ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇబ్బందులు పడే పరిస్థితి. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు చేశారు.

తిరుపతి

మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర

శ్రీకాళహస్తి, అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ పట్టణంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మునిసిపాలిటీ కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కసి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రప్ప శెట్టి, డీవీ నారాయణ, కిట్టు,ఆర్ముగం, సాజిద్, సతీష్, రమణయ్య ,మరియు పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సి ఎం చంద్రబాబు

*ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు* అమరావతి అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *1 డీఎ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించాం.* *నవంబరు 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా డీఏ చెల్లింపు. రూ160 కోట్ల వ్యయం అవుతుంది* *పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం* *రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం* *60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం* *180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం.* *చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు* *ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించాం* *ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం* *ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం.* *4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తాం*

E-పేపర్

బాల అకాడమీలో- కన్నుల పండుగగా సాగిన దీపావళి పండుగ.

వెలుగులతో పాటు సంతోషాలను పంచే పండుగ దీపావళి. ఒక దీపం చీకటిని తరిమేస్తుంది.ఒక జ్ఞానం మనసుని మారుస్తుంది.వెలుగును పంచితే చీకటి తొలుగుతుంది.జ్ఞానంఫ్ పంచితే ప్రపంచం మారుతుంది. దీపావళి పండుగ సందర్భంగా దీపాలతో పూలతో అందమైన రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం అంతా అందంగా అలంకరించబడింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. మాధవి లత కరస్పాండెంట్ ఏం రవీంద్రనాథ్ లక్ష్మీ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రసంగాలు,గీతాలు, నృత్యాలతో పాల్గొని పండుగ వాతావరణం మరింత అందంగా మార్చారు .ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మేడం మాధవి లత మాట్లాడుతూ దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమని, విద్యతో అన్ని సాధించవచ్చు అని దుర్మార్గుడైన నరకాసురుడిని తల్లి అయిన భూదేవి సత్యభామ రూపంలో వధించిందని చివరికి అధర్మం పై ధర్మమే విజయం సాధిస్తుందని, ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులను ,సంతోషాలను నింపాలని సందేశం ఇచ్చారు. బాల అకాడమీలో 8వ తరగతి చదువుతున్న బి.సత్య వైష్ణవి వెంకటేశ్వర స్వామి వేషధారణతో వచ్చి అష్ట లక్ష్ములతో కోలాటం చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

విశాఖపట్నం

D J సౌండుకి కుప్ప కూలిన గోదా. ఎదుగురికి గాయాలు.

విశాఖపట్నం 18 అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) లోకేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట మండలం,భవానీ పురం వద్ద నందన, గౌరమ్మ ఉత్సవాల ముగింపు సంధర్బంగ ఊరేగింపులో డి జె ఏర్పాటు చేశారు. D J సౌండు తీవ్రతకు ఒక ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్నా ఎదుగురికి తీవ్రంగ గాయలు తగిలాయి. గాయ పదీనా వాళని వెంటనే హాస్పిటల్కి తారలించారు.పోలీసులు డి జె సిస్టమ్‌ను స్వాదినం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

సత్తుపల్లి బీజేపీ నాయకుల మీద దాడి ని ఖండించిన ధనియాకుల

పున్నమి ప్రతినిధి సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు బానోతు విజయ్‌పై కాంగ్రెస్ గుండాలు చేసిన అమానుష దాడిని ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ద్వేషంతో ఇటువంటి దారుణ దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను ఆయన డిమాండ్ చేశారు. బానోతు విజయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమని, కానీ హింసా మార్గం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దీపావళి బహుమతిగా పోలవరం నిర్వాసితులకు శుభవార్త

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది. గత సంక్రాంతికి ₹1000 కోట్లు విడుదల చేసిన NDA ప్రభుత్వం, తాజాగా దీపావళి సందర్భంగా అదనంగా ₹1100 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పునరావాసానికి ఇప్పటి వరకు మొత్తం ₹2100 కోట్లు విడుదల చేసినట్లైంది. అదనంగా, ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం గత 16 నెలల్లోనే కేంద్రం నుండి ₹12,157 కోట్లు పొందగలిగింది. ఈ నిధులతో పోలవరం పనులు మరింత వేగవంతం కానున్నాయి.

జాతీయ అంతర్జాతీయ

గుజరాత్ నూతన కేబినెట్‌లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి

గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న సీఎం భూపేంద్ర పటేల్ మినహా రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేయగా, నేడు నూతన కేబినెట్ ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలో కొత్త మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. రివాబా జడేజా గత కొంతకాలంగా గుజరాత్‌లో రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమె బీజేపీ తరఫున జామ్నగర్ నార్త్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని రివాబా జడేజా పదవీ స్వీకార అనంతరం పేర్కొన్నారు. గుజరాత్ కొత్త మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.